నమ్మితే చాలు, ఆయన ఏ రూపం లో ఐనా వస్తాడు. మన కష్టాలు తీరుస్తాడు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిరాం..

ముందుగా నేను సాయినాధునికి  చరణ కమలాలకు కోటి కోటి నమస్కారములు తెలియచేస్తున్నాను.

నా వలన ఏమన్నా తప్పులు జరిగివుంటే క్షమించండి ప్రభు అని చెప్తూ,  నేను ( Sadha Siva, AIR, Sambalpur), మీతో మరో సాయిబాబా లీల పంచుకుందామని రాస్తున్నాను.

నేను ఒక పేద కుటుంబానికి చెందినవాడిని, మరి బాబా గారి దయ అనాలో, కృప అనాలో నాకు అర్థంకాదు, లేక లీల అనాలో, చమత్కారం అనాలో అది కూడా తెలీదు నాకు.

నేను అంత చదువుకున్నవాడినికుడా కాదు. మాధవి మేడం రాయమంటే “ఓహో, ఇలా కూడా బాబా మహిమలు నలుగురు సాయి బంధువులతో పంచుకోవచ్చున” అనుకున్నాను.

ఇపుడు అసలు విషయానికి వస్తాను, మూడు సంవత్సరాల ముందు నా చెల్లికి, బాబాగారి కృపకటాక్షాల వలన ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది.

అబ్బాయి మంచి job చేస్తాడు, మేము ప్రయత్నం చెయ్యకనే వచ్చిన సంబంధం. ఎలాగైనా చెయ్యాలి పెళ్లి, అని నిర్ణయించుకున్నాను.

కానీ, పేదరికం వలన ఎలాచెయ్యలో తెలీక, చాలా కష్టపడ్డాను.

మా ఆఫీస్ లో అందరి దగ్గర డబ్బు అప్పు అడిగి చూశాను. మా నాన్న చిన్నవయసులోనే చనిపోయాడు. అమ్మ పెన్షన్ చాలా తక్కువ. ఇంకా నా బాధ వర్ణనాతీతం.

కానీ  సాయిబాబా మీద నమ్మకం వదలకుండా బ్యాంక్ లో try చేద్దాం అని loan  కోసం బ్యాంక్ కు వెళ్ళాను.

Manager నన్ను పిచ్చివాడ్ని చూసినట్లు చూసాడు, “పెళ్లికి ఎవరన్నా loan ఇస్తారా” అని, మీ అమ్మ పెన్షన్ బుక్  తీసుకురా అన్నాడు.

మా ఇంట్లో ఆ బుక్ ఎక్కడో పోయింది. ఆ మాటే చెప్పాను. Manager వినలేదు, నన్ను ఖాళీ చేతులతో ఇంటికి పంపినారు.

మా ఇంటికి చేరువలో ఒక ముసలివాడు కనపడి,“ఏంటి, అలా ఉన్నావ్” అని అడిగాడు. నేను నా కథ మొత్తం చెప్పాను.

ఆయన, ఎవరో, ఏమో, ఆలోచించలేదు. “రేపు వేళ్ళు బాబు, loan ఇస్తాడు,” అని చెప్పి వెళ్లిపోయినాడు.

ఆ మాటలు నా మీద మంత్రం లా పనిచేశాయి, మళ్ళీ Next day బ్యాంక్ కు వెళ్ళాను.

ఆ manager నే బాబా అనుకోని చాలా వేడుకున్నా”, sir, చెల్లి పెళ్లి చేస్తాను, loan ఇప్పించండి” అని, నా మాటలు నమ్మండి, ఆ సమయం లో నాకు బాబా నే కనపడ్డారు.

ఏ మంత్రం పనిచేసిందో తెలీదు, వెంటనే 2.5 lacs loan sanction చేసాడు. నిన్న చెయ్యలేదు. ఈరోజు చేసాడు.

24 గంటల్లో అన్ని సమస్యలు తీరిపోయినాయి. ఇది బాబా కృప కాకుంటే ఏమి అనాలి.” వేళ్ళు బాబు నీ చెల్లి పెళ్లి బాగా చెయ్యి” అన్నాడు.

నేను ఆశ్చర్య పోయాను, ఎందుకంటే, నిన్న నాతో మాట్లాడిన ముసలి వాని గొంతు, ఈరోజు ఇక్కడ manager గొంతు ఒక్కటే.

ఇప్పటికి నాకు అంతు చిక్కదు. నేను చెప్పబోయేది ఏమంటే, నమ్మితే చాలు, ఆయన ఏ రూపం లో ఐనా వస్తాడు. మన కష్టాలు తీరుస్తాడు.

నా లాంటి పేదవాడికి, చదువు కుడా రాని వానికి, ఎన్ని అనుభవాలో చెప్పలేను.మన సాయిబాబా  దయాసాగర్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

సర్వం సాయి నతర్పణ మస్తు.

సదాశివ…

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

3 comments on “నమ్మితే చాలు, ఆయన ఏ రూపం లో ఐనా వస్తాడు. మన కష్టాలు తీరుస్తాడు.

కల్లాకపటం లేని స్వచ్ఛమైన మనస్సుతో బాబా వారి పై ప్రేమ చూపితే చాలు..అంత ఆయనే చూసుకుంటారు..సాయి బాబా..సాయి బాబా.

Dillip

Nice miracle

Radha

Chalaa baagundhi.babavari leela.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles