Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా తన భక్తులు ఏది సమర్పించినా స్వీకరించేవాడు. “శ్రీరామనవమి నాడు పేదరాలి నుండి రొట్టెను అడిగి మరీ స్వీకరించాడు.
గురువులు అంతే! దేనినైనా స్వీకరిస్తారు ప్రేమాభిమానాలతో సమ్పరిస్తే.
(Butala) బూటాలా అనే ఒక చిన్న గ్రామంలో ఒకే ఒక్క కుటుంబం తప్ప మిగిలినవారందరూ ఒక మహమ్మదీయ పేరును నమ్మేడివారు.
ఆ గ్రామంలో అత్యంత పేద కుటుంబం బీబీ శాంతిది. శాంతికి ఒక కుమారుడు పేరు పుల్లా.
శాంతి భర్త పుల్లా బాల్యంలోనే మరణించాడు. ఆమె అతి కష్టంతో కుమారుడిని సాకుతొంది. ఆమెకు శిక్కు వ్యవస్థపై, అప్పటి గురువైన గురుగోవింద్ సింగ్ పై నమ్మకం ఎక్కువ.
కుమారుడు కూడా తల్లి అడుగుజాడలలో నడచి, గురుగోవింద్ నే నమ్ముకున్నాడు. ఆయననే ధ్యానించేవాడు.
తనకు, తన తల్లికి గురూజీ దర్శనం ఈ జన్మలో అవుతుందా? అని గురు దర్శనం కోసం తపించిపోసాగాడు.
అతనికి, తల్లికి గురు బాణీలు పాడటంతో కాలం గడిచిపోయేది.
గా గ్రామంలోని ఇతర కుటుంబాలు వీరిని చిన్నచూపు చూసేవి. ఇంకా సమయం చిక్కితే అవమనిద్దామన్న ఉద్దేశంతో అందరూ ఉన్నారు.
తనవద్ద ఉన్న కొంచెం బెల్లాన్ని ఒక చిన్న గుడ్డలో పెట్టి ముడివేసి తన వెంట తీసుకుపోయేవాడు. గురువుకు సమర్పిద్దామని.
ఎక్కడో దూరాన గురుడు లేదు. ఆ గురువుకు పుల్లా, శాంతుల భక్తి తెలియదా? ఒకసారి ఆ సద్గురువు కరుణించాడు.
ఆయనే తన సద్గురువు గురుగోవింద్ సింగ్ అని గుర్తించి సాష్టాంగ ప్రణామాలు అర్పించాడు పుల్లా.
గురుగోవింద్ చిరునవ్వు నవ్వి, పుల్లా వస్త్రానికున్న ముడిని విప్పి బెల్లాన్ని స్వీకరించాడు.
“చూడు పుల్లా! నాకు, నా పరివారానికి ఆకలి వేస్తోంది. వెంటనే ఇంటికి తీసుకుపో. విందు చేద్దాం” అన్నారు గురూజీ. ఇంటికి వచ్చారు.
పుల్లా, శాంతుల ఇంటికి గురువు సపరివారంగా విందుకు వచ్చారని ఆ ఊరి వారికి తెలిసింది. ఇప్పుడు పుల్లా, శాంతులకు అవమానం తప్పదనుకున్నారు చుట్టు పక్కలవారు.
పరిస్థితి చూచి నవ్వుకున్నారు గురూజీ, పుల్లాను ఆ ఊరి వారినందరిని విందుకు ఆహ్వానించమని ఆదేశించగా పుల్లా అందరినీ ఆహ్వానించాడు.
గురూజీ రెండు రుమాలులు ఇచ్చి రొట్టె, పాయసంపై కప్పి వడ్డన ప్రారంభింపమన్నారు. అందరూ సుష్టుగా భోజనం చేశారు. గురువు శక్తి, పుల్లా, శాంతుల భక్తి ఊరివారి కళ్ళను తెరిపించాయి.
అది ఏ రోజో తెలియదు గాని, ఆ రోజు నుండి బూటాల గ్రామస్తులంతా, పుల్లా, శాంతుల పుణ్యమా అని సన్మార్గులయ్యారు.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- విరోధి?! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 20
- మట్టి బొమ్మలను మహారణానికి …. మహనీయులు – 2020… అక్టోబరు 21
- ఓం అర్హం నమః… మహనీయులు – 2020 – జనవరి 21
- జీవించు – జీవించనీయి…. మహనీయులు – 2020… మే 10
- మహేశ యోగం … మహనీయులు @2020 – జనవరి 12
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments