Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
కుంజుస్వామి మూడేండ్ల వయసులోనే కొందరు సన్యాసులు మొలలోతు నీళ్లలో నిలబడి మంత్రాలను జపిస్తుంటే విన్నాడు.
కుంజుస్వామి తండ్రిని అడిగాడు “మనం కూడా మంత్రాలను జపిద్దామా?” అని “మనం జపించకూడదు. మనం నిమ్న జాతికి చెందినవారం” అన్నాడు తండ్రి.
ఆ రాత్రి పరమేశ్వరుడు ఆ బిడ్డడికి స్వప్నంలో కనిపించి “ఓం నమః శివాయ అని జపించు” అన్నాడు. తండ్రికి ఈ విషయం తెలిసి ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు.
కుంజుస్వామి పెద్దవాడైనాడు. వివాహం చేసుకోనన్నాడు. తండ్రి అంగీకరించాడు. కొంతకాలం తరువాత రమణ మహర్షుల శిష్యుడయ్యాడు.
ఒకసారి రమణ మహర్షి కుంజుస్వామిని వేరే ఊరుకు పంపవలసి వచ్చింది. అందుకు సరిపడా డబ్బును రామకృష్ణ స్వామి కుంజుస్వామికి ఇచ్చాడు.
ఆ డబ్బుతో టిక్కెట్టు మాత్రమే కొనవచ్చును. రెండు రోజుల ప్రయాణం. ప్రయాణంలో ఏ పదార్దాన్ని కొని తినేటందుకు డబ్బు లేదు కుంజుస్వామి దగ్గర. రామకృష్ణ స్వామి వద్ద కూడా డబ్బులేదు.
“కుంజుస్వామికి ప్రయాణంలో ఎవరు తిండి పెడతారు?” అని ఆలోచించినా అంతు చిక్కలేదు రామకృష్ణస్వామికి. కుంజుస్వామికి ఆ ఆలోచనే లేదు. సద్గురువు రమణులకు ఇది తెలియదా? అనే నమ్మకంతో.
అందరూ భోజనానికి కూర్చున్నారు. వడ్డించటం ఎప్పుడూ రమణులతోనే మొదలవుతుంది. ఆ నాడు కూడా అలాగే మొదలైంది.
ఒక పూరిని వడ్డించారు. ఎప్పుడూ ఒక పూరి చాలంటారు రమణులు. ఆ రోజు ‘చాలు’ అనలేదు రమణులు.
వడ్డించే వ్యక్తి రెండో పూరి వడ్డించాడు. అప్పుడూ ‘చాలు’ అనలేదు రమణులు. మూడో పూరి వడ్డించినా, నాల్గో పూరి వడ్డించినా, అయిదో పురీ వడ్డించినా రమణులు చాలు అనలేదు.
ఆరో పూరి వడ్డించారు. “ఇక చాలు” అన్నారు రమణులు. ఇదేమిటి! వింత అని అందరూ ఆశ్చర్యపోయారు.
రమణులు వెంటనే తన విస్తరిలో నుంచి ఐదు పూరీలు తీసి కుంజుస్వామితో “నీ దగ్గర కేవలము టిక్కెట్టుకు మాత్రమే డబ్బు ఉంది. కానీ నీవు దారిలో ఏమి తింటావు? దారిలో తినటానికి వీటిని తీసుకెళ్ళు” అని ఐదు పూరీలను కుంజుస్వామికి ఇచ్చారు.
రమణులు చూపిన ప్రేమకు అందరూ చలించిపోయారు.
అంతే కాదు, ఒకసారి గురువుకు సర్వస్య శరణాగతి చెందితే, గురువే శిష్యుని అవసరాలను చూస్తారు అనుకునే కుంజుస్వామి వంటి భక్తులకు – శిష్యులకు ఈ సంఘటన స్ఫూర్తిదాయకం.
రమణులు కుంజుస్వామితో “ఆత్మ విచారణే నీ అంతిమ ధ్యేయంగా పెట్టుకో. కానీ, ధ్యానము, జపము, పారాయణ కూడా చేస్తూండు.
ధ్యానం విసుగు అనిపిస్తే పద్యాలు పాడుకో. నీ పని నుండి నీ మనస్సును వేరే వాటి మీదకు వెళ్లనీయకు.
చివరకు నువ్వు ఆత్మ విచారణలో స్థిరపడి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతావు” అని మార్గ నిర్దేశం చేశారు.
కుంజుస్వామి 7 – 8 – 1992న రమణుల పాదాలలో ఐక్యమయ్యారు.
నేడు ఆగస్టు 7. కుంజుస్వామి వర్థంతి. కుంజుస్వామికున్న సర్వస్య శరణాగతి మనకు అలవాడు గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నే నెవరు?. …. మహనీయులు – 2020… డిసెంబరు 31
- జీవన్ముక్తుడు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 7
- శ్రీ రమణ చరణ పల్లాండు… …. మహనీయులు – 2020… ఆగస్టు 28
- విషయదానం … …. మహనీయులు – 2020… మార్చి 31
- గూడు చేరిన బీవీఎన్…..సాయి@366 ఆగస్టు 29….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments