Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా గురువువద్ద తప్ప వేరే పాఠశాలలో చదివినట్లు లేదు.
స్వామి చిన్మయానంద సరస్వతి పూర్వాశ్రమపు నామము బాలకృష్ణమీనన్.
లక్నో విశ్వవిద్యాలయంలో ఎం.ఏ ., లా చదివారు. జర్నలిజం కూడా అక్కడే చదివి, నేషనల్ హెరాల్డ్ పత్రికలో చేరారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.
ఒకసారి పంజాబు జైలులో ఉన్నప్పుడు టైఫస్ (typhus) వ్యాధి సోకింది. జైలు అధికారులు ఉరికి దూరంగా ఈయనను వదిలివేశారు.
ఒక దయామయి ఈయనను తన గృహానికి తీసుకు వెళ్ళి, అనంతరం ఆసుపత్రిలో చేర్చింది.
కపట సాధువుల సమాచారం కోసం ఈయన తిరుగుతూ, స్వామి శివానంద ఆశ్రమం చేరారు. ఇక ఆయన మారిపోయారు.
స్వామి శివానంద ఈయనకు సన్యాస ఆశ్రమ దీక్షను ఇచ్చి “స్వామి చిన్మయానంద’గా చేశారు.
ఈయన తపోవన మహారాజు వద్ద వేదాంతాన్ని గ్రహించారు. తపోవన్ మహారాజు వద్ద శిష్యునిగా ఉండలేక, ఎందరో వెళ్ళిపోయారు. కానీ, చిన్మయానందుల వారు నిలద్రొక్కుకున్నారు.
1951 డిసెంబరులో పూనాలోని గణేశ మందిరంలో ప్రథమ ప్రవచనం చెప్పారు. రానురాను శ్రోతల సంఖ్య వందల స్థాయినుండి వేలస్థాయికి పెరిగింది. ఎంత మృదువుగా సంభాషిస్తారో, అంత కటువుగా సమాధానం చెబుతారు.
ఒకసారి ఈయన విదేశాలలో ప్రవచిస్తుండగా ఒకరు “మీ పద్దతి ఏది” అని అడిగాడు. “నా పద్దతా? నా పద్దతి ఏమిటంటే ముక్కు మీద నిలబడి ధ్యానం చేయటం – ఎవరూ చూడకుండా” అని నవ్వారు.
వెంటనే ఆయన “ఆధ్యాత్మిక మార్గంలో దగ్గర దారులు అనేవి ఉండవు. నీవు దగ్గర దారులను వెతుకుతుంటే రేపు రాకు” అని స్పష్టంగా చెప్పారు. ఆధ్యాత్మిక సాధన మార్గమే కష్టమైనది.
“మీరు ఆంగ్లంలో, న్యాయ షష్ఠంలో నిష్ణాతులు కదా, పైగా పేరు గడించిన పాత్రికేయులు గదా, ఎందుకు వదిలేశారు?” అని ప్రశ్నించాడు ఒకరు.
“ఇప్పుడు నీవు చ్యూయింగ్ గమ్ తిన్న తరువాత ఏం చేస్తావు?” అడిగారు చిన్మయానంద. చ్యూయింగ్ గమ్ ను ఉమ్మేస్తాను” అన్నాడు అతడు.
“నేను అలానే ప్రపంచాన్ని తరచిచూచి ఇక రసం లేదని గ్రహించి, వదిలేశాను” అన్నారు చిన్మయానంద.
1991 లో స్వామి చిన్మయానంద సరస్వతికి బొంబాయిలో సువర్ణ తులాభారం జరిగింది.
చిన్మయ మిషన్ శాఖోపశాఖలై ఖండ ఖండాంతరాల్లో వ్యాప్తి పొందింది.
చిన్మయానందులు ఆగస్టు 3, 1993న దేహాన్ని వదిలారు.
భారత ప్రభుత్వం స్వామి చిన్మయానంద శత జయంతి సందర్భంగా పది రూపాయల నాణెములను విడుదల చేసింది.
నేడు ఆగస్టు 3, చిన్మయానందుల వర్థంతి.
ఆయనను స్మరించి తరించెదము గాక.!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఒక్కడూ రాడు!! … …. మహనీయులు – 2020… ఆగస్టు 9
- శీతల కిరణాలు…. మహనీయులు – 2020… నవంబర్ 3
- భయమెలా? ఓ మనసా! … మహనీయులు @2020 – జనవరి 3
- పరీక్షలున్నాయి … …. మహనీయులు – 2020… డిసెంబరు 5
- బాధ్యత గురువుదే! … …. మహనీయులు – 2020… ఆగస్టు 7
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments