‘ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. ఎవరిని ఎప్పుడు పిలవాలో అప్పుడే పిలుస్తాను. పిలుపు వచ్చే వరకూ వేచి చూడక తప్పదు.’’



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

‘‘నీ గురువు షిరిడి సాయిబాబా.’’‘‘నిజమా’’ ఆశ్చర్యపోయి ఆనందించాడు అబ్దుల్లా.‘‘నిజం’’ అన్నాడు మీరుద్దీన్‌.

కలలో జరిగిందంతా వివరించి చెప్పాడు అబ్దుల్లాకి.‘‘బాబా నిన్ను వీలయినంత త్వరగా షిరిడికి రమ్మంటున్నారు. ఇదిగో, నీ కోసం వారిచ్చిన మామిడిపళ్ళు.’’ అన్నాడు మీరుద్దీన్‌. అబ్దుల్లా చేతిలో పళ్ళని ఉంచాడు.

పచ్చగా బంగారంలా మెరిసిపోతున్న మామిడిపళ్ళని భక్తిగా కళ్ళకద్దుకున్నాడు అబ్దుల్లా. ఆ రాత్రికి రాత్రే షిరిడికి బయల్దేరాడు. మర్నాడు మధ్యాహ్నానికి షిరిడికి చేరుకున్నాడతను. ద్వారకామాయి ముందు నిలుచున్నాడు.

లోపల బాబాకి నైవేద్యం సమర్పిస్తున్నారు భక్తులు. వారందరూ బాబాని తదేకంగా చూస్తోంటే బాబా మాత్రం అటెటో శూన్యంలోకి చూస్తూ కనిపించారు. ఆ చూపులు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాయి.

ద్వారకామాయి మెట్లకి నమస్కరించి మెట్లెక్కసాగాడు అబ్దుల్లా. ఒకొక్క మెట్టూ ఎక్కుతూ మెట్టు మెట్టుకీ బాబాని ఇంతింతగా దర్శించసాగాడు. ద్వారకామాయిలోకి ప్రవేశించాడు అబ్దుల్లా.

ఎదురుగా కొలువుదీరిన బాబాని చూశాడు. అంతే! ఆనందంతో ఒక్కసారిగా కళ్ళు చెమర్చుకున్నాడు.తన గురువు, దైవం బాబా కనిపించేసరికి కన్నీరు అడ్డుపడుతోంటే, తట్టుకోలేకపోయాడు అబ్దుల్లా. గబగబా తుడుచుకున్నాడు.‘‘బాబా! మేరా మాలిక్‌! వచ్చేశాను, నీ పిలుపు అందుకుని వచ్చేశాను. కరుణించు బాబా, కటాక్షించు.’’ అంటూ అబ్దుల్లా పరుగందుకున్నాడు.

తన దగ్గరకు పరుగు పరుగున వస్తున్న అబ్దుల్లాని ఆందోళనగా చూశారు బాబా. గట్టిగా అరిచారిలా.‘‘ఠైరో! జర ఠైరో! ఆగక్కడ.’’

బాబా గర్జనకి నిలువునా వణికిపోసాగాడు. అక్కడ భోజనం చేస్తున్న భక్తులు కూడా ఆగిపోయారు. చేతిలో అన్నం ముద్దలతో బాబాని చూడసాగారు.

అయితే బాబా, ఇటు భక్తుల్ని కాని, అటు అబ్దుల్లాని కాని చూడడం లేదు. పైకి, ద్వారకామాయి పైకెప్పుకేసి చూస్తున్నారు.

ఆందోళనగా ఉన్నారు. కట్టెలు విరుగుతున్నట్టుగా, రాళ్ళు ఒరుసుకున్నట్టుగా శబ్దాలు వినరాసాగాయి. ఆ శబ్దాలు ఎక్కణ్ణుంచి వస్తున్నదీ అక్కడ ఉన్న ఎవరికీ అంతు చిక్కలేదు. అటూ ఇటూ చూడసాగారంతా. సద్దుమణిగింది.

చేతిలో అన్నం ముద్దలతో ఆగిపోయిన భక్తులతో బాబా అన్నారిలా.‘‘ఏం చూస్తారు? భోం చెయ్యండి.’’భక్తులు భోంచెయ్యసాగారు. అంత దూరంలో వణికిపోతూ నిల్చున్న అబ్దుల్లాని చూశారు బాబా.

‘ఆవో అబ్దుల్లా! ఆవో! నీ కోసమే చూస్తున్నా! రా రా’’ పిలిచారు. అబ్దుల్లా ఒక్క అంగలో బాబాని చేరుకున్నాడు. ఆయన పాదాల మీద వాలిపోయాడు.‘‘బాబా! మేరా మాలిక్‌! ఇన్నేళ్ళకి కరుణించావా?’’ అన్నాడు. కన్నీటితో బాబాని చూశాడు.

‘‘నీ పిలుపు అందుకోవాలి. రావాలి. అంతే తప్ప, మా అంతట మేము వచ్చే అవకాశం లేదు.’’ అన్నాడు అబ్దుల్లా.‘

‘ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. ఎవరిని ఎప్పుడు పిలవాలో అప్పుడే పిలుస్తాను. పిలుపు అందే వరకూ వేచి చూడక తప్పదు.’’ అన్నారు బాబా. సన్నగా నవ్వారు.‘‘వెళ్ళు, భోంచెయ్యి.’’ అన్నారు. అబ్దుల్లా లేచి నిల్చున్నాడు.

తనకి మీరుద్దీన్‌ అందజేసిన రెండు మామిడిపళ్ళనీ కళ్ళకద్దుకుని, బాబాకి సమర్పించాడు.‘‘చాలా జాగ్రత్తగా తీసుకొచ్చావు.’’ అన్నారు బాబా. వాసన చూశారు. ఘుమఘుమలాడిపోతున్నాయి.

‘‘శ్యామా’’ ని పిలిచారు.‘‘చెప్పండి బాబా’’‘‘చాకు తీసుకురా’’తెచ్చిచ్చాడు శ్యామా.

ఆ చాకుతో మామిడిపళ్ళను కోసి, ముక్కలు చేసి, భోంచేస్తున్న వారికి ప్రసాదంగా  పంచారు బాబా. చిత్రంగా అందరికీ ముక్కలన్నీ సరిపోయాయి.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles