Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఓం సాయి రామ్,
సాయి బందువులకు నమస్కారం. నా పేరు మేడా లక్ష్మి ప్రసన్న. హైదరాబాద్.
బాబా మిరాకిల్ రాయడం చాలా ఆలస్యం చేశాను. ఎందుకంటే పిల్లలకు వేసవి సెలవులు వుండటం వల్ల, కుదరలేదు.
ఈలోగా బాబా ఏమి అనుకున్నారో గానీ నువ్వు ఇది రాయాలి అని కాబోలు నన్ను పరిగెతించి, చక్రం తిప్పారు సాయి.
మేము సెలవులు అని అవదూతల దర్శనార్దం టూర్ వెళ్ళాము. అందరి ఆశీర్వచనాలు తీసుకుంటూ తిరుగుతూ చివరకు అరుణాచలం లో గిరిప్రదక్షిణ ముగించి రూమ్ కి వచ్చాము.
అప్పుడే కాల్ వచ్చింది, మేము ఉండే అపార్ట్మెంట్ లో కార్ పార్కింగ్ గొడవలు మేము డ్రా తీసాము అని.!!!!! మీరు కార్ తీసేయాలి అని, ఏమైనా ఉంటె లీగల్ గా వెళ్దాము అని చెప్పారు.
మా పరిస్థితి ఇక నేను రాయలేను, బాబా మేము మీ సేవలో పది రోజుల నుండి తిరిగుతూ ఉన్నాము ఇది ఏమి తండ్రి. నేను వెళ్ళేలోపు నా సమస్య మీరు తీర్చేయండి, నాకు నువ్వు తప్ప ఎవరు లేరు అని చెప్పాను.
ఇక ఎక్కడ ఉండాలి అని అనిపించలేదు, వెంటనే బయలుదేరాము.
లిఖిత పూర్వకంగా ఉన్న డాకుమెంట్లనూ కూడా లేక్కచేయంత మోసమా కలికాలం పదమూడు సంవత్సరాల తరువాత, ఇది ఏంటో అదీ మేము లేని టైం లో డ్రా, అదీ రెండు సార్లు తీసారు అట!! అంటే నచ్చిన పార్కింగ్ రాలేదని మళ్ళీ తీసారు.
ఇది ఒక మోసం, మా బిల్డింగ్ లో అన్ని కార్ పార్కింగ్ లు బాగుండవు. ఇబ్బందిగా ఉంటాయి.ఇప్పుడు మాకు ఉన్నది బాగుంటుంది. ఇంకోటి కూడా బాగుంటుంది.
ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, రెండు నెలల కిందట మా పై ఇల్లు సేల్ పెట్టారు దాని పార్కింగ్ పెద్దది. సో కొందాము అని బాబా వారి అనుమతి అడిగితె వద్దు అన్నారు. సరే అని వదిలేసాము.
మావారి కి ఆ పార్కింగ్ మీద కన్ను మళ్ళీ మళ్ళీ బాబా ని అడగవా అనేవారు. ఈసారి బాబా కి కోపం వచ్చి ఒకసారి చెప్తే అర్ధం కాదా అన్నారు. ఇక దాని గురించి వదిలేసాము.
అందరూ ఇబ్బందిగా కార్లు తెస్తూ ఉంటారు, సిటీలో పార్కింగ్ లేదు అంటే ఇల్లు వృదా.
చివరకు మోసాలు విని బాబా ని కూడా నిద్ర పోనివ్వలేదు నేను, కానీ ఆయన నేను ఇక్కడ లేకున్నా నా కోసం ఆయన చేసిన లీల రెండు సార్లు చిట్టీలు వేసి మేము లేము అని మాకోసం ఒకటి పక్కన పెడుతున్నారు, అని వాళ్ళు చెప్పిన మాటలు ఇవి అన్నీ.
ఆ చీటీ ఎదో తెలుసా! మేము కావాలి అనుకున్నాము కదా అది, ఆ పార్కింగ్ ఈరోజు మా సొంతం చేసారు బాబా.!! ఇక ఎలా కృతజ్ఞతలు చెప్పాలి బాబాకి .
చివరకు మీటింగ్ లో కూడా అన్నారు ఎదో చేద్దామని చేసారు చివరకు అక్కకి మంచి జరిగింది తప్ప ఎవరికీ కాదు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు.
నేను ఉంటున్నది క్ర్రూరుల మద్య, బాబా నన్ను ఇక్కడ తెచ్చి పెట్టారు, నేను ఉంటున్నాను. బాబా కోసం నేను (తన మనవరాలు) ఆయనకు మిటాయి దాచినట్టు, నా కోసం నాకు కావలసిన చిట్టీ దాచేశారు.
నేను ఇక్కడ లేకున్నా ఇంటికి తాళం వేసి వెళ్లాను బాబా వాళ్ళ తాళం వేసారు.
నేను వీలైనత తొందరగా నీ దగ్గరు వచ్చి కృతజ్ఞతలు చెప్తాము బాబా.
నమ్మితే వెంట ఉంటారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి.
ఇప్పడు వాళ్ళు వాళ్ళు కేసులు అంటూ తిరిగుతున్నారు. మనల్ని మాత్రం వీటికి దూరంగా ఉంచారు బాబా. టోటల్ గా చక్రం తిప్పారు బాబా.
బాబా మీ మీద భక్తి పెరిగేలా, మీకు నచ్చేలాగా, ఎప్పుడూ మీ మాట వినేలా మమ్ము ఉంచు తండ్రి.
Latest Miracles:
- బాబా ప్రేమ ఎనలేనిది…Audio
- సహజ ప్రేమ తత్వంతో కాపాడుతున్న బాబా
- అంకిత సేవకు, బాబా చూపిన అపార ప్రేమ ….!
- బాబా నే సర్వస్వమ్ అనుకున్న ఒక అభాగ్యురాలి పై బాబా చూపిన ప్రేమ , కరుణ …!
- బాబా నీ ప్రేమ తప్ప నాకేమి వద్దు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments