సచ్చరిత్ర పారాయణ సమయములో వచ్చిన కలకు, చాగంటి గారి ప్రవచనం ద్వారా అర్ధం తెలుసుకుని సంతోషించిన భక్తురాలు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఇందిరా దేవి గారి అనుభవములు రెండవ భాగం

మా ఇంటి ఓనర్ చాలా తన్మయత్వంతో ఇదంతా చెప్పుకుపోయింది. ఎందుకు ఈవిడ చదువుకొనిదానిలాగా బాబా అంటుంది.

ఆయనేమన్నా దేవుడా? పైగా ముస్లిం. ఈయన్ని పూజించటమేంటి? పైగా ఈ పారవశ్యం ఏమిటి?

ఇంతమంది దేవుళ్ళను కాదని ఈయన్నే ఎందుకు పూజించాలి అని నేను అనుకుని అయినా ఈవిడ ఇంతగా చెపుతోంది అసలీయన ఉన్నాడా?

ఒకసారి చేసి చూద్దాం అనుకుని నువ్వు నిజంగా కనుక ఉంటే నాకు నిదర్శనం కావాలి అనుకుంటూనే పద్ధతిగా 3 గంటలకే లేచి అన్నీ రూములు శుభ్రం చేసుకుని తలారా స్నానం చేసి పూలు తెచ్చుకుని, నియమంగా, నిష్టగా బాబా పారాయణ వారం రోజులు చదివి పూర్తి చేశాను.

నేను పారాయణ చేసినన్ని రోజులు మధ్యాహ్నం మాత్రం నిద్రపోకూడదు అని నియమం పెట్టుకున్నాను.

ఒక రోజు సోఫా లో అలా మధ్యాహ్నం ఒరిగాను. నిద్ర పట్టేసింది. ఆ నిద్ర లో నాకో కల వచ్చింది. ఆ రోజు పారాయణ అయిపోయింది. ఆ కల లో మా వారు చనిపోయినట్లుగా కనపడింది.

నేను బాగా ఏడుస్తున్నాను. నేను వెక్కిళ్ళు పెట్టి బయటకే ఏడుస్తున్నాను.

ఆ సమయంలో మా ఇంట్లో మా అత్తగారు ఉంది. ఆవిడ చెప్పిందా విషయం ఆ బాధతోనే భయంకరంగా ఏడుస్తున్నాను.

నా గుండె చప్పుడు నాకు బాగా తెలుస్తుంది. ఇలా కల వచ్చాక నేను మూడు రోజులయినా నేనీ లోకం లోకి రాలేకపోయాను.

నాకెందుకిలాంటి కల వచ్చింది అని నేను అనుకున్నానే కానీ ఎవరికీ చెప్పలేదు. ఈనాటిదాకా ఎవరికీ విషయం తెలియదు.

ఈ మధ్యనే శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచనంలో నేను వినటం జరిగింది. అందులో ఆయన ఏమి చెప్పారంటే

భగవంతుడు మనమేదయినా కర్మఫలం అనుభవించవలసి వస్తే అది నిద్రలో కల రూపం లో అనుభవింపజేస్తాడు. అని చెప్పారాయన.

అది విని నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నేను దాదాపు 20 సంవత్సరాలుగా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోవడానికి వీలులేక మానసికంగా నలిగిపోతున్నాను.

రెండవసారి పారాయణ చేసినపుడు నాకింకా మొదటిసారి పారాయణ చేసిన తర్వాత వచ్చిన కల నేనింకా మర్చిపోలేను. ఈలోగా రెండవసారి పూర్తి అయింది.

ఈ సారి కూడా నేను పారాయణ పూర్తి చేయంగానే మళ్ళీ మధ్యాహ్నం పూట నాకో కల వచ్చింది.

ఆ కలలో నేను ఎవరిదో ఇల్లు, మా ఇల్లయితే కాదు. ఆ ఇంట్లో నేను కట్టెల పొయ్యి మీద అన్నం వండుతున్నాను. ఈలోపు ఆ గుమ్మంలోకి బాబా వచ్చాడు. “నాకు ఆకలి వేస్తోంది అన్నం పెట్టమని అడిగాడు”

నేను కుండలో అన్నం వండి కలుపుతున్నాను. ఆయన అలాగే అన్నం పెట్టమని అడిగే సరికి నేను సగం ఉడికిన అన్నం పెట్టమంటావేంటి? అంటూ విసుక్కున్నాను.

ఆయన అయినా సరే పెట్టమన్నాడు. ఉడికే అన్నం కుండలోనుండి తీసి ఒక ప్లేట్ లో వడ్డించి తీసుకువచ్చి బాబా చేతికిచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను.

ఆయన ఆ ప్లేట్ అందుకుని నన్ను ఆశీర్వదిస్తున్నాడో శపిస్తున్నాడో కానీ, ఎదో గొణుగుతున్నాడు.

బాబా నువ్వేం అంటున్నావో కానీ వేరే వేరే ఆశీర్వచనాలు నాకు వద్దు దీర్ఘసుమంగళీభవ అని ఆశీర్వదించమని స్పష్టంగా చెప్పాను.

ఆయన నన్ను దీవించాడో లేదో కానీ బాబా అక్కడ నుండి లేచి బాల్కనీ లో ఉండే గ్రిల్స్ చిన్న సన్నని సందులో నుండి పెద్దగా ఉన్న బాబా చిన్నగా అయిపోయి బయటకు వెళ్లిపోయి పైన విమానంలో చాలా దూరం వెళ్ళిపోవటం నేను కలలో చూసాను.

దాని అర్ధం ఏంటో నాకు తెలియదు కానీ బాబా తన పిల్లలకు అన్యాయం మాత్రం చెయ్యడని నేను గాఢంగా నమ్ముతాను.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru,

ఇందిరా దేవి గారి అనుభవములు మూడవ భాగం తరువాయి…..

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “సచ్చరిత్ర పారాయణ సమయములో వచ్చిన కలకు, చాగంటి గారి ప్రవచనం ద్వారా అర్ధం తెలుసుకుని సంతోషించిన భక్తురాలు

Vara Sai Prasad

శ్రీ #సాయిబాబా వారి భక్తుల #ప్రత్యక్ష #అనుభవాలు సేకరణ : 10

* శిరిడీ సమాధిమందిరంలో తన భక్తురాలిని సాయిబాబా రక్షించిన లీల.*

కమలమ్మ అనే 60 ఏళ్ళ బాబా భక్తురాలు ముంబయిలోని మతుంగలో నివసిస్తూ ఉండేది. ఆమె ఒక తమిళియన్. తనకి తమిళం తప్ప వేరే భాష ఏదీ రాదు. 1944వ సంవత్సరంలో ఆమెకున్న ఒక్కగానొక్క కొడుక్కి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. దానితో ఆమె ఆర్మీలో తన బిడ్డకి ఏం జరుగుతుందో ఏమిటోనన్న ఆందోళనలో పడింది. ఆ విషయమై బాబాను శరణుపొందాలని నిశ్చయించుకొని, రైల్వేస్టేషన్‌కి వెళ్లి బుకింగ్ కౌంటర్‌లో శిరిడీకి ఒక టికెట్ ఇవ్వమని అడిగింది. కనీసం ట్రైన్ శిరిడీ వరకు వెళ్ళదన్న సంగతి కూడా ఆమెకు తెలియదు. అయితే బుకింగ్ కౌంటరులో ఉన్న క్లర్క్ బాబా భక్తుడు. అతడు కోపర్గాఁవ్ వరకు టికెట్టు ఇచ్చి, అక్కడ దిగి శిరిడీ వెళ్లాలని ఆమెకు చెప్పాడు. మొత్తానికి ఎలాగో తోటి యాత్రికులతో కలిసి శిరిడీ చేరుకొని, సమాధిమందిరానికి దగ్గరలో ఒక గది తీసుకుంది.

రాత్రి 8 గంటల సమయంలో ఆమె (అప్పట్లో)సమాధి వెనుకవైపు ఉన్న మెట్లకు హద్దుగోడ ఏమీ లేదన్న సంగతి తెలియక ఆ చీకటిలో జారి బావి వద్ద పడిపోయింది. చాలా గాయాలయ్యాయి. ఆమె మోకాలికి, నుదుటికి తగిలిన గాయాలవలన రక్తం కారసాగింది. ఎలాగో మొత్తానికి అతికష్టం మీద అక్కడనుండి బయటకు వచ్చిన తర్వాత మిస్టర్ బాల్‌‌వల్లి అనే అతడు ఎదురుపడ్డాడు. అతనితో తను పడిపోయిన విషయాన్ని, తనకి తగిలిన గాయాల గురించి చెప్పింది. అప్పుడతను, “మిమ్మల్ని నేను డాక్టర్ వద్దకు తీసుకుని పోతాను, పదండమ్మా” అని అన్నాడు. అందుకు ఆమె నిరాకరిస్తూ ఆసక్తికరమైన విషయాన్నిలా చెప్పింది: “నేను పడిపోయినప్పుడు నా ప్రక్కగా ఒక వ్యక్తి నిలుచుని ఉండటం చూశాను. తల పైకెత్తి చూస్తే ఆయన మరెవరో కాదు, సాక్షాత్తూ ‘శ్రీసాయిబాబా’యే! ఆయన తన చేతిలో లాంతరు పట్టుకుని నిలబడి ఉన్నారు. ఆయన తమ కోమలమైన హస్తాలతో గాయపడ్డ నా శరీరభాగాలపై మృదువుగా స్పృశిస్తూ, “రేపటికల్లా నీకు నయమైపోతుంది. ఇంకేవిధమైన చికిత్సా అవసరం లేదు” అని అభయమిచ్చారు” అని. తర్వాత ఆమె తన గదికి చేరుకుంది. అంతలా గాయాలైనప్పటికీ ఎటువంటి నొప్పులూ ఆమెను బాధించకపోవడంతో ప్రశాంతంగా నిద్రపోయింది. మధ్యరాత్రిలో అమెకొక కల వచ్చింది. ఆ కలలో బాబా కన్పించి, “నేను నీ బిడ్డని కూడా క్షేమంగా చూసుకుంటాను. నువ్వేమీ తన రక్షణ విషయంలో దిగులుపడాల్సిన అవసరంలేదు” అని అభయమిచ్చారు.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles