Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగిరాజ
పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయిబంధువు బండారు వెంకట రాముడు గారి అమ్మగారిపై బాబా చూపిన ప్రేమ…
మా అమ్మగారికి బాబా మీద చాలా భక్తి.మొదటినుండి బాబాని బాగా పూజించేది.
మా అమ్మగారు కొన్ని సంవత్సరాల క్రితం మా సొంత ఊరులో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లాలని అనుకున్నారు.మాది చాల కుగ్రామం.అక్కడ ఉండేందుకు మాకు సొంత ఇల్లుకాని,బంధువులు ఎవరు లేరు.
ఆ కార్యక్రమం అవ్వగానే రాత్రికి ఆ దేవాలయంలోని ఉందామని నిర్ణయించుకున్నారు.
కానీ నేను మా అమ్మ గారు పెద్ద వయస్సు అవ్వటం చేత ఎలా ఉంటుందో ఎటువంటి సౌకర్యం లేకుండా అని భయపడ్డాను.
నేను మా ఇంట్లోనే బాబాని మనసులో ప్రార్ధించాను బాబా మా అమ్మను జాగ్రత్తగా చూసుకొమ్మని. మరుసటి రోజు మా అమ్మగారు ఇంటికి వచ్చి చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయాను.
“నేను పడుకుని ఉండగా ఆ గుడి పూజారిగారు వచ్చి మీరు ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదని,మిగతా సాధువులు అందరు వచ్చి ఇక్కడ పడుకుంటారు,మీరు ఒక్కరే ఉండటం ఇబ్బంది అని పక్కనే ఉన్న బాబా గుడిలో ఉంటె మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి తీసుకువెళ్లారు.
అక్కడకు వెళ్ళాక ఎవరో ఒక ముసలాయన వచ్చి అమ్మ నువ్వు ఏమి తినలేదు అని భోజనం తెచ్చి ఇచ్చారు.నీకు ఆకలిగా ఉంది తిను అని చెప్పి వెళ్లిపోయారు.”నేను తిన్నాక ఆయనను ఎక్కడ వెతికిన కనిపించలేదు,అని చెప్పారు.నేను బాధపడినందుకు బాబానే తన మందిరంలోనే బస,భోజనం ఏర్పాటు చేసారు .
దీనిని బట్టి భక్తుల బాగోగులు బాబా ఎప్పుడు చూసుకుంటారు , సాయిలాంటి దయగల తల్లి ఎక్కడ ఉండరు.
– సాయినాధార్పణమస్తు –
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- భక్తుల బాగోగులు బాబా ఎప్పుడు చూసుకుంటారు , సాయిలాంటి దయగల తల్లి ఎక్కడ ఉండరు-Audio
- బాబా (తల్లి,తండ్రి,గురువు)—Audio
- బాబా ఏదో రూపంలో తమ ఇంటికి వస్తారు అని భావించిన భక్తుల నమ్మకాన్ని నిలబెట్టిన బాబా వారు
- ఎక్కడ విన్నా సాయి నామమే,ఎక్కడ చూసిన సాయి రూపమే.
- ఆ సాయిబాబాకు నా మీద ఇంత కృప ఉంటుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “భక్తుల బాగోగులు బాబా ఎప్పుడు చూసుకుంటారు , సాయిలాంటి దయగల తల్లి ఎక్కడ ఉండరు.-11”
Sreenivas
December 16, 2017 at 8:14 amSai Baba…Sai Baba…Sai Baba