సాయి బాబా చూపిన మార్గము రెండవ బాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శిరిడీ సాయి నామం ‘అపూర్వం, అద్భుతం, అసామాన్యం, అతి శక్తి వంతం. సాయి నామాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో జపించే వారి సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి. ఆ సాయినాధుని సన్నిధికి సత్వరం చేరుకోగలము. ఇంత వరౌ తెలిసీ, తెలియక మనము చేసిన పాపాలు నిశించి పోవాలంటే సాయి నామాన్ని పట్టుకోవదం ఒక్కటే చక్కని మార్గం.

పేరు తెలియని భక్తుని మనోభావాలు నిన్నటి తరువాయి బాగం…

ఈ రోజు శ్రీ సాయి ప్రేరణతో ఒక మహనీయుని గురించి మాట్లాడాలని అనిపిస్తోంది. ఆ మహనీయుని పేరు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ. ఈ రోజు సాయి బాబా గారి గురించి కొద్దో గొప్పో తెలిసిందంటే అది ఆ మహానుభావుడు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి చలవే.

ఆయన గురించి చెప్పే ముందు, ముందుగా సాయి నాథుడు ఆయనతో నాకు పరిచయం కలిగించిన సందర్భాన్ని ప్రస్తావించాలి. నేను 2008, జనవరి లో సాయి సత్చరిత్ర చదివినప్పటి నుంచి నాలో ఒక ఆకలి రేగింది. మొదటి సారి చదివినపుడు అనిర్వచానమైన ఆనందం కలిగింది.

అదే చరిత్ర చదవగా బాబా గారి గురించి ఇంక తెలుసుకోవాలని అనిపించింది. సత్చరిత్ర అలాగా కొన్ని పారాయణ చేయగా ఒకసారి హైదరాబాద్ కూకటపల్లి లో బాబా మందిరములో నాకు “సాయి లీలామృతము ” అనే గ్రంధం కనపడింది
అది చదివినప్పుడు అర్థాకలి తో ఉన్నవాడికి విందు భోజనం దొరికినట్లుగా అయ్యింది…  అందులో బాబాగారి లీలలు చదువుతున్న కొద్ది ఇంక చదవాలని అనిపించింది….
భరద్వాజ గారి లీలామృతం చదివినప్పటి నుంచి నాలో ఉన్నా “ఆకలి ” తీరిందో లేదో తెలియదు కాని బాబా గారి గురించిన చింతన ఇంకా, ఇంతకుముందు కన్నా బలంగా కుదిరింది.
కాని ఇక్కడ ఒక విషయం: నాకు లీలామృతం ద్వారా ఎంత ఆనందం కలిగిన భరద్వాజ గారి గురించి మాత్రం పూర్తిగా అవగాహన రాలేదు. పైగా “బాబా గారి గురించి రాసిన పుస్తకుములో ఈయన ఫోటో వేయించుకున్నరెంటి?” అనిపించింది.
ఇంతలో నాకెందుకో బాబా గారి ప్రేరణ వల్ల బాబా గారి ఇంకో పుస్తకం నా దగ్గరే ఉంది అని అనిపించింది. అప్పుడు దొరికింది ” సాయి సన్నిధి”. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు నా కళ్లు చేమర్చాయో చెప్పలేను. ఆ పుస్తకం చదివాక మనస్సులో భరద్వాజ గారికి హృదయపూర్వకంగా థాంక్స్ చెప్పుకున్నాను. 
అప్పటినుంచి ప్రారంభం ఐంది : ఈ భరద్వాజ గారు ఎవరు : మనకి బాబా గారి గుఱించి తెల్సుకోవాలని ఉన్నా తపనను తీర్చిన భరద్వాజ గారి గుఱించి తెల్సుకోవాలని అనిపినించిది.  అందులో నాకు తెల్సిన కొంచెం ఇక్కడ చెప్తున్నా:
మన తెలుగు వారికి బాబా గారు ఇచ్చిన బహుమతి శ్రీ భరద్వాజ. మనం చదివిన సాయి లీలామృతం ఆయన పద్దెనిమిది సంవత్సరాల కృషి. ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించి ఎందఱో మహానుభావులను దర్శించి, షిర్డీలో ఎన్నో రోజులు గడిపి, ఇంటికి, ఊరికి దూరంగా, బాబా కు దగ్గరగా, తను పుట్టింది సాయి సేవకోసమే అని భావించి శ్రమ అనేది ఎరుగక, ఎన్నో వెలకట్టలేని ఆణిముత్యాలను సేకరించి నాలాంటి వాళ్ళకు కొంచెమైన సాయి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి తన జీవితం మొత్తం ధారా పోసిన మూర్తి శ్రీ ఎక్కిరాల గారు
ఆయనే గనక మనకి ఈ గ్రంధాలు అందించి ఉండక పోతే, మనకు చాలా విషయాలు తెలిసేవి కాదు. ఉదాహరణకు: కాకా సాహెబ్ , మహాల్సపతి, రేగే మొదలైన ఆదర్శ భక్తుల గుఱించి, అనన్య చింతన గుఱించి – సబూరీ – నిష్ఠా అనే పదాలకు పూర్తి  అర్ధం.  పూజ ఎందుకు చేయాలి. భగవద్గీత ఎందుకు  – దేవుడు ఎవరు, గురువు ఎందుకు – మతం ఎందుకు ఇంక చాలా “సాదరణ ప్రశ్నలకు  జవాబులు శ్రీ ఎక్కిరాల గారి ద్వారానే లభించాయి.
సాయి బాబా చెప్పిన సూక్తులు పై పైన కాకుండా ఇన్ డెప్త్ అనాలిసేస్ చేయడమే కాకుండా, అందరికి ప్రసాదించడం ద్వార ఆయన నిజమైన సాయి సేవ చేసారు.
రేపు తరువాయి బాగం….
సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సాయి బాబా చూపిన మార్గము రెండవ బాగం…

సాయినాథుని ప్రణతి

చాలా బాగుంది మీ అనుభుతి. నేను కూడ ఈ మద్య భరద్వజ గారి చర్చి చదువుతునను ఆయన గురించి చదువుతుంటే ఎంతో ఆనందం అనిపించింది. ఆయన అనుభవాలలో బాబా గురించి ఎంతో చెపారు .ఈ రోజు కోంచం పని వల్ల భరద్వజ మస్టర్ గారి గురించి చదవలేక పోతునానే అనుకున్నాను ,కాని ఈ లీల వల్ల ఆయన గురించి కొంచం అయినా చదవగలిగాను దన్యవాదాలు

Maruthi

Sai Baba…Sai Baba. Jai Saimaster. “Bharadwaja Guruvara raaya Bhanu prakasha Baba Thanaya Vedantha vedya Ongolu vaasa Vedithimayya Vegame raava Sai kula bhushana Sai priya Thanaya Aadukovayya Vegame raava….. Bharadwaja Guruvara raaya Bhanu prakasha Baba thanaya”.

Maruthi

Jai Saimaster.Bharadwaja….Guruvara raaya,Bhanu prakasha….Baba thanaya,Vedantha vedya….Ongolu vaasa,Vedithimayya….Vegame raava,Saikula Bhushana….Sai priya Thanaya,Aadukovayya….Vegame raava,……Bharadwaja….Guruvara raaya,Bhanu prakasha….Baba Thanaya.

kishore Babu

Thank you Sai….We are very happy to see your valuable comments on this website.
Sai Baba…Sai Baba.

Maruthi

Sai Baba…Sai Baba.Thank you Sai.

kishore Babu

Welcome Sai

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles