Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
షిరిడీ అనగానే సాయిబాబా జ్ఞప్తికి వస్తాడు. అసంకల్పితంగా.
కుమిలి అనగానే త్రైలింగస్వామి జ్ఞప్తికి వస్తారు. కుమిలిలోనే జన్మించి, దానినే తన సాధనా స్థలంగా, కార్యరంగంగా, యాత్రా స్థలంగా మార్చింది అనిమిష స్వామి.
జూలై 1, 1909న సూర్యోదయ సమయాన జన్మించారు అనిమిషస్వామి.
అక్కడకు ఎప్పుడూ రాని పెద్ద గరుడ పక్షి, అక్కడున్న వేప వృక్షముపై కనిపించింది. ఇంకా ఆకాశంలో హేలీ తోకచుక్కతో పాటు, అనేక శుభశకునాలు కనిపించాయి.
బాల్య నామం నీలాపు నర్సయ్య రెడ్డి. ఈయననే అనిమిషస్వామి అంటారు.
ఎందుకంటే పుట్టినప్పటినుండి ఎల్లప్పుడు కంటి రెప్పపాటు లేకుండా ఉండేవారు. అనిమిషత్వంతోపాటుగా, అష్టసిద్ధులు ఈయనకు సంక్రమించాయి.
జన్మించినదాదిగా ఈయన శ్వాసలో దోషముందని, అది ఉబ్బసమని తల్లిదండ్రులు భావించారు.
ఐతే చిన్నప్పటినుండి ఆయనకు వచ్చిన శ్వాస యోగాబ్యాసమని తెలియ వచ్చింది వారికి. ఈయన తత్వజ్ఞానాన్ని బోధించేవారు.
ఒకసారి శేషుమాంబ అనే భక్తురాలు, నీటిని తోడటానికి బావి వద్దకు పోగా, రావి ఆకుమీద బాలకృష్ణుడు ఆమెకు దర్శనమిచ్చి తాను అనిమిష అవతారంగా వచ్చానని తెలిపారు. ఇక ఆయన అనిమిషుడు అని అందరికి తెలిసింది.
ఆయన శివాలయంలో నిద్రించేవారు. ఆ గ్రామంలోని ఇండ్లపై రాళ్ళ వర్షం అప్పుడప్పుడు పడేది.
దీనిని భరించలేని ఆ ఊరివారు ఆయనతో ఈ సంగతి చెప్పారు. వెంటనే ఆయన రచ్చబండ చుట్టూ విభూతి చల్లారు.
ఇంకా తన మంచమును శివాలయమునుండి, రచ్చబండ వద్దకు తెప్పించుకుని నిద్రించసాగారు ఆయన.
ఇక ఇండ్లపై రాళ్ళ వర్షం కురవటం ఆగిపోయింది. కానీ, ఆయన చర్మం చిట్లి, రక్తం కారసాగింది. ఇదంతా శివ సంకల్పమా? విష్ణు మాయా? అని ఆ ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు.
కొందరు రంగూన్ వాస్తవ్యులు ఆయన అనిమిషత్వమును పరీక్షించదలచారు. ఆయన కళ్ళలో కారపు ముద్దలను పెట్టారు. అవి వెన్నలా తెల్లగా కరిగిపోయాయి.
ఒక గదిలో ఆయనను బంధించి అన్న పానీయములు ఇవ్వకుండా, మిరపకాయల పొగను ఆ గదిలోనికి పంపేవారు. అలా 21 రోజులు చేసి, ఆ గది తలుపులు తెరచారు.
ఆయన మొదటి రోజున ఎలా ఉన్నారో, అంతకంటే తేజోమూర్తిగా కనిపించారు.
ఈయనకు కులిమిలో సర్వ ధర్మ మహా ద్వాదశ ఆలయ నిర్మాణము గావించారు.
ఒకసారి అక్కడ ధ్వజస్తంభ నిర్మాణము జరుగుచున్నప్పుడు, ధ్వజస్తంభముపై పనిచేయు పనివారు ధ్వజస్తంభముతో సహా ఒక ప్రక్కకు పడబోయారు.
చూచేవారందరూ హా హకారాలు చేశారు. స్వామి ధ్వజస్తంభమును చూచి కుడి చేతితో ‘ఆగు’ అన్నారు. అది ఆగి మెల్లగా యథాస్థానమునకు చేరినది.
సాయినాథుడు ద్వారకామాయి పైకప్పును పడకుండా ఆపిన సంఘటనకు ఇది సరిపోలి ఉంది.
నేడు అనిమిష జయంతి, ఆయనను స్మరించెదము గాక!
ఓం అనిమిషాయ నమః
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఓం నమో భగవతే గోపీనాథాయ …. మహనీయులు – 2020… జూలై 3
- ఓం చితంబరాయ నమః…. మహనీయులు – 2020… మార్చి 7
- ఓం అర్హం నమః… మహనీయులు – 2020 – జనవరి 21
- ఓం శ్రీ దత్త స్వామినే నమః …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 7
- ఓం సత్యనారాయణ స్వామినే నమః…..సాయి@366 జూలై 10….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments