ఓం అర్హం నమః… మహనీయులు – 2020 – జనవరి 21



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సామాన్యునిగా జన్మించి లౌకిక జీవనం గడిపిన రతన్ రాజ్ రతన్ విజయజీ అయ్యాడు.

ఆచార్య శ్రీమద్విజయ రాజేంద్ర సురీశ్శీర్జీగా ఖ్యాతిచెందాడు. ఈయనే జైన మతంలోని శ్వేతాంబర శాఖలో కదలాడే ఆగమమూర్తిగా పేరుగాంచాడు.

ఆచార్య రాజేంద్ర సూరి జైన మతములోని వారిలో పొరపొచ్చములు వచ్చిన, కూర్చుండబెట్టి సర్దుబాటు చేసేవాడు.

ఐతే ఇరువర్గములు గత మూడు వందల ఏండ్లనుండి కలసి భుజించలేదు. ఈయన వెంటనే ఆ ఇరువర్గములవారి మధ్య సయోధ్య కుదిర్చినాడు.

రాజేంద్ర సూరి ఇండోర్ వెళ్ళిపోయినప్పుడు శాస్తముపై వాదనకు రమ్మని పిలుపువచ్చెను. వాద ప్రతివాదములు ఏ వివాదమును తేల్చవు.

అనవసరముగా కాలమును చర్చలో వృధా పరచుట సమంజసము కాదని సమాధానం పంపారు రాజేంద్ర సూరి.

భిక్షాహారమును స్వీకరింపలేని సమయములో అయన 15 – 20 ఎండిన వేపాకులను మాత్రమే భుజించేవారు.

చున్నీలాలో అనే ఒక గృహస్థుడు బీదరికంలో జీవించేవాడు. కన్నీటితో ఆయనను ప్రార్ధించాడు. మాంగళిక మంత్రాన్నుపదేశించాడు రాజేంద్ర సూరి.

చున్నీలాల్ కు ఉద్యోగం దొరకుటయే గాక ఉన్నత స్థాయిలకు కూడా ఎదిగినాడు. ఇది గురు మహిమయా? మంత్ర మహిమయా? గురూపదేశ మంత్ర మహిమ!

గురువు పాదయాత్ర చేస్తున్నారు 200 మంది శిష్యులతో. సాయంకాలం నాలుగున్నరైంది. ఇంకో రెండు కిలోమీటర్లు నడిస్తే సమీప గ్రామానికి చేరవచ్చును.

కానీ ఆ అడవిలోనే ఒక చెట్టు క్రిందనే ఉందామన్నారు గురూజీ. జైన శాస్త్రముల ప్రకారం, సూర్యాస్తమయానికి గంట ముందే ప్రయాణాన్ని ఆపుచేయాలన్నారు గురూజీ.

చెట్టుక్రింద కూర్చున్న గురూజీ ధ్యానంలో వెళ్లారు. 200 మంది శిష్యులు చుట్టూ ఉన్నారు. ఒక సింహం వచ్చింది ఆ ప్రదేశానికి. ఎవరినీ ఏమీ చేయలేదు.

పెంపుడు కుక్కవలె ప్రవర్తించింది. ఇది గురువునకు శాస్తములపై గల విశ్వాసమునకు తార్కాణము.

సాయి శాస్తములను చదువుట వలన ప్రయోజనం లేదన్నాడు.

రాజేంద్రుడు జైన ఆగమములను నిశితంగా పాటించేవాడు, జైన సన్యాసులు భోగ లాలసులు కాకుండ, కట్టుదిట్టం చేశాడు.

జైన ప్రార్థనలో మార్పును తెచ్చాడు. మాట ఒకటి, చేత మరొకటిగా ఉండకూడదని తాను పాటించి, ఇతరులను పాటింపుమనేవారు.

1827లో పుష్య శుద్ధ సప్తమినాడు జన్మించిన సద్గురు రాజేంద్ర సూరి, 1906లో పుష్య శుద్ధ షష్ఠినాడు దేహ త్యాగం చేశారు. రాజేంద్ర సూరి ఆధ్యాత్మిక జీవనము వెలుగు చూపుగాక!

ఓం అర్హం నమః

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles