విషయదానం … …. మహనీయులు – 2020… మార్చి 31



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా అన్నదానాన్ని ప్రోత్సహించేవారు.

రమణ మహర్షి చింతా దీక్షితులుగారితో “ఈమె (సూరి నాగమ్మ) పత్రికలకు విషయదానం చేస్తుంది”  అన్నారు.

అన్నదానమే కాదు విషయదానమూ ముఖ్యమే. ‘యం’ (మహేంద్రనాథ్ గుప్తా) విషయదానం చేయకుంటే రామకృష్ణుల సాహిత్యం సంపూర్ణమై ఉండేదికాదు.

ఆర్డర్ ఆస్ బోర్న్ విషయదానం చేయకుంటే సాయిబాబా పాశ్చాత్తులకు తెలియటం కుంటుపడేది.

సూరి నాగమ్మగారు రమణాశ్రమము నుండి వ్రాసిన లేఖలు పండిత, పామర జనాలను రంజింపచేశాయి.

సూరి నాగమ్మగారు రమణాశ్రమంలో జరిగిన కొన్ని సంఘటనలను, విశేషాలను, రమణుల తత్వాన్ని లేఖల రూపంలో రచించింది.

ఆమె బాల వితంతువు. ఆమెకు ఒకనాటి రాత్రి వచ్చిన స్వప్నంలో దక్షిణామూర్తిని పోలిన సిద్ధపురుషుని చూచింది. ఆ సిద్ధపురుషుని చుట్టూ ఉజ్వలమైన కాంతి ఉంది.

ఆమె నమస్కారము చేయవలెనని లేవగానే, సిద్ధపురుషుడు అదృశ్యమయ్యాడు. అలనాటి సిద్ధపురుషుడే రమణులని ఆమె గ్రహించింది.

ఒకసారి ఆమె వదినగారికి శిశువు జన్మించాడు. “పేరేం పెట్టమంటావ్?” అని సూరి నాగమ్మను వదిన ప్రశ్నించగా “రమణ నామం కంటే రమణీయ మేమున్నది?” అంది. ఆ శిశువుకు ‘రమణ శర్మ’ అనే పేరు పెట్టారు.

ఒకసారి ఒక తెలుగు మహిళ రమణాశ్రమానికి వచ్చింది. అకారణంగా సూరి నాగమ్మగారిపై ద్వేషాన్ని, వైరాన్ని పెంచుకుంది.

సూరి నాగమ్మగారి మనసు చాలా బాధపడ్డది. ఆ సమయంలో ఆమె ప్రవర్తనకు. ఆ మహిళ తిరిగి వెళ్ళిపోయింది.

కొంతకాలం గడచింది. ఆ మహిళ తన పూర్వపు వైఖరికి సిగ్గుపడుతూ, క్షమింపుమని లేఖ ద్వారా కోరింది. ఇంకా, రమణులు ఆరోగ్యం గూర్చి తెలియచేయమన్నది.

ఆ మహిళా పశ్చాత్తాపడినా, సూరి నాగమ్మగారు ఆమెను క్షమించలేకపోయింది. ఉత్తరం వ్రాయలేదు.

ఆ సమయంలో రమణులు సూరి నాగమ్మగారి వంక చూడటమే మానివేశారు. సూరి నాగమ్మగారు నమస్కారం చేసినప్పుడల్లా రమణులు ముఖం మరోవైపుకు తిప్పుకునేవారు.

రమణులు ఇలా చేయటానికి కారణం ఆలోచించగా తెలిసింది. సహృదయంతో సూరి నాగమ్మగారు ఆ మహిళ చేసిన తప్పులను క్షమించి, ఉత్తరం వ్రాసింది.

రమణుల వద్దకు వచ్చి నమస్కరించింది. రమణులు ఆమెతో సంతోషంగా మాట్లాడసాగారు.

ఈనాడు మార్చి 31. సూరి నాగమ్మగారు దేహాన్ని త్యజించిన రోజు మార్చి 31, 1980.

ఆమెను స్మరిస్తూ, మన మనసులలో ద్వేషము, ప్రతీకారము లేకుండునట్టు, క్షమాగుణం పెంపొందేటట్టు చేయమని రమణులను ప్రార్థిద్దాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles