తన భక్తుల మేలు కొరకు దుర్గ మమగు ఏ కార్యమైనా సుగమం చేయు బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా పెద్ద వాడు కూడా మాతో పాటు వస్తే బావుండేది అనిపించింది. కానీ రాలేడు కదా! మరో సారి వాడిని తీసుకువెళ్ళాలి అనుకున్నాను.

ఆ తర్వాత మా వాడు ఆ జాబ్ లో జాయిన్ అవ్వడం అది కొద్ది రోజులు చేసాక , దాని కంటే మెరుగైన ఉద్యోగానికి అప్లికేషన్ పెడితే, అందులో సెలెక్ట్ అయ్యాడు. ఇంటర్వ్యూ అయింది.

కానీ ”అమ్మా! నాకెందుకో ఈ జాబ్ రాదనిపిస్తోంది” అన్నాడు. నేను ”ఒరేయ్! ఆ సాయినాథుని దగ్గరకి నిన్ను తీసుకువెళతాను. నమ్మకం పెట్టుకో ఆశ వదులుకోకు” అన్నాను. ఆ సాయినాథుని దయతో వాడికా ఉద్యోగం వచ్చింది.

ఆ ఉద్యోగం లో జాయిన్ కూడా అయ్యాడు ట్రైనింగ్ కి పంపించారు. అందరికీ ప్రాజెక్ట్ allot చేసారు కానీ, వీడికి మాత్రం ఏ ప్రాజెక్ట్ allot చేయలేదట.

ఆ ప్రాజెక్ట్ allot చేసే మేనేజర్ మావాడిని పిలిచి ”నీకు ప్రాజెక్ట్ allot అవ్వడం కష్టం, నీకు అవదు. నువ్వు వేరే ఉద్యోగం వెతుక్కుని వెళ్ళిపో!” అని చెప్పాడట.

ఆ సంగతి వాడు నాకు ఫోన్ చేసిచెప్పాడు. ”అమ్మా! అంతా అయిపోయింది. నేను మళ్లీ రోడ్డున పడ్డాను. నన్ను వెళ్ళిపో అని మా మేనేజర్ చెప్పేసాడు.” అంటూ ఫోన్ లోనే బోరున ఏడ్చేశాడు.

నేను ”ఏం కాదమ్మా! ఏం భయపడకు, నువ్వు ఒక్కరోజు వీలుచూసుకుని, ఇక్కడికి రా, మనిద్దరం కలిసి శిరిడీ వెళ్లి ఆ సాయినాథుని దర్శనం చేసుకుని వద్దాము.

దానితో నీకంత సర్దుకుంటుంది. నీకు తప్పకుండ ప్రాజెక్ట్ ఇస్తాడు. నీకంత మేలే జరుగుతుంది. నీ ఉద్యోగం ఎక్కడికి పోదు నువ్వు రా ముందు చెపుతాను” అని మా వాడికి ధైర్యం  చెప్పాను.

”ట్రైనింగ్ సమయం సెలవు ఇస్తారో ఇవ్వరో ట్రై చేస్తా” అన్నాడు. మా వాడు మొత్తానికి సెలవు పెట్టి వచ్చాడు.

వెంటనే మేము ఇద్దరం షిరిడికి బయలుదేరాము. షిరిడి బయలుదేరే ముందే మా వాడు ”అమ్మా! నువ్వు రమ్మన్నావు కాబట్టి వచ్చాను. షిరిడి వెళదామంటే వెళదాం, కానీ ఆ ప్రాజెక్ట్ మాత్రం allot చేయరమ్మా

ఎందుకంటే ఎవరైతే ప్రాజెక్ట్ allot చేస్తారో ఆ మేనేజర్ నా దగ్గరికి వచ్చి స్వయం గా నీకు ప్రాజెక్ట్ లేదు, నువ్వు చెయ్యడానికి ఇక్కడేమీ లేదు.

నువ్వు వేరే ఉద్యోగం వెతుక్కుని వెళ్లిపొమ్మనమని చెప్పేసాక ఇంకా ఏం ఆశపడమంటావమ్మా?” అన్నాడు వాడు.

షిరిడి వెళ్ళాము బాబా దర్శనం చేసుకున్నాము. బాబాని చూడంగానే నాకు ఏడుపు వచ్చేసింది.

”చాలా మంచి ఉద్యోగం బాబా, మార్కులు తక్కువగా ఉన్నా, ఉద్యోగం చూపించావన్న సంతోషం లేకుండా చేస్తావా? బాబా! పిల్లవాడి భవిష్యత్తు మొగ్గలోనే తుంచేస్తావా బాబా!” అంటూ మొరపెట్టుకున్నాను.

గుడిలో నుంచీ బయటికి రాగానే ఆ ప్రాంగణంలోనే ”ఒరేయ్! నువ్వు పూనా వెళ్లి జాయిన్ అవ్వగానే ఆ మేనేజర్ నిన్ను పిలిచి ప్రాజెక్ట్ మీద సంతకాలు తీసుకుంటాడు రా” అని చెప్పాను.

దానికి వాడు ”అమ్మా! నీకింకా భ్రమ పోలేదా? అదింక కుదరదమ్మా! నేను వెళ్ళంగానే మళ్లీ ఉద్యోగ వేట సాగించాలి. అనవసరంగా నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోకమ్మా” అన్నాడు.

వాడు పూనా వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళాక మరునాడు ఆఫీస్ పయనం అయ్యేదాకా ఉండి వరసగా వాడికి అక్కడి విషయం తెలుసుకోవటం కోసం మా అబ్బాయికి ఫోన్ చేస్తూనే ఉన్నాను.

ఏమంటున్నాడు మేనేజర్ అంటూ అడుగుతూనే ఉన్నాను. వాడు ఏం లేదమ్మా అంటూనే ఉన్నాడు.

నేను మాత్రం ముందు గంట గంటకి, తర్వాత అరగంట కోసారి వాడికి ఫోన్ చేస్తూనే ఉన్నాను.

ఇంక వాడికి విసుగెత్తి ”ఈ విషయమే మాట్లాడేటట్లయితే, నాకింకా ఫోన్ చేయకు, ఎందుకంటే నాకింకా ఆశలేదమ్మా అని అనేశాడు, వాడు అంత చెప్పాక కూడా ఇదెలా జరుగుతుంది”,

అనవసరంగా వాడినేందుకు ఇబ్బంది పెట్టడం, ఫోన్ చెయ్యడం ఆపి బాబా ముందు కూర్చున్నాను బాబాని ప్రార్ధిస్తున్నాను.

ఆ సమయంలో పూనాలో మా అబ్బాయి మేనేజర్ మా వాడిని పిలిచాడట.

ఏం వినవలసి వస్తుందో, ఏం చెబుతాడో అనుకుంటూ ఆయన రూంలోకి అడుగుపెట్టాడట.

మా వాడిని కూర్చోమని, వీడు కూర్చున్నాక ”నీకు ప్రాజెక్ట్ allot చేస్తున్నాను” అని చెప్పాడట. ఆ విషయం చెప్పి ఫైల్ మీద సంతకం కూడా తీసుకున్నాడట.

సరిగ్గా సాయంత్రం 4 . 00 గంటలకి మా వాడు నాకు ఫోన్ చేసి నాకీ విషయం చెప్పాడు.

నేను వాడికి 3 . 30 దాక ఫోన్ చేశాను. ఆ తర్వాత నేను ఫోన్ చెయ్యడం ఆపి బాబా ముందు కూర్చున్నాను. నాకీ విషయం తెలిసిన తర్వాత నా ఆనందానికి అవధులు లేవు.

అప్పటిదాకా నిరాశతో ఉన్న మా వాడు ఫోన్లోనే ఆనందంతో ఏడుస్తున్నాడో, నవ్వుతున్నాడో తెలియటంలేదు.

దుర్గ మమగు ఏ కార్యమైనా సుగమమే అగు నీ శరణు అన్న బాబా, అని బాబాకి శతకోటి వందనాలు అర్పించాను.

తనను నమ్మిన వారిని బాబా ఎలా కాపాడి రక్షిస్తాడో ఎలా ఎలా తనపై నమ్మకాన్ని ద్విగుణీకృతం చేస్తాడో నా అనుభవం తెలియచేస్తుంది.

ఇప్పుడు మా బాబు ఆ పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles