Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
మూర్తీభవించిన ఆద్వైతం
- ఒక ముస్లిం సంతానం కల్గితే శిరిడిలో మిఠాయి పంచుతానని మ్రోక్కుకున్నారు. అతని కోరిక ఫలించింది. అతడు శిరిడి చేరి మిఠాయి పంచడానికి బాబా అనుమతి కోరారు. అయన నవ్వి మారుతి ఆలయంలో పంచామన్నారు. అతడు నివ్వెరపోయి, “నేను ముస్లిమును కదా అదెలా సాధ్యం?” అన్నారు.
బాబా నవ్వుతూ, “ఇటివల వారికీ జరిగిన యుద్ధంలో మారుతి అల్లాహ్ ను ఓడించారు!” అని, ఉగ్రులై, “ఏం ముస్లిమువురా నీవు! ఆలయంలో మిఠాయి పంచుపో!” అని గద్దించారు. సర్వగతుడైన భగవంతునిపై భక్తికి మతభేదం ఆటంకం కాదని వారి భావం. అతడు బాబా ఆజ్ఞను పాటించాడు.
- ఒక ముస్లిం ఒక పూలగుత్తి తెచ్చి మశీదులో నింబారు మీద వుంచడానికి బాబా అనుమతి కోరాడు. ఆయన, అచ్చట ఆలయంలోని మారుతికి ఆ మాల వేయమన్నారు. ఒక ముస్లింగా తానొక విగ్రహాన్ని పూజించలేనని అతడు చెప్పాడు అపుడాయన. అల్లాహ్ కంటే హనుమంతుడు గొప్పవాడని అర్థమొచ్చేలా తిట్టిపోసారు. అతడా పూలగుత్తి తీసుకెళ్ళి పోయాడు.
- ఒకసారి వానజల్లు ఆయన మీద పడుతుంటే, పైన మారుతి విగ్రహం ప్రక్కన కూచోమని ఒక భక్తుడు చెప్పాడు, బాబా అందుకంగీకరించక, “భగవంతునికి సమానమైన స్థాయిలో మనమెలా కూర్చొంటాము?” అన్నారు.
- సాయి వద్ద ఎప్పుడూ ఒక యిటుక వుండేది. అదంటే వారికి ప్రాణం కంటే ఎక్కువ తీపి. రోజు రాత్రి నిద్రించేటప్పుడు దానిని తమ వద్దనే తలక్రింద పెట్టుకొనేవారు. ఒకనాడు నానాచందోర్కరు అది చూచి ఆశ్చర్యపోయి నమస్కరించి, ‘బాబా, మీరు తలక్రింద ఆ ఇటుక పెట్టుకొనవద్దు, నేనొక దిండు సమర్పించుకుంటాను” అన్నాడు.
బాబా, ‘లక్ష దిండ్లయినా ఈ ఇటుకతో సమానం గాదు, ఇది నా గురు ప్రసాదము, ఇది యావత్ విశ్వం కంటే విలువైనది. ఈ ఇటుకే నా ధ్యేయము, ధ్యానము, నా ప్రాణము గూడా. ఇది పగిలితే నా శరీరం గూడా మరణించడం తథ్యం!” అన్నారు.
దీనికి నా గురువు యొక్క పాద స్పర్శ వున్నది గనుక దీనిని నా తలక్రింద వుంచుకుంటున్నాను, ప్రతిరోజూ తెల్లవారిన దగ్గర నుండి మీరంతా వచ్చి నా మోకాళ్ళ మీద పడతారు. మీ నమస్కారాలన్నీ నేను నా గురువుకు సమర్పించు కుంటాను.
- ఆయన మూర్తీభవించిన ఆద్వైతం. తమ చుట్టూ ఎన్ని జరుగుతున్నా ఆయన నిశ్చలంగా వుండేవారు. ఒక్కొక్కప్పుడు 32 మంది నర్తకులు వచ్చి ఆయన ఎదుట నిత్యమూ నృత్యం చేస్తున్నా పట్టించుకొనక ఆత్మానందంలో నిలచేవారు.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
Latest Miracles:
- స్వయంగా బాబానే “ఫోటో తీసుకోమని” చెప్పారు…Audio
- తేలుకాటు
- ఇతనిని నాకు పరిచయం చేయాలా? నాకితను 30 జన్మలనుండి పరిచయం-శ్రీ జి.జి. నార్కే-1–Audio
- కృప జీవులన్నిటిపైనా! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 10
- హర్దా పెద్దమనిషి
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments