బాబా ఉన్నారు మొదటి బాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబా ఉన్నారు మొదటి బాగం…

ఈ రోజు మరొక బాబా లీలను తెలుసుకుందాము. ఈ అనుభవం జర్మనీలోని స్వాతి గారిది.  బాబా మీద మనకున్న నమ్మకమే మనలనందరినీ ముందుకు నడిపిస్తుంది.  ఆ నమ్మకం మనకి గొప్ప ధైర్యాన్నిస్తుంది.

బాబా ఏరూపంలో వచ్చినా ముందర మనం గుర్తించలేము.  తరువాత అనుకుంటాము, అయ్యో వచ్చినది బాబాయేనేమో అని. ముందర మన మనసుని మాయ కప్పివేస్తుంది.  అందుచేత నిరంతరం మన మనసులో బాబా నామస్మరణే చేస్తూ ఉంటే మనకంతా సాయిమయంగానే కనపడుతుంది.

ఈరోజు జర్మనీ నుంచి స్వాతి గారి బాబా అనుభవాన్ని తెలుసుకుందాము.

ఇది నాకు ఈమధ్యనే జరిగిన అనుభవం. నేను ప్రతీ గురువారము నాడు బాబా గుడికి వెళ్తూ ఉంటాను.  ఒకసారి గుడికి వెళ్ళే ముందు నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసి తనకు కూడా బాబా ప్రసాదం తీసుకురమ్మని చెప్పింది. 

నాకు కనక ప్రసాదం ఇస్తే నీకు కూడా తెస్తానని చెప్పాను. నేనిక్కడ జర్మనీలో ఉంటున్నాను.  ఇక్కడ గుడిలోని పూజారి గారు బాబాకు తను తయారు చేసిన ప్రసాదం, స్వీట్లు, పళ్ళు, యింకా భక్తులు తెచ్చి సమర్పించేవి అన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు.

ఆరతి అయిన తరువాత భక్తులందరూ ప్రసాదం అక్కడే తినేస్తారు, అందుచేత ఎవరూ కూడా ప్రసాదం ఇంటికి పట్టుకుని వెళ్ళే సమస్యే లేదు.  నేను గుడికి వెళ్ళిన తరువాత నా స్నేహితురాలు చెప్పిన విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను.  భజన కార్యక్రమంలో పూర్తిగా లీనమయిపోయాను.

ఆరతికి ముందు పూజారి గారు బాబాకి ప్రసాదాన్ని నైవేద్యం పెట్టారు.  ఒక తల్లి తన బిడ్డకు ఎలాగయితే ఆహారాన్ని తినిపిస్తుందో, అంతే భక్తితోను, ప్రేమతోను ఆయన బాబాకి ప్రసాదం పెట్టారు.  ఆయన బాబా విగ్రహానికి భుజాల చుట్టూ చిన్న తువాలును కట్టి, బాబా నోటి వద్ద ప్రసాదన్ని పెట్టారు.

మీరు బాబాకి ప్రత్యేకంగా తయారు చేసిన దానిని అలా సమర్పించినపుడు ఒక విధమైన ఆధ్యాత్మిక భావం కలుగుతుంది.  నిజంగా బాబా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారనే భావం మనలో కలుగుతుంది.  నేను బాబాకి బొప్పాయి పండును తీసుకువచ్చాను.  దానిని పూజారిగారు బాబా పాదపద్మాల వద్ద ఉంచారు.

ప్రసాదాన్ని నైవేద్యంగా పెడుతున్నపుడు గుడిలో హనుమాన్ చాలీసా పెట్టారు. అందరూ కూడా దానితో పాటే గొంతులు కలిపి పాడటం మొదలుపెట్టారు.  నివేదన చేస్తున్నపుడు పూజారిగారు ఎవరికీ కూడా ప్రసాదాన్ని ఇవ్వడం నేనెప్పుడూ చూడలేదు.

అందుచేత నేను కళ్ళు మూసుకుని హనుమాన్ చాలీసా పాడటంలో నిమగ్నమైపోయి అందులోని ఆనందాన్ని అనుభవిస్తున్నాను.  ఈలోగా పూజారిగారు ఒక ఆపిల్ పండును బాబాకి నైవేద్యంగా పెట్టినప్పుడు, బాబా ఆ పండుని  కొంచెం కొరికి తిని తరువాత  నాకు ఇవ్వకూడదా అనే ఆలోచన నామనసులో కలిగింది.  తరువాత నాకు నేనే ఎంత తెలివి తక్కువ దానిని అని అనుకున్నాను.  అది సాధ్యం కాదనుకుని మరలా హనుమాన్ చాలీసాని  ఏకాగ్రతతో పాడటం ప్రారంభించాను.

హటాత్తుగా నా ప్రక్కన కూర్చున్నామె నా కాలిమీద తట్టి, పూజారిగారు ఇచ్చే ప్రసాదం తీసుకోమని చెప్పింది.  పూజారిగారు ఆపిల్ పండును బాబాకు నైవేద్యంగా పెట్టిన తరువాత నాకు ఇస్తున్నారని నాకు తెలీలేదు. నాకు నా భర్తకి కళ్ళంబట నీళ్ళు వచ్చాయి.  బాబాగారు మమ్మల్ని అనుగ్రహించారు.

మేము యింటికి వచ్చేటప్పటికి రాత్రి చాలా పొద్దుపోయింది, అందుకని ఆపిల్ ని మర్నాడు ఉదయం తిందామనుకున్నాము.  ఆపిల్ ని కోస్తున్నపుడు నా స్నేహితురాలు ప్రసాదం అడిగిన విషయం గుర్తుకు వచ్చింది.  ఆ ఆపిల్ మనకే కాదు ఆమెకి కూడా అని నా భర్త అన్నారు. 

బాబా ప్రసాదం గురించి నా స్నేహితురాలి కోరిక నిజమైన కోరిక.  అందుకనే బాబాగారు మాద్వారా ప్రసాదాన్ని ఆమెకు పంపించారు. ఆపిల్ పండులో కొంత ఆమెకి ఇచ్చి మొత్తం జరిగినదంతా వివరించాను. బాబా తనను అలా అనుగ్రహించినందుకు నా స్నేహితురాలు చాలా సంతోషించింది. 

తాను సర్వాంతర్యామినని బాబా సత్ చరిత్రలో చెప్పారు.  ఆయన చెప్పిన మాట అక్షారాల సత్యమనిపించింది నాకు. ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. ఆయనకన్నీ తెలుసు, ఆయన మనకోరికలను తీరుస్తారు.  మనం చేయవలసినదల్లా ఆయన పాదాలముందు శరణాగతి చేయడమే. తరువాత మనకేది చేయాలో ఆయనే చూసుకుంటారు.

నాకిప్పుడు జీవితంలో పెద్ద కష్ఠం ఎదురయింది.  చిన్నవాడయిన మా అబ్బాయికి వంట్లో బాగుండలేదు.  కాని బాబా నాతోనే ఉన్నారన్న విషయం నాకు తెలుసు. అంతా ఆయనే చూసుకుంటారు. బాబా నాతోనే ఉన్నపుడు నేను దేని గురించీ ఆందోళనపడనవసరం లేదు. ఆయనే నాతండ్రి. మాయోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు.

ఓం సాయిరాం.

ఇంక ఉంది…..

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles