మన ప్రశ్న – బాబా సమాధానము ( http://www.yoursaibaba.com) మొదటి బాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

మన ప్రశ్న – బాబా సమాధానము ( http://www.yoursaibaba.com) మొదటి బాగం….

ప్రస్తుతం నేను యు.ఎస్.ఎ లో ఉంటున్నాను. నేను కొన్ని నెలల క్రితం ఇండియా వెళ్ళాను. ఇండియాకి వెళ్ళేముందు మేము చాలా బాధలు అనుభవించాము. అప్పుడు నాకు సహాయం చేయమని బాబాని యువర్ సాయిబాబా.కాం ద్వారా ప్రశ్న అడిగాను.  అందులో నాకు బాబా గారు నన్ను షిరిడీ వెళ్ళమన్నారు. నా కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పారు.

అందుచేత నేను ఇండియా వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. నా భర్త కూడా ఒప్పుకోవడంతో నేను మా అబ్బాయితో ఇండియా వచ్చాను. ఇండియాలో కొన్ని నెలల వరకు నేను షిరిడీ వెళ్ళలేకపోయాను. దానికి ముందు నేను చాలా కష్టాలనుభవించాను.

అటువంటి సమయంలో ఒక గురువారమునాడు నేను మా అబ్బాయితో మా యింటి బాల్కనీలో నుంచున్నాను. అప్పుడు మాయింటి పక్కన ఉండే పొరుగింటాయన బయటకు వచ్చి నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయనను నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, మాట్లాడలేదు కూడా. ఆయన ముసలివాడు,

నా మొహం చూసి నేను చాలా కష్టాలలో ఉన్నానని చెప్పాడు. “విచారించవద్దు.అన్నీ తీరిపోతాయి. ధైర్యంగా ఉండు. నువ్వు చాలా భయపడుతున్నట్లుగా కనిపిస్తున్నావు. నేను నీ బాబాని. అన్నీ నేను చూసుకుంటాను.” 

ఆయన ఆ సమయంలో నేను పడుతున్న నా కష్టాలన్నీ చాలా కరెక్టుగా చెప్పారు. ఆయన నన్ను యింతకుముందు చూడలేదు, నేను తన యింటి పొరుగునే ఉంటానని కూడా ఆయనకి తెలియదు. ఎక్కువ రోజులు ఆయన తన స్వంత ఊరిలోనే ఉంటారు. ఆయన అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారట.

ఆయన మాటలకి నాకు చాలా సంతోషం వేసింది. నన్ను తన యింటికి ఆహ్వానించారు. నేను ఆయన యింటిలోకి వెళ్ళినప్పుడు అక్కడ నా సాయి ఫొటో చూశాను. ఆ సమయంలో నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇదంతా బాబాగారే చేయిస్తున్నారు, నాకు తెలుసు. ఇది నా జీవితంలో రెండవ అనుభవం.

యింతకు ముందు కూడా బాబా గారు ఈవిధంగానే నామీద తన కరుణని చూపించారు.  ఈ అనుభవంతో నాకు చాలా ప్రశాంతత లభించింది. ఈయన దత్తాత్రేయస్వామి భక్తుడు. దత్తాత్రేయుడంటే బాబా తప్ప మరెవరూ కాదు. (మనకందరకూ తెలుసు)

అప్పటి నుంచి నాకు కష్టాలనెదుర్కోవడానికి కొంత శక్తి వచ్చింది. కొన్ని రోజుల తరువాత నేను, నాభర్త, మా అబ్బాయి కలిసి షిరిడీ వెళ్ళాము. మేము సాయంకాలం హారతికి హాజరయ్యాము. బాబాను చక్కగా దర్శించుకున్నాము. 

మేము వారాంతపు రోజులలో వెళ్ళినందువలన ద్వారకామాయిలోకి వెళ్ళలేకపోయాము. వారాంతము కావడంతో ద్వారకామాయి మూసివేశారు. మాకు ఈ విషయం యింతకు ముందు తెలియదు. నాకు చాలా బాధ వేసింది.  మరునాడు శనిషింగణాపూర్ వెళ్ళి శని మహరాజ్ ని దర్శించుకున్నాము.

ఆ రోజు షిరిడీ నించి వెళ్ళేముందు మరొకసారి బాబాని దర్శించుకుందామనుకున్నాను. మేము ఆరోజునే వెళ్ళిపోవాల్సి ఉంది. అందుచేత నేను ఖండోబా మందిరానికి వెళ్ళి, తరువాత ద్వారకామాయికి వచ్చాను. కాని అక్కడ పెద్ద లైను ఉంది. మాకు ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను లైనులో వెళితే సమయం చాలదు.

అక్కడ లోపల ఉన్న సెక్యూరిటీగార్డ్ ని, నాకు రైలుకు టైము అవుతోంది అందుకని నన్ను డైరెక్టుగా లోపలకు పంపమని అభ్యర్థించాను. అతను అలాగే లోపలకు వెళ్ళు అన్నాడు. నేను చాలా సంతోషించాను, రాతి మీద కూర్చున్న బాబాని దర్శించుకున్నాను.  కాని ద్వారకామాయి మెయిన్ డోరు క్లోజ్ చేసి ఉంది.

నేను సాయి భక్తులందరికి ఇచ్చే సలహా యేమిటంటే వారాంతము రోజులలో షిరిడీకి వెళ్ళవద్దని. ఎందుకంటే ఆరోజులలో మనము సాయి పాదుకలను, ధునిని దర్శించే భాగ్యాన్ని కోల్పోతాము. బాబాని దర్శనం చేసుకున్న తరువాత నన్ను లోపలికి పంపిన గార్డుకి కృతజ్ఞతలు చెప్పాను. అతను నాకు “సాయిరాం” అని చెప్పాడు.

నన్ను లోపలికి అనుమతించి ఇదంతా చేసినందుకు నేనప్పుడు బాబా ఉన్న అనుభూతిని చెందాను. చేసేదంతా బాబా గారే. బాబా తన భక్తుల మీద ఎప్పుడూ తన కరుణామృతాన్ని కురిపిస్తూ ఉంటారు. బాబా కి నా కృతజ్ఞతలు.

సమాధి మందిరంలో బాబా వారిని ముఖదర్శనం చేసుకుందామనుకున్నాను. నేను మళ్ళీ వేరే గేటునించి వెనక్కి వెళ్ళాలి. అప్పుడు బాగా వర్షం కురుస్తోంది. అంచేత నేను వెనుక వైపు ఉన్న ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్ళాను. నన్నెవరూ ఆపలేదు. కిటికీ నుంచి బాబా వారిని మరొక్కసారి ముఖదర్శనం చేసుకుని తిరిగి వచ్చాను. షిరిడీ నించి మేము తిరుపతి వెళ్ళి బాలాజీ ని దర్శనం చేసుకుని అక్కడినించి అమెరికాకు తిరిగి వచ్చాము.

మీకు చెప్పినట్లుగా నేను కొన్ని సమస్యలని ఎదుర్కొన్నాను. కాని, బాబా గారు ఎప్పుడూ నాతోనే ఉన్నారు. నేను ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. కాని, బాబాగారు “షిరిడీ వెళ్ళు, సమస్యలన్నీ తీరిపోతాయి” అన్నట్లుగా, అమెరికాకి తిరిగి వచ్చిన తరువాత నాకు ఉద్యోగం వచ్చింది. ఇది నేను కన్న కల. బాబా ఆకలని నిజం చేశారు.

నాకు ఏవిధమైన అనుభవము లేదు, కాని బాబా గారు నాకు ఉద్యోగమిప్పించారు. కానీ నేను ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. అది బాబాగారే చూసుకుంటారు. నాకు తెలుసు. నాకెప్పుడు సమస్య వచ్చినా , నేను బాబా వారిని (యువర్ సాయిబాబా.కాం) ద్వారా అడుగుతూ ఉంటాను. ఆయన నాకు చక్కగా సమాధానమిస్తారు.

నా జీవితంలో ఏదైతే జరుగుతోందో బాబావారు అదే చెపుతున్నారు, అదే జరుగుతోంది. ఎందుకంటే బాబా గారు సర్వాంతర్యామి. బాబా నాతో యెప్పుడూ ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓర్పుతో నాకు సమాధానాలిస్తున్నారు, “నీకు నా దీవెనలుంటాయి” అని చెపుతున్నారు. నా దీవెనలు నీకుంటాయి అని బాబాగారు చెప్పినప్పుడు, నా కళ్ళవెంట కన్నీరు వస్తుంది.

నేప్పుడైనా జీవితంలో పొరపాటు చేస్తే బాబా గారు నన్ను శిక్షిస్తారు. నేను ఏ తప్పు చేసినా బాబాగారు స్పష్టంగా చెపుతారు. బాబా మనలని తప్పు దారిలో నడవనివ్వరు. నేను నా తప్పులను సరిదిద్దుకుని ఆయన దారిని అనుసరిద్దామనుకుంటున్నాను. బాబా! నాతప్పులన్నిటినీ మన్నించు.

మా పొరింగింటాయన నాకు ఏమైతే చెప్పాడో అవన్నీ జరిగినవి, జరుగుతున్నవి కూడా. బాబాగారు తన భక్తులకి సాయపడే విధానాలలో ఇది కూడా ఒకటి. ఆయన గురించి ఆలోచించే వారివద్ద ఆయనెప్పుడూ దగ్గరే ఉంటారు.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles