హరి ఓం తత్ సత్ …. మహనీయులు – 2020… సెప్టెంబరు 4



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా మహాసమాధి చెందిన సమయంలో కొన్ని రూపాయలు మాత్రమే ఉన్నాయి ఆయన వద్ద. ఆయన ధనాన్ని సేకరించలేదు, దాచుకోలేదు.

మోటా మహారాజ్ తాను మరణించిన తరువాత స్మారక చిహ్నాదులను నిర్మించవద్దన్నారు, తన పేరుతొ వచ్చే ధనాన్నంతా విద్యాలయాలు నిర్మించటానికి వాడాలి అని లిఖిత పూర్వకంగా తెలియచేశారు.

మోటా మహారాజ్ 1938లో కరాచీ బీచిలో సాధన చేసుకుంటున్నాడు. “ఇక్కడ ధ్యానం చేయవద్దు. వెళ్ళిపో” అన్నారు ఒక ఫకీరు అక్కడకు వచ్చి.

ఆ ఫకీరు మాటలను మోటా మహారాజ్ లెక్కచేయలేదు. మోటా మహారాజు చూస్తుండగానే, ఒక పెద్ద బండ రాతిని ఎత్తి మోటా మహారాజుపై విసిరాడు ఆ ఫకీరు.

మరుక్షణమే మోటా మహారాజు శరీరం ముక్కలు చెక్కలై ఉండేది. కానీ ఆ బండరాయి మోటా మహారాజు తలవెంట్రుకలకు తగులు కుంటూ పోయి అవతల పడ్డది.

అప్పుడు మోటా మహారాజు గుర్తించాడు ఫకీరు సామాన్యుడు గాడని, అసలు బండను కదిలించటమే కష్టం. ఎత్తటం మరింత కష్టం. విసిరేయటం ఇంకా కష్టం.

ఏ ఆపద కలుగ కుండా ఆ రాయిని విసరటం విశేషమే. అద్భుతమే. మోటా మహారాజు ఆ ఫకీరు పాదాలను గట్టిగా పట్టుకుని శరణు అన్నాడు. తరువాత ఆ ఫకీరు ఎవరో కాదు సాయిబాబా అని గ్రహించాడు.

సాయిబాబా అతనికి సూచనలిస్తూనే ఉన్నాడు. 1939 శ్రీరామ నవమి నాడు మోటాకు సాక్షాత్కారాన్ని కలిగించాడు సాయి.

సగుణాకారుడైన శ్రీ కృష్ణ దర్శనం కలిగింది. నిర్గుణ నిరాకారునిగా చైతన్య దర్శనం లచించింది మోటా మహారాజుకు.

విశ్వ వ్యాపకుడు హరి అని ఆయనకు బోధపడ్డది. అనుభవమైంది. ఇక హరి నామ స్మరణే మోటా మహారాజు ఊపిరి అయింది.

ఒకసారి మోటా మహారాజును త్రాచుపాము కరిచింది. హరి నామ స్మరణ చేయసాగాడు నిరవధికంగా.

ఆయన ప్రక్కన ఏమి జరుగుతోందో అనే స్పృహ లేదు. ఆయనను ఆనంద్ లోని మిషన్ ఆసుపత్రిలో చేర్చారు.

కొంచెం ఆలస్యం అయితే జరగరానిది జరిగేది అన్నాడు డాక్టరు. ఆయన 72 గంటల నిరవధిక హరినామ స్మరణ ఫలితము ఊరికే పొదుగదా!

గాంధీ ఆయనను ఆధ్యాత్మికులలో వైజ్ఞానునిగా గుర్తించాడు.

ఆయన జన్మించినది సెప్టెంబర్ 4, 1898.

నేడు సెప్టెంబరు 4. ఆయన పూర్వాశ్రమ నామం చున్నీలాల్. మోటా మహారాజ్ జయంతి.

ఆయనను, ఆయన గురువైన సాయిబాబాను స్మరిద్దాం.

హరి ఓం …హరి ఓం…హరి ఓం…

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles