Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంత దాస్ గారి అనుభవములు ఐదవ మరియు ఆఖరి భాగం
నాకు ఆపరేషన్ అయిపోయింది. ఇది జరిగిన మూడు నెలలకి నాకు కడుపులో బాగా నొప్పి వచ్చింది. హాస్పిటల్ కి వెళ్లాను.
గ్వాల్బాడర్ లో రాళ్లు ఉన్నాయ్ అన్నారు. 5 రోజులు హాస్పిటల్ లో ఉన్నాను. చుక్క మంచినీరు కూడా నన్ను త్రాగనివ్వలేదు. మొత్తానికి తగ్గింది.
ఇది జరిగిన 6 నెలలకి మళ్ళీ నాకు ఆయాసం వస్తుంటే హోమియో డాక్టర్ దగ్గరకి వెళ్లాను.
ఆయన నువ్వు ఎక్కడైతే ఆపరేషన్ చేయించుకున్నావో అక్కడికి వేళ్ళు అన్నాడు. నేను చుట్టూ పక్కల వాళ్ళ ప్రోద్బలం తో ఉషా ముళ్ళపూడి కార్డియో సెంటర్ కి వెళ్లాను.
అక్కడ నాకు మళ్ళి యాన్జీయోగ్రాం చేసారు. బైపాస్ ఆపరేషన్ చేయాలన్నారు, చేసారు.
అప్పటినుండి మా ఆవిడ నన్ను ఎక్కువగా కష్టపడొద్దు అంది. 8 నెలలు రెస్ట్ తీసుకున్నాను.
మల్లేపల్లి అంత దూరం, బస్సులో గాని డ్రైవ్ చేసుకుంటూ బండి మీద గాని వెళ్లొద్దు అంది. అంతదూరం వెళ్లకుండా నేను పని ఎలా చేయాలి అని ఆలోచించాను.
అక్కడ షాపు తీసేసి నా సొంత ఇంటి షాప్ లోకి నా దుకాణం మార్చాలనుకున్నాను.
ఉన్నవాళ్ళని ఎలా ఖాళీ చేయించాలా అనుకునేంతలో వాళ్ళే వచ్చి షాప్ ఖాళీ చేస్తామన్నారు.
నేనసలు పని చేయాలా వద్ద అని బాబా ముందు చీటీ వేసాను. చెయ్యి అని వచ్చింది.
2 షట్టర్లు లో ముందు ఒకటి ఖాళీ చేయమన్నాను. ముందు ఒక షాపులో మొదలుపెట్టాను. ఆ తరువాత రెండవ షాపు కూడా నేనే వాడుకుంటున్నాను. గిరాకీ బాగానే ఉంది.
నేను ఉప్పల్ లో 250 గజాల స్థలం కొన్నాను. ఆ స్థలం లో బాబా కూర్చునే రాయిలాంటిది ఒకటుంది. మొన్న 2016 గురుపౌర్ణమికి ఆ రాయి పైన బాబా ఫోటో పెట్టి దీపం పెట్టి వచ్చాను.
ఎందుకంటే బాబా అనుగ్రహం ఉంటే అక్కడ బాబా గుడి కట్టించాలని. ఈ గుండె సమస్య వచ్చేవరకూ ప్రతి గురువారం వెళ్ళేవాడిని.
ఇప్పుడు అంత దూరం వెళ్లలేకపోయేవాడిని. మా ఇంటి పక్కనే ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది.
ఆ గుడికి వెడుతుంటాను. ఉప్పల్ వెళ్లి గుడి కోసం పని చేసే స్థితి లో నేను లేను. మా ఇంటి దగ్గర మరో ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది.
ఆ గుడి ఎదురుగా స్థలం అమ్మకానికి వచ్చింది. నేను ఎటు తిరిగి ఉప్పల్ లో గుడి కట్టాలనుకున్నా తిరిగే పరిస్థితిల్లో నేను లేను.
అందుకని ఆ స్థలం అమ్మి దానితో ఈ స్థలం కొనాలనుకున్నాను. ఆ స్థలం 12 లక్షల 50 వేలకి అమ్మాను.
ఇక్కడ స్థలం 150 గజాలు 12 లక్షలకి కొని 50 వేలతో రిజిస్ట్రేషన్ చేయించాను. బాబా అనుగ్రహముంటే రేపు దసరాలలో బాబా ఫోటోనో, విగ్రహమో పెట్టి పూజ చేయించాలనుకుంటున్నాను.
నేను వారం రోజులపాటు బాబా పారాయణం చేశాను. ఆఖరి రోజు 5 గురికి భోజనం పెట్టాలనుకున్నాను.
హారతి ఇచ్చి ఆ తరువాత భోజనాలు పెట్టాలని 5 గురికి చెప్పి వచ్చాను. సమయం అయిపోయినా ఎవరూ రాలేదు.
ఈలోపు తలుపు శబ్దం వచ్చింది. అమ్మయ్య అని తలుపు తీస్తే మా మామగారు సరేనని పోనీలే ఈయనన్న వచ్చాడని అనుకునేంత లో మళ్ళీ తలుపు శబ్దం అయ్యింది.
వెళ్లి చూస్తే ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. మాకు ఆకలిగా ఉంది. మీరు ఈ రోజు మాకు భోజనం పెట్టగలరా!
అదీగాక మావాళ్లు ముగ్గురు ఆసుపత్రి లో ఉన్నారు. వారికీ భోజనం క్యారియర్ లో పెట్టి ఇస్తే తీసుకెడతాం అని కూడా అన్నారు. వారికి వడ్డించాము, తిన్నారు.
వారడిగిన ముగ్గురికి క్యారియర్ లో పెట్టి ఇచ్చాము. వారు తీసుకెళ్లారు. ఆ తరువాత మేము పిలిచిన అయిదుగురు వచ్చి భోజనాలు చేసి వెళ్లారు.
మేము ఒకసారి షిరిడికి వెళ్లినప్పుడు మేము నలుగురం ఫ్రెండ్స్ వెళ్ళాము. మేము రైల్ ఎక్కాము.
మా ఎదురు సీట్లో ఒక తండ్రి కొడుకు ఉన్నారు. మేము మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఆసక్తితో వింటున్నారు.
నాగర్ సోల్ లో రైల్ ఆగింది. మేము వెళ్లి ఫ్రీ బస్సు ఎక్కాము. మా వెనకాలే మమల్ని అనుసరించి వాళ్ళు ఎక్కారు.
మేము ధూళి దర్శనానికి వెళితే వాళ్ళు అక్కడ ప్రత్యక్షం అయ్యారు. మేము రూమ్ కావాలని వెడితే వాళ్ళు అక్కడ ఉన్నారు.
రూమ్ ఇవ్వాలి అంటే 5 గురు ఉండాలి. అప్పుడు వాళ్ళు మేము షిరిడికి మొదటి సారి వచ్చాము. మేము మీతోపాటే ఉంటాము అన్నారు. సరేనన్నాము.
అన్నీ చూసాము. బాబా దర్శనం అయ్యింది. వాళ్ళు వైజాగ్ నుండి వచ్చారు.
వాళ్ళు వాళ్ళ ఊరికి తీసుకెళ్ళటానికి కొన్ని వస్తువులు కొనుక్కుంటామంటే అందరమూ షాపింగ్ కి వెళ్ళాము.
మేము మాకు కావాల్సినవి కొనుక్కున్నాము. ఎవరి సామాను వారికి ప్యాక్ చేయమని చెప్పాము. అన్ని ప్యాక్ అయిపోయాయి, రూమ్ కి వచ్చాము. రైల్ సమయం అయిపోతుంది.
ఎవరి సామాను వారు సర్దుకునే హడావిడిలో ఉన్నాము. నేను ఒక బాబా విగ్రహం కొన్నాను. అది కనపడటం లేదు అంటాడు తండ్రి.
ఎవరి సామాను వారు తెచ్చుకున్నారు కాబట్టి ఎవరికీ వారే వారి సామాన్లతో ఆ విగ్రహం కలిసి ఉంటుందన్న ఆలోచన రాలేదు.
ఏమయిందో ఏమయిందో అనుకున్నాడు అతను. తీరా నేను హైదరాబాద్ చేరిన తరువాత చూసుకుంటే నా ప్యాక్ లో బాబా విగ్రహం ఉంది. నాకేం చేయాలో తోచలేదు.
పాపం ఆయన కొనుకున్న విగ్రహం అనుకోకుండా నా సామాన్లతో వచ్చేసింది.
నేను ఆ విగ్రహం పూజామందిరంలో పెట్టుకున్నాను. ఇప్పటికి ఆ విగ్రహం అలాగే ఉంది.
సర్వం శ్రీ సాయినాథాయ చరణారవిందార్పణ మస్తు.
శుభం భవతు.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru,
Latest Miracles:
- తన మందిర (దిల్ సుఖ్ నగర్ బాబా గుడి) నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించిన బాబా వారు
- తన భక్తుల మేలు కొరకు దుర్గ మమగు ఏ కార్యమైనా సుగమం చేయు బాబా వారు.
- కష్టాలలో ఉన్న మాకు రతన్ బాబా గారి ద్వారా అభయం ఇప్పించిన బాబా వారు.
- బాబా వారి అనుమతి లేకుండా చేసిన పనిలో నష్టాల పాలైన భక్తుడు…Audio
- మందిర నిర్మాణం – మారిన మనసులు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments