Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా పెట్టే పరీక్షలలో నెగ్గితేనే ఆధ్యాత్మిక సంపద లభించేది. ఐతే సాయిబాబా వంటి సద్గురువులు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పరీక్ష పెడతారో ఊహించటం కష్టం.
కబీరు వద్దకు బొఖారా దేశపు మహారాజు ఇబ్రహీం రాజ్యాన్ని వదలి, గురువుకోసం వెదుకుచూ వచ్చాడు. కాశీలో కబీరు గురించి తెలిసింది. అయన కబీరు వద్దకు వెళ్ళి తన వాంఛ వెలిబుచ్చాడు.
“రాజుకు నేత గానికి ఎలా పొసగుతుంది?” అని ప్రశ్నించాడు కబీరు.
“నేను మీ గుమ్మం ముందుకు వచ్చింది రాజుగా కాదు. ఒక యాచకునిలా. నా కోరిక తీర్చండి. వేడుకుంటున్నాను” అన్నాడు కబీరుతో ఆ మహారాజు.
కబీరు భార్య లోయీ ఈ సంభాషణ విని ఇబ్రహీం కోర్కెను తీర్చమంది. కబీరు అంగీకరించాడు.
ఇక ఇబ్రహీంకు ఇంటిలోని పనులన్నీ చెప్పసాగాడు కబీరు. పాత్రలు కడగటం, నీరు, వంట చెరకు మొదలైనవి తెచ్చిపెట్టటం, అలా ఎన్నో పనులు.
ఆ మహారాజు ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, ఆరు సంవత్సరాలు ఇంటి చాకిరీ చేశాడు.
లోయీ ఒకసారి ఇబ్రహీం తలపై చెత్తా చెదారం పడునట్లు చేసింది. “ఎవరు వారు? ఇదే బొఖారాలో అయితే చేయగలరా?” అని కోపంగా పలికాడు ఇబ్రహీం.
“అతని మనసు ఇంకా శుద్ధం కాలేదు” అన్నాడు కబీరు భార్యతో. ఈ సంఘటనను నెమరువేసుకున్నాడు ఇబ్రహీం.
మరో ఆరు ఏండ్లు గడిచాయి. “పాత్ర సిద్ధమైంది” అన్నాడు కబీరు భార్యతో. భార్యకు అర్థమైంది.
మరల ఇబ్రహీం నెత్తిపై చెత్తా చెదారం పోసింది. ఈసారి కోపించలేదు. “అమ్మా! చిరకాలం జీవించు. మనసంతా అహంకారంతో నిడిపోయినప్పుడు ఇలాగే చేస్తుండాలి” అన్నాడు లోయీతో.
కబీరు మహారాజును పిలిచి, “నీ సాధన పూర్తి అయ్యింది. నీ రాజ్యానికి పోవచ్చు” అన్నాడు. ఇబ్రహీంకు అప్పుడు తన ఆత్మతత్వం తెలిసింది. పరబ్రహ్మానుభూతి కలిగింది.
అందరకూ వందనాలు చేస్తూ, తన దేశంవైపు నడకసాగించాడు ఇబ్రహీం మహారాజ్.
మహారాజు తన దేశానికి పోలేదు. టైగ్రిన్ నది వద్ద ఒక చిన్న కుటీరం వేసుకుని ఆత్మానందాన్ని పొందుతుండేవాడు.
ఒకనాడు ఆ మహారాజు టైగ్రిన్ నది ఒడ్డున చిరిగిన బట్ట కుట్టుకుంటుంటే, మహామంత్రి గుర్తించి, మహారాజును తిరిగి రాజ్యానికి రమ్మని వేడుకున్నాడు.
మహారాజు నవ్వి, తన చేతిలో ఉన్న సూదిని నదిలో విసిరాడు. “మహామంత్రి నా సూదిని నాకివ్వగలవా?” ప్రశ్నించాడు మహారాజు.
“లేదు మహాప్రభూ కాని ఇంకొకటి మన రాజ్యం నుండి తెప్పించగలను” అన్నాడు మంత్రి.
మహారాజు నదివైపు చూశాడు. ఒక చేప సూదిని నోట కరచుకొని మహారాజు పాదాలపై పెట్టి మరల నదిలోకి వెళ్ళిపోయింది.
“నాకు రాజ్యమెందుకు? సామ్రాజ్యమెందుకు? దైవం చాలు!” అన్నాడు మహదానందంగా.
(ఈ సంఘటన తేదీ వివరాలు అలభ్యం)
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- రాముడైన ….రహిమైన ….దేవుడొక్కడే …. మహనీయులు – 2020… అక్టోబరు 1
- ఒక చెంపను కొడితే …. మహనీయులు – 2020… అక్టోబరు 30
- దేహమే దేవాలయం …. మహనీయులు – 2020… మార్చి 10
- హరి ఓం తత్ సత్ …. మహనీయులు – 2020… సెప్టెంబరు 4
- ఓం శ్రీ దత్త స్వామినే నమః …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 7
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments