ఆ సాయిబాబాకు నా మీద ఇంత కృప ఉంటుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఓం సాయి రాం..

అన్నిటికన్నా ముందు సాయి చరణ కమలాలకు నా నమస్కారములు అందచేస్తూ, నేను మీ Sada Siva మీతో మరో సాయి లీల (సాయి అనుగ్రహంతో) పంచుకుందామని వచ్చాను.

నేను చాలా పేద కుటుంబానికి చెందిన వాడిని. నాన్న నా చిన్న వయసు లొనే చనిపోవడంతో అనేక కష్టాలని ఎదుర్కొన్నాను.

మా నాన్న చనిపోయినాక మేము ఒక మట్టితో కట్టిన ఇంటిలోకి మారినాము. వాన వస్తే ఇల్లు మొత్తం నీటితో నిండిపోయేది. చాలా కష్టాలు పడేవాళ్ళం.

నేను నా చిన్నవాయసు నుంచి సాయి బాబాను చాలా నమ్మి బతికేవాడిని. మళ్ళీ ఆయన కృపకటాక్షాలు కోసం ఆయన పాదాల చెంతకే చేరాను. ఎందుకో చెప్పలేను.

కానీ, ఆయన దర్బారుకు చేరేసరికి అన్ని మర్చిపోయేవాడిని. ఎందుకు వచ్చానో కూడా మర్చిపోయేవాడిని.

ఏమి ఆడిగేవాడిని కాదు. కానీ ఆయన మన మనసేరిగిన దేవుడు. మనలోనే అంతర్గతంగా కొలువై ఉంటాడు. ఆయనకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు.

నా దుఃఖం ఎలా దూరం చేసాడో చూడండి. నేను ఇల్లు repair చేయించడానికి loan కోసం Bank వెళ్ళాను.

నా salary చాలా తక్కువ. నేను ఒక Casual workerను. నాకు loan చాలా తక్కువ వస్తుంది. అది గారంటర్ కావాలి.

నాలాంటి వాడికి Gaarantar ఎవరు వుండరు. దిక్కులేని చోట దేవుడే దిక్కు అని..నేను loan ఐతే apply చేసి ఇంటికి వచ్చేసాను.

అది అంత easyగా అయ్యేపని కాదు. Manager మాటలు విని ఇంటికి వచ్చేసాను.

వచ్చి బాబా ముందు కూర్చొని, యెంతో బాధ పడ్డాను. నాలుగు రోజులు గడిచిపోయినాయి.

ఇక్కడ చాలా తుఫాను హెచ్చరికలు చేస్తున్నారు.ఇంతలో బాంక్ manager ఫోన్ చేసాడు. వెళ్ళాను

“అరె, సదాశివ, నిన్న ఇద్దరు వ్యక్తులు వచ్చారు.షిర్డీ నుంచి వచ్చాము.సదాశివ మాకు బాగా తెలిసిన వ్యక్తి.మేము గారంటర్ గా ఉంటాము.అతనికి loan ఇచ్చేందుకు, ఏమి problem రాదు.ఇవ్వండి..అని చెప్పారు.”

ఈదో..నీ loan sanction చేసాను.1.5 lacs.. తీసుకెళ్లి.ఇల్లు repair చేసుకో.అని చెప్పాడు manager.నాకు ఏమి చెప్పాలో తెలీలేదు.

ఆ సాయిబాబాకు నా మీద ఇంత కృప ఉంటుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు.

నన్ను నమ్మండి.షిర్డీ నుంచి ఎవరు వచ్చారో, నాకు తెలీదు. నేను ఎప్పుడు షిర్డీ వెళ్ళలేదు. అంత అదృష్టం నాకు అసలు ఉందా.? కానీ ఆయన లీలలు చాలా నా జీవితాన్ని నడిపిస్తున్నాయి.

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “ఆ సాయిబాబాకు నా మీద ఇంత కృప ఉంటుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు

బాబా ని మనస్సుపూర్తిగా నమ్మితే అంతా ఆయనే చూసుకుంటారు అనడానికి ఇదే నిదర్శనము…ఈ లీల చాల బాగుంది…Thank you so much..mam…Today I am really feel happy after reading this miracle..We are expecting more miracles from you.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles