పారాయణ లో భక్తుడు తనకు తాను పెట్టుకున్న ఆంక్షలకు బాబా సమ్మతి.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


వినయ్ కుమార్ గారి అనుభవములు మొదటి భాగం

నా పేరు వినయ్ కుమార్, నేను నా భార్య ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు చెన్నైలో ఉండి, ఇప్పుడు హైదరాబాద్ వనస్థలిపురం లో అమ్మ, నాన్నలతో ఉంటున్నాము.

మేము మామూలుగా ‘రాఘవేంద్ర స్వామి’ ని ఆరాధన చేస్తాము. మాది కర్ణాటక. మా ఇంటి దేవుడు ‘వెంకటేశ్వర స్వామి’.

మాకు బాబా ఎలా పరిచయం అంటే నేను నాలుగవ తరగతి చదువుతున్నపుడు మేము ‘దబీర్పూరా’ లో ఉండేవాళ్ళం.

మా ఇంటికి ఎదురుగా కొత్తగా ఒకళ్ళు రెంటుకి వచ్చారు. వాళ్ళు బాబా ఫోటో పెట్టి పూజలు చేస్తూ హారతి పాడుతూండే వాళ్ళు.

మాకు ఆ ఆరతి పాటలు కొత్తగా వినటం మూలాన వింతగా చూసేవాళ్ళం. వాళ్ళని మీరు ఏ దేవుడి పూజ చేస్తున్నారు, మీరు పాడుతున్నవేంటి అని అడిగాము.

వాళ్ళు షిరిడి లో ఉన్న శ్రీ సాయిబాబా వారు. ఆయనకి హారతులు అంటే ఇష్టం అవే మేము పాడుతున్నాము అని చెప్పారు.

మేము పిల్లలమంతా ఒక పది, పదిహేను మందిమి కలిపి అందరము చందాలు అంటే 10 పైసలు, 25 పైసలు, వేసుకుని పంచదార, పుట్నాలు, ఇలాంటివి కొనుక్కుని

అప్పట్లో హైదరాబాద్ లో ‘చాదర్ ఘూట్’ లోనూ, పద్మారావునగర్లోనూ మాత్రమే, బాబాగారి గుడులు ఉండేవి.

మేము మా ఇంటిదగ్గర నుండి అంటే దబీరుపురా నుండి చాదర్ ఘూట్ కి 2 కిలోమీటర్లు. నడుచుకుంటూ వెళ్లి హారతి చూసుకుని వస్తూండేవాళ్ళం. అలా బాబా పరిచయం.

నాల్గవ తరగతి నుండి మళ్ళీ 9 వ తరగతి వరకూ అలా చేసాను. నేను మళ్ళీ బాబా గుడికి వెళ్ళలేదు.

మా నాన్న గారి ఉద్యోగ రీత్యా అన్ని ఊళ్లు తిరుగుతూ మళ్ళీ మేము హైదరాబాద్ వనస్థలిపురం చేరాము.

ఇక్కడ అప్పట్లో ‘ప్రశాంత్ నగర్’ లో మొట్ట మొదట బాబా గుడి విగ్రహ ప్రతిష్ట జరుగుతోందని తెలిసి వెళ్ళాము. మళ్ళీ నాకు బాబా ప్రేరణ ఇచ్చినట్లు అయింది.

నేను బాబా పారాయణం చేయాలనుకున్నాను. నేను చదువుతోంది 9 వ తరగతి.

నాకు బాబా ఏంటో, ఎవరో తెలియదు. ఆయన మనలని ఇంత ప్రభావితం చేస్తాడని ఆనాడు ఏం తెలియదు.

ఏదో చదవాలంటే చదవాలి అనుకున్నాను. ఏదో యాంత్రికంగా చదివి పూర్తి చేసాను.

ఆ తర్వాత నేను ICW చదువుతున్నపుడు అక్కడ ఎగ్జామ్స్ చాలా కష్టం. ఎంత చదివినా ప్రయోజనం అనేది కొంతవరకే ఉంటుంది.

ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే దైవబలం చాలా అవసరమనిపించింది. ఏం చేయాలి అని ఆలోచించాను. నాకు ఇంక బాబా గారి పారాయణం ఒక్కటే సమాధానంగా తోస్తోంది.

ఏదో మామూలుగా నేను 9 వ తరగతి లో పారాయణ చేసినట్లుగా కాకుండా నా మనసుకు బాగా తృప్తిగా అనిపించేలాగా చదవాలి అనిపించింది.

నాకు నేనే కొన్ని ఆంక్షలు విదించుకున్నాను. గురువారం పారాయణం మొదలు పెట్టాలి.

అదీ ఎలా అంటే ఉదయాన్నే కాకడా ఆరతి చేసుకొని ఆ సరికే స్నానం చేసేసి, పారాయణం మొదలు పెట్టాలి

అదీ తెల్లని బట్టలు నీలం అంచుతోటి కట్టుకోవాలి. వారం రోజులు పారాయణ చేస్తే ఈ వారం రోజులు కూడా గడ్డం గీసుకోకూడదు.

సాత్విక భోజనం అదీ రాత్రి హారతి కూడా చేసుకొని విష్ణుసహస్రనామం చేసుకొని అప్పుడు తినాలి. ఇలా నియమం పెట్టుకుని చదవాలనుకున్నాను.

ఈ వారం రోజులు చెప్పులు కూడా వేసుకోకూడదు, ఇలాంటి నియమాలన్నీ నాకు నేను తయారుచేసుకున్నాను.

అమ్మతో చెప్పాను. నేను బాబా పారాయణం చేయాలనుకుంటున్నాను అని నేను ఏ విధంగా చేయాలనుకుంటున్నానో కూడా చెబుతూ ఇంకా బాబాకి అఖండదీపం ఒకటి పెడితే సరిపోతుంది.

కానీ నేను ఆ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి పెట్టాలనుకుంటున్నానని కూడా చెప్పాను.

అమ్మ బాబాకి ఎటువంటి నియమాలు కూడా లేవు, ఆయనకీ కావలసింది భక్తి, ప్రేమ, విశ్వాసం మాత్రమే. ఉపవాసం కూడా ఉంటానంటున్నావు ఆయనకది అసలు ఇష్టం లేదు అంది.

ఏమోనమ్మా నా మనసుకిలాగా చేస్తే బావుంటుంది అని తోచింది అని చెప్పాను.

రేపు గురువారం అనగా ఒక బల్ల కొన్నాను. దానిపైన బాబా ఫోటో పెట్టాను. తెల్లవారింది. 3 గంటలకే నిద్ర లేచాను.

గబగబా తయారయ్యాను. కాకడా ఆరతి చేసుకుని పారాయణం మొదలు పెట్టాను. తర్వాత సాయంత్రం, రాత్రి కూడా ఆరతి చేసుకుని రాత్రి విష్ణుసహస్రనామం చదువుకొని అప్పుడు టిఫిన్ మాత్రమే తిని పడుకున్నాను. అలా వారం రోజులు అయ్యాయి.

గురువారం నాడు మహా నైవేద్యం చేసి dilsukhnagar గుడికి సాయంత్రం వెళ్లాను.

నేను గుడిలో అడుగు పెట్టె సరికి ఎదురుగా బాబా నేనేవైతే వారం రోజులుగా తెల్ల బట్టలు నీలం అంచుతోటి ఎలా ఉన్నానో బాబా కూడా అదే డ్రెస్ లో కనపడ్డాడు.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru,

వినయ్ కుమార్ గారి అనుభవములు రెండవ భాగం తరువాయి….

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles