శీతల ధుని …. మహనీయులు – 2020… జూలై 5



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా ధునిని ఎప్పుడు వెలిగించారో, ఎక్కడ వెలిగించారో అన్నది ఊహాస్పదమే.

ధునివాల దాదా మాత్రం ధునిని గురుపూర్ణిమనాడు వెలిగించారని అందరూ చెప్పుకుంటారు. అందుకే ఆ దినం పర్వ దినంగా భావిస్తారు.

సాయిబాబా ధునిలో చేయి పెట్టి ఆహుతి కాబోయే కమ్మరి బిడ్డను ధుని మంట (అగ్ని) నుండి కాపాడాడు.

రాఘవేంద్రస్వామి ధునిలో నుండి, అంతకు ముందు తాను అగ్నికి సమర్పించిన హారాన్ని బయటకు తీసారు.

దబల్ పూర్ వాస్తవ్యుడు రాంరతన్  సాయిఖేడాలో స్థిరపడ్డ ధునివాలా దాదా భక్తుడు.

రాంరతన్ మనుమడు నాలుగేండ్ల వాడు. క్షయ వ్యాధి సంక్రమించింది. వైద్యం విఫలమైంది.

ఆ బిడ్డడి తల్లిదండ్రులు జబల్ పూర్ నుండి, వ్యాధిగ్రస్తుడైన బిడ్డడిని దాదా వద్దకు తీసుకువస్తున్నారు. కానీ, దారిలోనే ఆ బిడ్డ ప్రాణం పోయింది.

ఈ సంగతిని తల్లిదండ్రులు గ్రహించారు. వారు వెనుదిరిగి పోలేదు. ఏమి చేసినా ధునివాల దాదాయె దిక్కు అని ఆ భక్తులు ఆయన వద్దకే ప్రయాణం కొనసాగించారు.

ఆనాడు దాదా చుట్టూ అనేక వేలమంది భక్తులున్నారు. వారినందరిని త్రోసుకుపోవటం కుదరని పని.

దాదాజీని ఉద్దేశించి, ఎంతో హృదయ విదారకంగా “ఎందుకయ్యా” అనే పాట పాడారు.

దాదా ఆ పాటను పాడుతున్న వారిని తీసుకురమ్మని ఎవరినో పంపారు. ఆ వ్యక్తి వెంట ఆ దంపతులు మరణించిన బిడ్డతో గురుదేవుని సన్నిధి చేరారు.

చనిపోయిన బిడ్డను తీసుకుని దాదాజీ, మండుతున్న అగ్ని గుండం (ధుని)లో వేశారు. ఆ బిడ్డడిపై ఉన్న వస్తాలన్నీ కాలిపోయాయి.

అగ్నీ గుండం నుండి బిడ్డ అరుస్తున్నాడు. ఆ ఏడుపు కన్న తల్లి చెవికి సోకింది. వెంటనే ఆమె ఏమీ ఆలోచించకుండా, మండుతున్న ధునిలో రెండు చేతులను పెట్టి బిడ్డను బయటకు తీసింది. ఆమె చేతులు కాలలేదు.

అగ్ని మంట ఆమెను ఏమీ చేయలేదు. పైపెచ్చు, ఆ అగ్ని శీతలంగా ఉంది. ఆమె ఆశర్యపోయింది. ఇంకా ఆశ్చర్యం! ఆ బిడ్డ సజీవుడై ఉన్నాడు.

ఆ బిడ్డతో తల్లిదండ్రులు దునివాల దాదా పాదాలపై పడ్డారు. దాదాకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలరు వారు. ఆ ఇంట నిత్య అగ్ని హోత్రం వెలుగుతోంది.

దాదాజీ 1939లో మహాసమాధి చెందినా, ఆయన సజీవులే. నేటికి, ఆ ధుని వెలుగుతోంది. ప్రత్యేక ఉత్సవం గురుపున్నమి నాడు జరుగుతుంది.

“మహాసమాధి అనంతరం కూడ నేను నిత్యా జాగరూకుడనే” అనే ఆయన సూక్తి కొండంత ధైర్యాన్నిస్తుంది.

నేడు జూలై 5, 2020. గురుపూర్ణిమ, నేడు ధునివాల దాదాను స్మరించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles