జీవించు – జీవించనీయి…. మహనీయులు – 2020… మే 10



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


యుక్తేశ్వరగిరి గారి శిష్యులలో ఒకరు ముకుంద. ఒక రోజు గురువుగారు ఆ శిష్యుడిని చూచి “నీవు చాల బక్కగా ఉన్నావు ముకుందా!” అన్నారు.

ముకుందునికి చేయించని వైద్యంలేదు లావు పెరగటానికి, అవన్నీ నిరుపయోగమే.

“మందులకు పరిమితులున్నాయి. దివ్యమైన సృజనాత్మక ప్రాణశక్తికి అటువంటిది ఏమీ లేదు. నన్ను నమ్ము. నీవు బలంగా ఆరోగ్యంగా తయారవుతావు” అన్నారు గురువు.

గురువుగారి మాటల మీద తక్షణమే నమ్మకం కలిగింది.

మరుక్షణం నుండి ఫలితం కనబడసాగింది.

యుక్తేశ్వర్ గిరి గారు తన శిష్యులలలో ఒకరైన యోగానందను పిలిచి మరునాడు పూరీలో ఊరేగింపు జరుపమన్నారు.

ఊరేగింపు జరపవలసిన దినం కర్కాటక సంక్రమణ దినం. తెల్లవారుతూనే ఎండ మలమల మాడ్చేస్తోంది.

“గురూజీ, కాళ్ళకు చెప్పులే లేని విద్యార్థులను నిప్పులాకాలుతున్న ఇసుకలో ఎలా నడిపించమంటారు? అని అడిగాడు.

“నీకో రహస్యం చెబుతాను. ఈశ్వరుడు ఆకాశంలోనికి మబ్బుల గొడుగును పంపిస్తాడు. మీరంతా సుఖంగా నడుస్తారు” అన్నారు గురూజీ.

ఊరేగింపు ఆశ్రమం బయటకు వచ్చిన క్షణం నుండి ఆకాశమంతా మేఘాలతో నిండిపోయింది. అందరూ సంభ్రమాశ్చర్యాలు ప్రకటించారు.

సాయి మాటకు ప్రకృతి శక్తులు ఆచరించేవి. వాన ఆగిపోయేది. అగ్ని కూడా అంతే.

ఒకసారి ఆశ్రమంలో కిరసనాయిలు దీపం ఒకటి కనిపించటంలేదు. గురుదేవులు తమ యోగ దృష్టితో దీపాన్ని కనిపెడతారని శిష్యుల దృఢనమ్మకం.

ఆయన ఆ పనిచేయగలరు అవలీలగా. ఎవరో నూతి దగ్గరకు తీసుకుపోయారని ఒక శిష్యుడు చెప్పాడు. “దీపం కోసం నూతి దగ్గర వెదకండి” అన్నారు గురువు గారు. వెదికారు. అది దొరకలేదు.

గురుదేవులు విరగబడి నవ్వారు “నేను సోది చెప్పేవాడిని కాకపోతిని కనీసం షెర్లాక్ హోమ్స్ (సుప్రసిద్ధ అపరాథ పరిశోధకుడు) నైనా కాకపోతిని” అన్నారు ఇంకా నవ్వుతూ.

అమృతం సేవించటానికి కాని, కాళ్ళు కడుగుకోవటానికి కాదు కదా! శక్తులను ఎప్పుడు, ఎందుకు వాడాలో ఆ శిష్యులకు తెలిసింది.

“గురుదేవా! జీవహింసను సమర్థిస్తారా?” అని ఒక శిష్యుని ప్రశ్న.

“అహింస అంటే చంపాలనే కోరికను తొలగించుకోవటం” అని బదులిచ్చారు గురువుగారు.

“గురూజీ! క్రూర జంతువును చంపటానికి బదులు, తాను బలి కావటానికి సిద్దమవ్వాలా?” అని ప్రశ్నించాడో శిష్యుడు.

“అక్కరలేదు. మానవ దేహం అమూల్యమైంది. నిష్ప్రయోజనంగా మానవ దేహాన్ని నాశనం కావించటం కర్మ సిద్ధాంతాన్ని ఉల్లంఘించినట్లే” అన్నారు యుక్తేశ్వర్ గిరి.

10 మే, 1855 ఆయన జన్మదినం. క్రియా యోగమును తెలుసుకుందుము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles