ఒక ముసలమ్మపై బాబా చూపిన కరుణ



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

అది 1914 సంవత్సరం షిర్డీలో రామనవిమి ఉత్సవం రోజు. అరవై నుండి అరవైఐయిదు వేల దాక ప్రజలు బాబా దర్శనం చేసుకొని తమ గౌరవాలను చెల్లించడానికి వచ్చారు. అంత జనాభాను నియత్రించడానికి చిన్న, పెద్ద అధికారులతో పోలీస్ బృందం కూడా వచ్చి ఉంది.

బాబా భక్తుల దర్శనార్ధం వేకువజాము నుండి కూర్చొని ఉన్నారు. ఉదయం 11 గంటల సమయంలో బాబా చుట్టూ ఉన్న భక్తులు బాబా అల్పాహారం చేస్తారు కాబట్టి వస్తున్న సందర్శకులను కాసేపు అపు చేయమని  పోలీసులుని కోరారు. కాని, బాబా “నాకు ఆకలి లేదు” అన్నారు. 

భక్త సముహమంతా సందడిగా ఒకరిని ఒకరు తోసుకుంటూ, పరుగెత్తుతూ ద్వారకామాయిలోని బాబా దర్శనం చేసుకుంటున్నారు. అదే సమయంలో 60-65 ఏళ్ల వయస్సులో ఉన్న ఒక వృద్ధ మహిళ ద్వారకామాయికి నుండి కొంచం దూరంగా కూర్చుని,  దయాళువైన బాబా కరుణించి నాపై ప్రేమపూర్వకమైన మీ దృష్టిని ప్రసారించండి అని వేడుకుంటూ ఉంది.

శ్రీ R. A. తార్ఖడ్ జన సమూహం గుండా వెళుతుండగా ఆమె అరుపులు అతనికి వినిపించడంతో అతడు త్వరితగతిన ఆమె వద్దకు వెళ్లి ఆమెను బాబా వద్దకు తెసుకొని వెళ్లారు. ఆమె బాబాను చూసిన వెంటనే ప్రేమగా ఆయనను తాకింది, ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు రాసాగాయి. ఆమె కొన్ని నిమిషాలపాటు అలాగే మాట్లాడకుండా ఉండిపోయింది.

అప్పుడు బాబా తమ వరదాహస్తాన్ని ఆమె తల మీద పెట్టి ఆశీర్వదించారు. తరువాత ఆమె మరియు ఆమె కుటుంబం క్షేమ సమాచారాలు అడిగి, “నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. నీవు నాకోసం తినడానికి ఏమి తెచ్చావు? ” అని అడిగారు.

ఆమె “బాబా నేను మీకోసం ఒక రొట్టె మరియు రెండు ఉల్లిపాయలు తీసుకొని వచ్చాను, కానీ సగం దూరం వచ్చాక నేను చాలా అలసిపోయి, ఒక నది ప్రవాహం వద్ద కూర్చుని ఆకలికి తాళలేక సగం రొట్టె, ఒక ఉల్లిపాయ తినెసాను బాబా. సగం రొట్టె మరియు ఒక ఉల్లిపాయ మిగిలి ఉన్నాయి; దయచేసి వాటికీ న్యాయం చేయండి బాబా” అని వేడుకుంది.

బాబా ఉల్లిపాయతో ఆ రొట్టెను ఆనందంగా తింటూ, “అబ్బా! ఎంత మధురంగా ఉన్నాయి ఇవి” అన్నారు.

తమ కళ్ళ ముందు జరుగుతున్నా అద్భుత సన్నివేశాన్ని చూస్తూ, వారి సంభాషణను వింటున్న అక్కడ ఉన్న భక్తుల కన్నుల ఆనందబాష్పాలతో నిండిపోయాయి. 

source: ‘శ్రీ సాయి ది సూపర్ మాన్’ – స్వామి సాయి శరణానంద

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “ఒక ముసలమ్మపై బాబా చూపిన కరుణ

SainathuniPranathi

ఈ లీలా చాలా బాగుంది సాయి. నాకు కూడ ఒక విషయంలో చాలా హ్యపిగా అనిపించింది సాయి అది ఎంటంటే మా అత్తగారికి 2 సంవత్సరాల నుంచి ఒక కోరిక వుంది అది ఎంటంటే మానస్స సరోవరం చూడాలని .కాని దానికి ఆరోగ్య పరంగా అనుకోండి లేదా డబు పరంగా ఏది అనుకులంగా లేదు .మా అత్తగారికి ఆస్తమా వుంది మావారు ఆ చలికి ని ఆరోగ్యం సహకరించదు వదమ్మ అంటు వస్తునారు సాయి.అయినా తన కోరిక అది .ఇపటికి వెలోస్తనురా అని అడుగుతువుంటుంది . ఈ మద్యనే మా అత్తగారికి స్వపనం వచిందట .ఆ స్వప్నంలో తాను మానస్స సరోవరం వెలినట్లు అక్కడ ఆ మంచు ఆ ఆహ్లాదకారమైన వాతావరణం ఎంతో ఆనందించాను తరువాత అక్కడ పార్వతి పారమేశ్వరులు దర్శనమిచారట సాయి. ఎంత ఆనందించానో అని చెపింది . మా అత్తగారు అనారు సాయి బాబా నేను వేలలేక పోతునానని నాకు మానస సరోవరం చూపించారమ్మ అని నాతో ఎంతో ఆనందంగా చెపింది సాయి. నాకు అది చాలా ఆనందంగా అనిపించింది సాయి .తనకు ఇపుడు ఆరోగ్యపరంగా బాగాలేదు కాలనోపులు డాక్టర్స నెలరోజులు బెడ్ రేస్ట చెపారు బాబా తనకు ఆ బాదతేలియ కుండ తనకు మానస సరోవర యాత్ర చేయించారు సాయి అదినాకు చాలా సంతోషంగా అనిపించింది.తనకు బాబానే ఇలా ఈ యాత్ర చేయించారని తను మానస్సార నమపతుంది అది నాకు హ్యపిగా అనిపించి మీతో share చేసుకుంటునాను సాయి.

Sai Suresh

మీ మెసెజ్ చదువుతుంటే నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది సాయి. బాబా ఎంతటి కరుణామయులో కదా సాయి. మీ అత్తగారు బాబాని అడగకపోయినా బాబా ఆమె కోరిక తెర్చేసారు. ఎంత అద్భుతమో కదా సాయి. ఇలా బాబాని కీర్తిస్తూ ఉంటే మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుంది సాయి.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles