ఒక చెంపను కొడితే …. మహనీయులు – 2020… అక్టోబరు 30



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


“ఎవరైనను మీకు కీడు చేసినచో, తిరిగి జవాబివ్వకుడు. ఇతరుల కోసం మీరేమైనా చేయదలచినచో మేలు మాత్రమే చేయుడు” అన్నాడు సాయి.

దయానంద సరస్వతి పూర్వ నామం మూలా శంకర్. సంపన్నుడు.

సత్యాన్వేషణకై ఇల్లు వీడి సద్గురువు కోసం వెదకగ, ఒకరు లభించారు. ఆయనే విరజానంద సరస్వతి.

గురువు వద్ద వేదోపనిషత్తులు నేర్చుకున్నాడు. చివరగా తన వద్ద గురు దక్షణకు ఇవ్వటానికి ఏవీ లేవు, లవంగాలను ఇవ్వబోయాడు దయానందుడు.

“ఇవి నీవి కావు. నీ వద్ద ఉన్న వానిని ఇవ్వు” అన్నాడు విరజానందులు. “నాదంతా తమదే” అన్నాడు దయానంద నిజాయతీ ఉట్టిపడగా.

“నీ విద్యను సద్వినియోగ పరచు. నీ జ్ఞానాన్ని అందరకూ పంచు. అజ్ఞానాన్ని తొలగించి. హిందువులకు వైదిక ధర్మాన్ని బోధించు” అన్నాడు విరజానందులు.

“అట్లాగే, అందుకోసం నా జీవితాన్ని కూడా త్యాగం చేస్తాను” అని ప్రతిజ్ఞ చేశాడు దయానందుడు.

ప్రజల దృష్టిని వేదాలపైకి మరల్చాడు. మూఢాచారాలను ఖండించాడు. బాల, బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను సమర్దించాడు. ఆర్య సమాజ్ ను స్థాపించాడు.

ఆయనది ఆదర్శప్రాయమైన, నిష్కళంక జీవితం. అనేక ఉపన్యాసాలిచ్చాడు, మహరాజులను కలిశాడు,

విరోధులు పెరిగారు. విష ప్రయోగాలు చేశారు. కానీ, తన యోగ ప్రక్రియల ద్వారా బయటపడగలిగాడు.

జోధ్ పూర మహారాజు గారు ఆహ్వానిస్తే వెళ్లాడు. అక్కడ ఒక వేశ్యకు మహారాజు దాసుడవటం అయన గమనించాడు.

అది తగదని చెప్పాడు మహారాజుకు. ఈ సంగతి ఆ వేశ్యకు తెలిసి పగ పట్టింది. సమయం కోసం వేచి చూచింది. జగన్నాథుడు అనే వంట వాడితో కుమ్మకై, వంట వానిని లోబరుచుకుని పాలలో సీసపు పొడిని కలిపించి, నమ్మకంగా త్రాగించింది.

తెల్లవారింది. శరీరమంతా ఒకటే బాధ. దయానందులు కారణం గ్రహించాడు. యోగ శక్తిచే నివారించుకునే సమయం దాటి పోయింది.

అయన విష ప్రయోగం చేసిన జగన్నాథుని ఎవరూ లేనప్పుడు పిలిచాడు. నేడో, రేపో మహారాజుకు అసలు కారణం తెలుస్తుందని, జగన్నాథునకు దారుణమైన శిక్ష వేస్తాడని దయానందుకు తెలుసు.

తన  వద్ద ఉన్న ఐదు వందల రూపాయలు అతనికి ఇచ్చి నేపాల్ కు పోయి, ప్రాణాలు కాపాడుకొమ్మని చెప్పారు.

దయానందుని కాళ్లపై పడ్డాడు జగన్నాథుడు. ప్రాణం తీసిన వంటవానికి కూడా జీవం ఇచ్చే సంస్కారవంతుడు, క్షమాశీలి ఆ దయానందుడు.

అసలు ఆ పేరుకు ఉదాహరణ ఆయనే అనిపిస్తుంది.

అక్టోబరు 30, 1883 దీపావళినాడు ఓంకార నాదంతో సమాధి అవస్థలో ప్రాణాన్ని విడిచాడు దయానందుడు, దయానందు కాదు దయాసాగరుడు.

నేడు అయన వర్థంతి ఆయనను స్మరిద్దాం! వేదాలను పఠిద్దాం!!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles