Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మద్రాసులో ఉంటున్న శ్రీనివాసన్ అనే భక్తునికి స్వామి శివానంద సరస్వతి ఆశ్రమం నుండి చ్యవనప్రాశ డబ్బా ప్రసాదంగా వచ్చింది.
ఆ భక్తుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. “నాకెందుకు ఈ డబ్బా?” అనుకున్నాడాయన. అయన దగ్గర కెవరో తెలిసిన వారొస్తే, వారికి చ్యవనప్రాశ డబ్బాను ప్రసాదంగా ఇచ్చాడు శ్రీనివాసన్.
మరునాడు శ్రీనివాసన్ కు విపరీతమైన నీరసం వచ్చింది. అయ్యో, తొందరపడి ఆ ప్రసాదపు డబ్బాను ఇచ్చివేశానే అని చింతించాడు.
ఐతే ఇంకో గంటకల్లా మరో చ్యవనప్రాశ డబ్బా వచ్చింది ఆశ్రమంనుండి.
ఒకసారి సాయిబాబాకు ఒక భక్తుడు దక్షిణ ఇస్తే, దక్షిణ నుండి కొంత డబ్బు ఇచ్చి “ఇది ఉంచుకో పనికి వస్తుంది అన్నారు”.
తన దగ్గర ఉన్న డబ్బేకాక, సాయిబాబా ఇచ్చిన డబ్బు మేరకు అవసరం వచ్చింది ఆయనకు.
కుప్పుస్వామి కొన్నేళ్ళ తరువాత శివానంద సరస్వతి అయ్యారు. రెండు చేతులా, న్యాయబద్దంగా, డాక్టరుగా బాగా సంపాదిస్తున్న ఆయన ఒకసారి కడప సచ్చిదానందస్వామి రచించిన “జీవ బ్రహ్మైక్య వేదాంత రహస్యము” అనే గ్రంథాన్ని చదివాడు.
ఆయన ఇక ఆద్యాత్మికం వైపు వడి వడిగా అడుగులు వేశారు. ఆయన సామాన్యంగా మూడు సంచులతో వెళుతూంటారు ఎక్కడకు వెళ్ళినా,
ఒక సంచీలో ఆధ్యాత్మిక సాహిత్యం, రెండవ సంచీలో పండ్లు, మూడవ సంచీలో మందులు ఉంటాయి. ఎవరి అవసరానికి వీలైతే ఆ సంచినీ వాడతారు.
ఒకసారి ఆయనకు ఒక కేంద్ర ప్రభుత్వోద్యోగి నుండి అధికార హోదాలో ఉత్తరం వచ్చింది.
ఆ ఉత్తరంపై అధికారి పేరు, విలాసము ఉన్నాయి. శివానందులు ఒక పుస్తకాన్ని ఆ అధికారికి పంపారు.
ఆ అధికారి “ఇటువంటి పుస్తకాలు నాకు పంపి నా సమయమును వృధాచేయవద్దు” అని జాబు వ్రాశాడు. సరే అనుకుని ఇక పంపటం మానివేశారు శివానందులు.
రెండు సంవత్సరాలు గడిచాయి. ఆ వ్యక్తి దగ్గరనుండి ఉత్తరం వచ్చింది. “మన్నించండి. రెండేళ్ళ క్రితం నాకు మీ నుండి ఒక పుస్తకము వచ్చింది. నేను చదవలేదు.
అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారాయి. ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు. యాధాలాపంగా మీ పుస్తకాన్ని తీసాను.
‘ఎప్పుడూ నిరాశ చెందకు’ అనే పీజీ వచ్చింది. స్ఫూర్తిని పొందాను. మీ పుస్తకం నన్ను కాపాడింది” అని ఆ వ్యక్తి వ్రాశాడు.
శివానందులవారు జ్ఞాన దానానికే ప్రాధాన్యత నిస్తారు.
డివైన్ లైఫ్ సొసైటి సంస్థాపకుడైన శివానంద సరస్వతులు 14 జూలై, 1963న దేహాన్ని విడిచారు.
నేడు జూలై 14. స్వామి శివానందుల వర్థంతి. ఆయన చెప్పిన ఒక బోధను పాటిద్దాం!
“ప్రార్దించు. మీ కొరకే కాదు, ఇతరుల కొరకు!”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- స్వర్ణ పత్రంలో స్వామి భోజనం…. మహనీయులు – 2020… నవంబర్ 16
- పదములె చాలును, ఓ సనాతనా! … మహనీయులు – 2020… జూలై 31
- అడ్డదారి …. …. మహనీయులు – 2020… ఆగస్టు 3
- ప్రసాదం – దర్శనం మహనీయులు – 2020… జూలై 22
- బాలకృష్ణా! నిన్ను నే చేరి కోలతు…. మహనీయులు – 2020… జూలై 8
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments