మన ప్రశ్న – బాబా సమాధానము ( http://www.yoursaibaba.com) రెండవ బాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

మన ప్రశ్న – బాబా సమాధానము ( http://www.yoursaibaba.com) రెండవ బాగం….

సాయి బంధువులారా! నిన్నటి రోజు మీరు yoursaibaba.com లో అడిగిన ప్రశ్నకు బాబా గారి సమాధానము మరియు బాబా లీల తెలుసుకున్నాము. ఇప్పుడు త్యాగరాజు గారి  అనుభవం చెపుతాను, వారి మాటలలో చదవండి.

2010 సంవత్సరములో బహుశా సెప్టెంబరు లేక అక్టోబరు అయి ఉంటుంది. నేను కూడా yoursaibaba.com వెబ్ సైట్ లో ఒక సమస్య గురించి బాబా వారిని ప్రశ్న అడిగాను. అందులో వచ్చిన సమాధానం,

“మీ అమ్మగారిని తలుచుకుని ఆమె పేరు మీద అన్నదానము చెయ్యి. నీ పిల్లలకి లాభము చేకూరుతుంది. నీకు వెంటనే ఫలితం కనపడుతుంది. సద్గురువుకు సేవ చేస్తావు.”

ఈ విధంగా రెండు సార్లు వచ్చింది. రెండు సార్లు వెంట వెంటనే అడగలేదు. రెండుసార్లు అడిగిన వాటికి చాలా రోజుల అంతరం ఉంది. జవాబు వచ్చిన వెంటనే నేను ఆఫీసుకు వెళ్ళే దారిలో ఉన్న బాబా గుడిలో అన్నదానము నిమిత్తం బియ్యము, కూరలు ఇచ్చాను రెండు సార్లు కూడా.

ఇక్కడ మానవ నైజం చూడండి. వెంటనే లాభం కలుగుతుంది అని ఉంది కదా ఏమి లాభము కలుగుతుందో అని ఆత్రుతగా ఎదురు చూశాను. కానీ ఏమీ కనపడలేదు.

తరువాత నవంబరులో అనుకోని పరిస్థితుల్లో ఏ విధమైన, చెప్పుకోదగ్గ అనారోగ్య సమస్య లేకుండా, గుండెలో లోపాలు తెలియడం, ఆపరేషన్ జరగడం జరిగింది. అంటే పిల్లలు లాభపడ్డట్లే కదా? మనవడు పసిపిల్లవాడు. వాడిని చూసుకుంటున్నాము. సెలవు రోజులు ఈ విధంగా సద్వినియోగం అవుతున్నాయి.

సద్గురువు సేవ అంటే, ఇప్పుడు బ్లాగులో ఆయన లీలలన్నీ పోస్ట్ చేయడం ఆయన సేవ కాదూ?

ఆయన చెప్పేవన్నీ నిగూఢంగా ఉంటాయి. తరువాత అర్థమవుతాయి.

************************************************************************************************************************************************

నాకు కూడా ఒక చిన్న విషయం స్పష్టంగా అర్థంకాక సమాధానం కోసం బాబాని మూడు, నాలుగు రోజులుగా బాబా ని అడుగుతున్నాను. ఇటువంటి సందర్భములో నిన్న, ఈ రోజు yoursaibaba.com ద్వారా సమాధానం పొందిన అనుభవాలు పోస్ట్ చేయడం జరిగింది.

అప్పుడు నా సమస్యకు పరిష్కారం కూడా ఆ సైట్ ద్వారా చూపడానికే బాబా ఈ సమయంలో ఈ లీలలను నా ముందుకు బాబా తెచ్చారేమో అనిపించి, సైట్ ఓపెన్ చేసి నా సమస్యకు పరిష్కారం బాబా ను అడిగాను. బాబా ఇచ్చిన సమాధానం చూసి ఆశ్చర్యపోయాను. నేను అడిగిన ప్రశ్నకు సరైన జవాబు సైట్ ద్వారా ఇచ్చి నా మనస్సుకు ప్రశాంతత చేకూర్చారు బాబా. 

మనకు బాబా పట్ల సంపూర్ణ విశ్వాసం ఉండలేగాని సర్వ అంతర్యామి అయిన ఆ సాయినాధుడు మన ప్రశ్నలకు ఏదో ఒక రూపంలో సమాధానం ఇస్తారు. సమాధానం కోసం వారిని, వీరిని ఆశ్రయించకుండా బాబానే అడగండి.  బాబా ఎవరు పిలిచినా పలుకుతారు. తప్పకుండా సమాధానం ఇస్తారు.

 

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles