Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
‘‘నన్ను దర్శించుకున్న ఈ ప్రదేశంలో నీ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.’’ అన్నారు మళ్ళీ బాబా. ఒంటికాలు మీద నిలబడ లేక తూలిపోతున్న దీక్షిత్‌ను దగ్గరగా తీసుకున్నారు. అంతలో దీక్షిత్ జార విడిచిన కర్రను పట్టుకుని అక్కడికి చేరుకున్నాడు శ్యామా.
ఆశించినంత మాత్రాన బాబాని దర్శించుకోలేం. బాబాని దర్శించుకోవాలంటే ఆయన్ని ముందు గుండెల్లో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకుని పూజించాలి. పూజించిన తర్వాతే పిలుపు అందుకుంటాం. పిలుపు అందుకున్నామా, షిరిడిలోకి ప్రవేశించినట్టే!
నాందేడ్‌కి చెందిన అబ్దుల్లా చాలా చిన్న వయసులోనే మీరుద్దీన్ ఫకీర్‌ని ఆశ్రయించాడు. అతన్ని సేవించసాగాడు. అయితే అబ్దుల్లా తన శిష్యుడు కాదని, వేరెవరికో శిష్యుడని మీరుద్దీన్‌కి అనిపించేది. అబ్దుల్లాకి కూడా తన గురువు మీరుద్దీన్ కాదని, వేరెవరో ఉన్నారని అనిపించేది. అయితే ఆయన ఎవరు? ఎక్కడ ఉన్నాడు? అన్నది అంతు చిక్కేది కాదు.
చాలా యేళ్ళు గడిచిపోయాయి అలా. ఒకనాడు మీరుద్దీన్‌కి కలలో బాబా కనిపించారు.‘‘మీరుద్దీన్’’‘‘చెప్పండి బాబా’’‘‘నీ దగ్గరున్న అబ్దుల్లా నా వాడు. నా శిష్యుడు. వాణ్ణి వీలయినంత తొందరగా షిరిడికి పంపు.’’‘‘తప్పకుండా’’ అన్నాడు మీరుద్దీన్.
చేతులు జాచి కళ్ళు మూసుకుని ప్రార్థించారు బాబా. కాస్సేపటికి వారి చేతుల్లో రెండు మామిడి పళ్ళు వచ్చి నిలిచాయి. వాటిని మీరుద్దీన్‌కి అందించారు బాబా.
‘‘ఈ మామిడిపళ్ళు అబ్దుల్లాకిచ్చి నా దగ్గరకు పంపు.’’ అన్నారు బాబా. అదృశ్యమయ్యారు.
మీరుద్దీన్‌కి మెలకువ వచ్చింది. కళ్ళు నులుముకుని లేచి కూర్చున్నాడతను. ప్రశాంతంగా ఆలోచించాడు. తను అనుకున్నది నిజమే!
అబ్దుల్లా తన శిష్యుడు కాదు. బాబా శిష్యుడు. ఎవరి శిష్యులు వారి దగ్గరే ఉండాలి. అందుకే పిలిచారు బాబా అనుకున్నాడు మీరుద్దీన్.
మళ్ళీ పడుకునేందుకు ప్రయత్నిస్తుంటే చేతికేవో పళ్ళలాంటివి తగిలితే తీసి చూశాడు. మామిడిపళ్ళు. కలలో బాబా ఇచ్చిన పళ్ళు. ఆశ్చర్యపోయాడు మీరుద్దీన్. పళ్ళని కళ్ళకద్దుకున్నాడు.
‘‘అబ్దుల్లా’’ అంటూ కేకేశాడు. కొద్దిగా దూరంలో పడుకుని ఉన్నాడు అబ్దుల్లా. మీరుద్దీన్ పిలుపునకు మేల్కొన్నాడతను.
‘‘చెప్పండి’’ వచ్చి, చేతులు కట్టుకుని నిల్చున్నాడు అబ్దుల్లా.‘‘నీ గురువు నేను కాదు.’’ చెప్పాడు మీరుద్దీన్.‘‘అవును. ఈ అనుమానం నాకు ఎప్పటి నుంచో ఉంది.’’
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. ఎవరిని ఎప్పుడు పిలవాలో అప్పుడే పిలుస్తాను. పిలుపు వచ్చే వరకూ వేచి చూడక తప్పదు.’’
- ‘‘ఇది వట్టి ఇటుక అనుకుంటున్నారేమో! కాదు. ఇది గురుప్రసాదం.”
- గురువును మించిన శిష్యుడు …. మహనీయులు – 2020… నవంబర్ 1
- ఎవరి త్రోవ వారిదే! …. మహనీయులు – 2020… మే 11
- గాడ్గే మహరాజ్ గారి శిష్యుడు రామచంద్ర మహరాజ్ గారికి బాబా సహాయం–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments