Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మూడు దినములు ఏకధాటిగా సాయి శిరస్సును తన తోడపై నిడుకొని సాయి శరీరమును మహల్సాపతి కాపాడగల్గినాడు ఏట్లు?
ఒకసారి దేవదాస్ కాఠియా బాబా శిష్యుడైన రాందాస్ తో “నేను ఒక కార్యార్థమై కొన్ని రోజులపాటు బయటకు పోతున్నాను. నేను తిరిగి వచ్చేవరకు ఇక్కడే కూర్చుని ఉండు. ఏ పనిమీదా బయటకు వేళ్ళకు” అని ఆజ్ఞాపించాడు.
“మీ ఆజ్ఞ గురుదేవా!” అన్నాడు రాందాసు. “ఇదిగో ఇక్కడే నిశ్శబ్దంగా కూర్చో” అని చెప్పి గురువు వెళ్ళిపోయాడు.
ఎనిమిదవ రోజున గురువు వచ్చాడు. రాందాస్ లేచి నిలబడి ప్రణమిల్లాడు. “ఏం నాయనా! ఇక్కడే ఉన్నావా?” అడిగారు గురువుగారు.
“అవును మహారాజ్” అని జవాబిచ్చాడు శిష్యుడు. “మలమూత్రాల విసర్జనకు కూడా నీవు లేచి వెళ్ళలేదా?” ప్రశ్నించాడు గురువు.
“మీ దయతో వాటిని విసర్జించవలసిన అవసరమే కలుగలేదు” అన్నాడు శిష్యుడు.
“మరి భోజనం సంగతి?” అడిగారు గురువుగారు. “ఏమిలేదు” అని బదులిచ్చాడు శిష్యుడు. “సంతోషం! గురువాజ్ఞను ఇలాగే పాటించాలి” అన్నాడు దేవదాస్ కా యాబాబా.
ఈ సంప్రదయంలో 50వ గురువైన ఇంద్రదాస్ జీ మహారాజ్ చెక్క గోచీని ధరించటం మొదలు పెట్టాడు. అదే అనంతరం కొనసాగింది.
హిందీలో కాఠ్ అనగా కొయ్య. ఈ సంప్రదాయంలోని ఆచార్యులు కాఠియాబాబాలయ్యారు. రాందాస్ కూడా కాఠియాబాబా సంప్రదాయంలో సద్గురువయ్యాడు.
రాందాస్ కాఠియ బాబా నింబార్క సంప్రదాయానికి చెందిన 54వ గురువు. రాందాస్ కాఠియాబాబా సర్వశక్తి సంపన్నుడయ్యాడు. ఎందరో శిష్యులు, సందర్శకులు.
తారాశంకర్, రాందాస్ శిష్యుడు, కలకత్తాలో ఉండేవాడు. గంజాయిని పీల్చేవాడు కాదు. కానీ రాందాస్ గంజాయిని సేవించేవాడు.
ఒకసారి తారశంకర్ కు జ్వరంవచ్చి ఎంతకూ తగ్గలేదు. చిలుం గంజాయిని గురువుకు సమర్పించి మిగిలిన భాగాన్ని వారి ప్రసాదరూపంలో సేవిస్తే బాగుంటుంది అని ఆలోచించాడు.
గంజాయిని తెప్పించి గురువుకు మానసికంగానే సమర్పణచేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించాడు తారాశంకర్. వెంటనే జ్వరం మాయమైంది.
కొన్ని రోజుల తరువాత గురు సన్నిధికి వెళ్ళాడు. చుట్టూ ఎందరో ఉన్నారు. రాందాస్ కాఠియా బాబా “నీవు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకో” అని గంజాయిని అందించారు.
“ఏమిటి? ఈ బెంగాళీబాబు గంజాయి పీల్చుతాడా?” అని ఎవరో అన్నారు. గురుదేవులు “ఒకసారి జ్వరం వస్తే గంజాయిని నాకు సమర్పించి స్వీకరించాడు” అన్నారు.
తన్ను ఎక్కడో కలకత్తాలో సమర్పించిన గంజాయిని గురూజీ స్వీకరించారని ఆనందంతో పరవశించిపోయాడు తారాశంకర్.
రాందాస్ కాఠియాబాబా పుష్య శుద్ధ ఏకాదశినాడు అనగా జనవరి (1909)లో దేహాన్ని విడిచినా శాశ్వతులే.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఒకే మాట! … మహనీయులు @2020 – జనవరి 7
- గురువును మించిన శిష్యుడు …. మహనీయులు – 2020… నవంబర్ 1
- బాల గురువు … …. మహనీయులు – 2020… మార్చి 30
- రాతి హృదయము …. మహనీయులు – 2020… జూన్ 26
- ఎవరి త్రోవ వారిదే! …. మహనీయులు – 2020… మే 11
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “దూరంగా ఉండని గురువు… మహనీయులు – 2020 – జనవరి 6”
Murali
January 6, 2020 at 10:34 amమహల్సాపతి తోక పై అని టైప్ చేసారు, తొడ పై ఉంచుకుని అంటే బాగుంటుంది
sreenivas Murthy
January 15, 2020 at 10:42 pmsorry , మురళి గారు, ఇప్పుడే మీరు చెప్పిన mistake rectify చేశాను. మీరు ఇదే విధంగా Saileelas .com లో పొరపాటున ఏమైనా mistakes inform చెయ్యండి . immediate rectify చేస్తాము.