Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మా వారికి హార్ట్ ప్రాబ్లెమ్ ఉంది కదా, ”పేస్ మేకర్” అమర్చారు,
అది పది సంవత్సరాలకి ఒక సారి మార్చాలి లేక పోతే దానిపని తీరు సరిగ్గా వుండదు అందుకని దానిని తొలగించి మళ్ళీ కొత్తది అమరుస్తారు లక్షల ఖర్చు వుంటుంది,
అది పది సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో ఒకసారి మాకు వనస్థలిపురం పనామా గోడౌన్సులో ఒక టెలిఫోన్ బూత్ వుండేది,
అందులో ఇద్దరు పని చేస్తుండే వారు ఒకళ్ళు పగలు, ఒకళ్ళు రాత్రి పని చేస్తూంటారు ఒక సారి మా వారు చూద్దామని వెళ్లారు 12 గంటలు అయ్యాక ఒంట్లో ఏదోగా వుంది అంటూ ఎలాగో బయలుదేరి ఇంటికి వచ్చేసారు.
నేను ఆయన పరిస్థితి గమనించాను నాకు భయం వేసింది తెల్ల వారితే పరిస్థితి ఏమవుతుందో తెలియదు, ఇంత రాత్రి ఈయనను నేను ఎటు తీసుకు పోతాను చేతిలో చిల్లి గవ్వలేదు,
డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ఆటోకి కూడా డబ్బులు లేవు ఏం చేయాలి? అందుకే
”బాబా చూడు ఈయన్ని ఏం చేస్తావో నాకు తెలియదు ప్రస్తుతం నా పరిస్థితి నీకు తెలుసు నేను స్కూల్లో పనితోటి బాగా అలసిపోయి వున్నాను నాకు నిద్ర కూడా వస్తోంది నువ్వేం చేస్తావో నాకు తెలియదు తెల్లవారాక ఆయనే నన్ను నిద్ర లేపాలి”
అని అనుకోని ఆయనకూ ”ఊదీ” పెట్టాను గుండెలకి కొంచెం ”ఊదీ” రాసాను పడుకున్నారు, నేను నిద్ర లోకి జారిపోయాను.
తెల్లవారింది నన్ను సుహాసినీ సుహాసినీ అంటూ ఆయన తట్టి లేపుతున్నారు, 2 : 30 సమయం నాకు ఆకలి వేస్తోంది అన్నం పెడతావా అని అడిగారు,
రాత్రి ”పేస్ మేకర్” లో బీట్ కి తేడా నేను తెలుసుకున్నాను, అటువంటప్పుడు భోజనం పెట్టడం అంత మంచిది కాదనిపించి నేను అన్నం పెట్టలేదు
సరిగా అరగక పోతే వాంతులు కూడా అవుతాయి అయినా ఆయన అలా వచ్చేటప్పటికి నాకి వన్నీ ఏం గుర్తుకు రాలేదు,
ఆ సమయం లో అన్నం తిన్నారు, మామూలుగానే వున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఒంట్లో బావుండ కుండా అయింది,
నరాలకు ఏదో అయిపోయి కాలి బొటన వేలులోంచి పోటు, ఒళ్ళంతా బిగుసుకు పోయింది కుర్చీలో కూర్చో బెట్టాము, మూడు రోజులయినా అలాగే కూర్చుండి పోయారు,
బాత్రూం కి వెళ్లాలంటే నేను నా కూతురు బలవంతంగా కుర్చీని బాత్రూం దాక ఈడుస్తే, బాత్రూం గుమ్మం దగ్గర మనిషిని బలవంతంగా లేపి నిలబెడితే పని పూర్తి అయ్యాక నేనే నీళ్లు పోసి, మళ్ళీ బలవంతంగా కుర్చీలో కూర్చో బెట్టి మళ్ళీ హాల్లోకి తీసుకు వచ్చే వాళ్ళము.
అన్నం కలిపి పెడితే తినేవారు. మా బాబాయ్ గారబ్బాయి వచ్చాడు, మా ఆయన్ని అలా చూసి ఎందుకక్కా, బావని ఒకసారి డాక్టర్ కి చూపిద్దాము అన్నాడు,
ఒరేయ్ డాక్టర్ అంటేనే భయం వేస్తోంది, లక్షల ఖర్చు చెపుతారు ఇప్పుడు నేనేమైనా చేయించగలనా అన్నాను.
ఒకసారి ఉస్మానియా కి తీసుకెడదాం అక్కడైతే కార్పొరేట్ హాస్పిటల్స్ లో లాగా డబ్బులు గుంజరు అన్నాడు.
సరే నని ఆయన్ని డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళాము. టెస్ట్ చేసారు లంగ్స్, లివర్, కిడ్నీ అన్నీ పాడైపోయాయి అని చెప్పారు.
గుండెకు ఇది వరకే సమస్య వుంది జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళిపోండి అని చెప్పారు.
ఇంటికి వచ్చేసి ఏడ్చుకుంటూ కూర్చున్నా. మా వాళ్ళు కొంతమంది పుట్టపర్తి లో అయితే ట్రీట్మెంట్ అంతా ఫ్రీ గా చేస్తారు, అంతా బావుంటుంది అని చెప్పారు.
సరేనని పుట్టపర్తి ఈయనను తీసుకెడదామనుకున్నాను వెళ్లి మన సమస్య ఇది అని చెప్పేకంటే మనం ఇక్కడ వున్నా కూడా మన సమస్య రాసుకుంటే ఆయనకు తెలుస్తుందన్నారు ఎవరో,
ట్రైన్ ఎక్కాము ట్రైన్ బయలుదేరటానికి ఇంకా సమయం వుంది ఈ లోపు కాగితం పెన్ను తీసుకుని ”షిరిడి సాయిబాబా” ను తలచుకుంటూ పుట్టపర్తి ”సాయిబాబా” కి ఉత్తరం రాసాను
ఏమనంటే ”బాబా నువ్వే ఈయన్ని నాకు చూపించావు పెళ్లి అవుతుంది అని ఆశీర్వదించావు ఆయనకి గుండె జబ్బు పెట్టావు అయినా నేను పెళ్ళి చేసుకున్నాను
ఆయన కేమయినా అయితే బాబా నేనుండలేను అలా అని ఆత్మ హత్య చేసుకునేటంత పిరికి దాన్ని కాను ఆత్మ హత్య మహా పాపమని నాకు తెలుసు ఆయన కేమయినా అయితే నేనుండలేను.
మేము ఇద్దరమూ లేకపోతే చిన్న పిల్ల ఏమవుతుంది అదీ వుండలేదు, నేనేం పాపం చేసుకున్నాను ప్రపంచం లోని కష్టమంతా నేనే అనుభవించాలని రాస్తే ఎలా? ఏం చేయాలి.
అందుకే మేము వచ్చేటప్పటికి, నువ్వే మాకు ఎదురొచ్చి నన్ను వారిని ఆశీర్వదిస్తే బావుంటుంది” అని రాసాను.
నాకు తల్లి తండ్రి గురువు దైవం చివరికి భర్త కూడా నాకా బాబాయే అన్నీ ఆయన నాకు అని నేను చాలా గర్వంగా చెప్పగలను.
అప్పటికి 15 రోజులుగా పుట్టపర్తి లో ”సాయిబాబా” బయటికి రావటం లేదుట ఆ రోజు ఆయన బయటికి వచ్చారు. ఎవరు పుణ్యం చేసుకున్నారో అని అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు.
పుట్టపర్తి ”సాయిబాబా” గారు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు.
మాకు అక్కడ ”షిరిడి సాయి” నాథుడే కనిపిస్తున్నాడు ఎవరో మమ్మల్ని హాస్పిటల్లోకీ తీసుకు వెళ్ళారు అన్నీ టెస్ట్ లు చేసారు ఇంక లాభం లేదు అన్నీ పాడయి పోయాయి
మీరు ఇంతకు ముందు ఎక్కడయితే ఆపరేషన్ చేసి ”పేస్ మేకర్” వేయించారో అక్కడికి తీసుకువెళ్ళండి, వాళ్ళేమైనా చెబుతారేమో, మేమైతే ఏమి చేయలేము మా వల్ల కాదు వెళ్ళిరండి అని చెప్పారు.
మేము తిరిగి హైదరాబాద్ వచ్చేసాము. ఇంక రోజులు లెక్క పెట్టు కోవటం ఒకటే నేను చేయగలిగేది, ఏమి జరుగుతుందో ఇదే భయం ఒక రోజు మళ్ళీ మా బాబాయ్ కొడుకు వచ్చాడు,
అక్కా బావని మళ్ళీ తీసుకువెళ్లి హాస్పిటల్లో చూపిద్దాము అన్నాడు, ఒరేయ్ ఇంక వద్దురా నా దగ్గర డబ్బు లేదు, ఒంట్లో ఓపిక లేదని ఇప్పటికే లక్షలు ఖర్చు పెట్టాను, ఇంక నేను తట్టు కోలేను అన్నాను.
అది కాదక్కా ఒక్కొక్క సారి రిపోర్ట్ లు తప్పు వస్తాయి. అందుకే మరో సారి చూపిద్దామంటున్నాను అన్నాడు. ఉస్మానియా అయితే నేను రానురా అన్నాను. ”ఉస్మానియా కాదక్కా ఈ సారి గాంధీ ఆసుపత్రికి వెళదామన్నాడు,
వీడు ఇంత ఇదిగా పట్టు పడుతున్నాడు ఏమో ఏం జరగనుందో చూద్దామనుకొని బాబా ముందు కెళ్ళి
”నా దగ్గర ఇంకా డబ్బులు లేవు అయినా ఇంక మూడు వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేయదలుచుకున్నా ఏం చేస్తావో నీదే భారం” ని బాబాకు దండం పెట్టుకున్నాను.
మా వారు నేను మా తమ్ముడు ముగ్గురమూ ఆటోలో గాంధీ హాస్పిటల్ కి చేరుకున్నాము, మళ్ళీ టెస్ట్ లు చేసారు
ఒక టెస్ట్ చేసే పరికరం మాత్రం వాళ్ళ దగ్గర లేదు అని మమ్మల్నే చేయించుకు రమ్మన్నారు.
ముందు ఆటోకి 500/- ఆ టెస్ట్ కి 1500/- ఇంకేమో మందులు రాసారు దానికి 500 /- మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు ఆటో ఛార్జి 500/- అయ్యాయి,
అన్ని టెస్టుల రిపోర్ట్స్ వచ్చాయి. అన్నీ నార్మల్ అన్నారు, కొంచెం థైరాయిడ్ ప్రాబ్లెమ్ అని మాత్రం చెప్పి మందులు రాసిచ్చారు,
అంతే అప్పటి నుండి ఇప్పటి వరకూ ఎటువంటి సమస్య మేము ఎదుర్కోలేదు, మధ్యలో మా వారు బాధపడుతూంటే
నేను ”బాబా” తో ”ఏం బాధపడుతున్నారో ఏమో ‘బాబా’ ఆయన బాధ చూడ లేకుండా వున్నాను, ఆయనను నేను ఎలాగూ ఈ రోగం నుండి బయట పడేయలేను కనీసం ఆయన పడుతున్న భాధ లోంచి కొంతయినా నాకు ఇవ్వు నేను పడతాను ఆ బాధ” అనుకున్నాను.
అలా అనుకున్న కొద్ది రోజులకి నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది ఎంతంటే నేను తట్టుకో లేనంతగా బాబాను అడిగానుగా ఆయన నొప్పిలోంచి కొంత నాకు ఇయ్యమని,
అది నాకు గుర్తు లేదు అయినా ‘బాబా’ నాకూ ఆ బాధ పంచాడు . ఆయనకి పూర్తిగా తగ్గించాడు, కొద్ది రోజులలో నాకూ ఆ నొప్పి తగ్గిపోయింది.
సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణ మస్తు
శుభం భవతు
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- ఒక ముసలమ్మపై బాబా చూపిన కరుణ
- అమ్మలా బాబా చూపిన ప్రేమ
- అంకిత సేవకు, బాబా చూపిన అపార ప్రేమ ….!
- బాబా ప్రేమ ఎనలేనిది.
- బాబా పై భక్తి , ఊదీ మహత్యం …..!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments