Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సూఫీ యోగులలో ఖాదరియా సాంప్రదాయానికి చెందిన జునైడ్ బాగ్దాద్ నగరంలో జన్మించాడు. ఈయన గురువు సారీ అల్ సఖాతీ. సారీ జునైడ్ కు మేనమామ.
ఒకసారి కొందరు సారీను “శిష్యులు గురువును మించిపోగలరా?” అని ఎవరో ప్రశ్నించారు.
అందరూ సారీ జవాబు కోసం ఎదురు చూస్తున్నారు. “శిష్యులు గురువును మించిపోగలరు. అందుకు మీకు ఉదాహరణ జునైడ్” అన్నారు సారీ.
తన గురువు సారీ సజీవంగా ఉండగా తాను బోధనలు చేయకూడదని నిరాకరించే వాడు జునైడ్. అది గురువు పట్ల శిష్యుడు చూపే గౌరవమే.
ఒకనాడు గురువు సారీ దగ్గరకు వచ్చాడు శిష్యుడు జునైడ్. “ఇక ఉపన్యసించు” అన్నారు గురువు సారీ.
“నేను ఉపన్యసించదలచుకున్నానని తమకెలా తెలిసింది?” అని అడిగారు జునైడ్. “నిన్న రాత్రి భగవంతుడు (అల్లా) తన దూతను (ప్రవక్త మహమ్మద్ ను)నీ వద్దకు పంపాడు నిన్ను బోధించమని” అన్నాడు సారీ.
ఆశ్చర్యపోయాడు జునైడ్. అది సత్యమే. గత రాత్రి మహమ్మద్ ప్రవక్త జునైడ్ కలలో కనిపించి బోధింపుమని ఆనతిచ్చాడు.
జునైడ్ కు శిష్యులుండే వారు. అయన శిష్యుల పట్ల వాత్సల్యం చూపేవారు.
ఒకనాటి రాత్రి జునైడ్ శిష్యుడొకనికి చెడు తలంపు కలిగింది. తెల్లవారింది.
తన ముఖంఅద్దంలో చూచుకున్నాడు. వికారంగా ఉంది. మూడు, నాలుగు రోజులు గుమ్మం దాటలేకపోయాడు – ఆ వికృత ముఖాన్ని అందరికీ చూపలేక.
ఒక రోజు ఉదయం ఒకరు ఆ శిష్యుని తలుపు తట్టారు. జునైడ్ సేవకుడు ఒక ఉత్తరం ఆ శిష్యుని చేతిలో పెట్టి వెళ్లిపోయాడు.
“నీవు నీ మనసును అదుపులో పెట్టుకోలేక పోయావు. అప్పుడు నమ్రతతో అల్లాను క్షమాపణ కోరి ఉండవలసింది. సిగ్గుపడి మూడు రోజులు ముఖాన్ని అలా ఉంచుకుంటే ఎలా?
నీ ముఖాన్ని ఆ మాత్రమైనా సరిచేయడానికి నేనెంత శ్రమపడాల్సి వచ్చిందో తెలియదు” అని జునైడ్ వ్రాశారు.
పాపం అనేది వాగ్రూపం, క్రియా రూపంలోనే కాదు, మానసిక పాపం కూడా ఉంటుంది.
దానిని దైవానికి, గురువుకు విన్నవించుకొని, మన్నింపమని కోరాలి.
సాయిబాబా కూడా ఒకసారి నానా సాహెబ్ ను మానసిక పాపం నుండి ఎలా బయటపడాలో తెలిపాడు కూడా.
ఒక వ్యక్తి జునైడ్ వద్దకు వచ్చి 500 దీనారాలను సమ్పరించాడు. జునైడ్ “నీ దగ్గర సంపద ఉందా?” అని ప్రశ్నించాడు.
“ఉంది” అన్నాడు ఆ వ్యక్తి. “అది చాలునా? ఇంకా కావాలా?” అని అడిగాడు జునైడ్. “ఇంకా కావాలి” అన్నాడు ఆ వ్యక్తి. “అయితే ఇవి తీసుకో” అని ఇచ్చేశాడు జునైడ్.
జనన, సమాధి తేదీలు ఖచ్చితంగా తెలియరాలేదు.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- అబ్దుల్లా తన శిష్యుడు కాదు. బాబా శిష్యుడు. ఎవరి శిష్యులు వారి దగ్గరే ఉండాలి.
- దొంగల్లో దొంగ…. మహనీయులు – 2020… నవంబర్ 2
- అడుసు తొక్కనేల…కాలు కడగనేల… …. మహనీయులు – 2020… డిసెంబరు 1
- ఎందరో మహానుభావులు …. మహనీయులు – 2020… నవంబర్ 7
- జీవన్ మే ఏక్ బార్ …. మహనీయులు – 2020… నవంబర్ 21
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments