Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒంగోలులో సద్గురువుగా కీర్తించబడే కోట జగన్నాథస్వామి వైశ్య దంపతులకు జన్మించారు.
పూర్వ జన్మల సుకృతం వలన ఆధ్యాత్మిక మార్గం సుగమమైంది, ఎందరో సత్పురుషులు ఆయనను ఆ మార్గంలో నడిపించారు.
పసికందుగా ఉయ్యాలలో ఉన్నప్పుడే ఎవ్వరూ లేని వేళల్లో ఊయలలోనే యోగాసనాలు వేసేవాడు.
మేనమామతో చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు తిరుగుతూ బట్టలు అమ్మేవాడు. మిఠాయి కొట్టుకు పోయి మిఠాయిలు అడిగేవాడు.
ఈయనకు మిఠాయి పెట్టిన నాడు, సరుకంతా అమ్ముడుపోయేది ఆ దుకాణదారుకు. ఇటువంటి సంఘటన శేషాద్రిస్వామి జీవిత చరిత్రలో కూడా ఉంది.
బాపట్లలో జగన్నాథస్వామికి పూజలు చేశారు. పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటైంది. వడ్డించబోయే సమయానికి కారు మేఘాలు క్రమ్మాయి.
ఇక వర్షం కురవటమే తరువాయి. అందరూ భయపడసాగారు. మేఘముల నుద్దేశించి, అయన వాటిని తొలగిపొమ్మన్నారు. అవి చెల్లా చెదురై పోయాయి.
వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఎండ కాయసాగింది. సంతర్పణ చక్కగా సాగింది.
మతాచారాలు అన్నీ నమ్మకంతో నడుస్తాయి. అలా ఆ ఆచారాలను చూపగలిగితేనే సంశయస్తులు, మతాచారాలను గౌరవిస్తారు.
కాశీలో జగన్నాథస్వామి భక్తులతో కలిసి గంగా స్నానం చేస్తున్నారు. తమ పాపాలు పరిహారమైనట్లు నిదర్శనం చూపమని ఆయనను ఎవరో అడిగారు.
జగన్నాథస్వామి పాప పరిహారార్థం ప్రార్థనలు చేయించారు భక్తులతో. ఆ గంగా జలాన్ని తమ చేతిలో పోయమన్నారు. భక్తులు అట్లానే చేశారు.
కొన్ని పీపాల నూనె గంగా నదిపై పోసినట్లు, ఆ పాపాలు జగన్నాథస్వామి చేతి ద్వారా పోయి గంగా నదీ జలాలపై తైలపు కెరటం వలె వ్యాపించాయి.
సుబ్రహ్మణ్యం అనే భక్తుడిని ఈయన తనతో రమ్మన్నారు. అప్పటికే ఆ భక్తుడు తీవ్ర జ్వరంలో నాలుగు దినాల నుండి బాధపడుతున్నాడు.
వెంటనే స్వామి యోగ ప్రక్రియ చేశారు. జ్వరం పోయింది. కాని ఎవరో అప్పుడే జగన్నాథస్వామిని తాకటం సంభవించింది.
జగన్నాథస్వామి ఒడలు వేడితో కాలిపోతుంది. కారణం అడిగాడు ఆ వ్యక్తి. సుబ్రహ్మణ్యం జ్వరాన్ని తాను తీసుకున్నానని సంతోషంగా చెప్పారు జగన్నాథస్వామి.
సాయి కూడా అంటే. కపర్డే కుమారుని ప్లేగు వ్యాధి పొక్కులను సాయి తీసుకున్నాడు.
ఒక అర్ధరాత్రి ఒక కుక్క ప్రసవ వేదన భరించలేక జగన్నాథస్వామి వద్దకు వచ్చింది. స్వామి దానిని కరుణించారు. కుక్క సుఖంగా ప్రసవించింది.
జగన్నాథస్వామి 10.9.1974న దేహాన్ని విడిచారు. నేడు అయన వర్థంతి ఆయనను స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- గీతాభ్యాసం …. మహనీయులు – 2020… సెప్టెంబరు 24
- ఒక్కడు చాలు! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 27
- పాద స్పర్శ …. మహనీయులు – 2020… జూన్ 25
- ఓం శాంతి శాంతి శాంతి …. మహనీయులు – 2020… జూన్ 10
- హరి ఓం తత్ సత్ …. మహనీయులు – 2020… సెప్టెంబరు 4
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments