నే మారానంటే నమ్మరేం! …. మహనీయులు – 2020… ఏప్రిల్ 30



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా గురువే. ఏ శిష్యునిపైనా పగ, అసూయా ద్వేషాలు లేవు.

శిష్యులపై పగ, అసూయా ద్వేషాలు పెంచుకునే గురువులుంటారు. అందులో ఒకరు అహింసకుని గురువు.

అహింస తక్షశిల విశ్వ విద్యాలయానికి వెళ్ళాడు. ఒక గురువుకు అహింసకుని మీద అకారణంగా ద్వేషం పెంచుకుని, తాను మట్టుపెట్టలేక,

“నాయనా! నా దగ్గర పరమోన్నతమైన తారక విద్య ఉంది. నీవు వెయ్యిమంది స్త్రీలనైనా, పురుషులనైనా వధించి, అందుకు గుర్తుగా వారి చిటికెన వేళ్ళను మాలగా గ్రుచ్చి సమర్పించు. నీకు జ్ఞాన భిక్ష పెడతాను” అన్నాడు.

” ఇతరులను చంపటం నా కిష్టం లేదు. మీ వద్ద విద్య నభ్యసించాలనే అభిలాష కొద్దీ, మీ ఆజ్ఞగా భావించి చిటికెన వేళ్ళను తెచ్చి సమర్పిస్తాను” అని అహింసకుడు బయలుదేరాడు.

ఎంతోమందిని అవివేకంగా చంపి, వాళ్ళ చిటికెన వేళ్ళు కోసి మాలగా ధరించేవాడు. అతడికే అంగుళీమాలుడు అనే పేరు వచ్చింది.

పరమ కిరాతకుని జాబితాలో ఉన్నాడు ప్రజల దృష్టిలో. ప్రసేనజిత్ మహారాజ్ కూడా ఏమీ చేయలేకపోయాడు.

ఇక ఒకవ్యక్తిని చంపితే చాలు. వెయ్యి లెక్క పూర్తవుతుంది. అడవిలో ప్రశాంతంగా నడుస్తున్న బుద్ధుడు కనిపించాడు.

బుద్ధుని చంపుదామనిపించలేదు. పైగా హెచ్చరించాడు అంగుళీమాలుడు బుద్ధుని పారిపొమ్మని. వారిద్దరి మధ్య వాదోపవాదాలయ్యాయి.

బుద్ధుడు “నీవు దుఃఖితుడవు. శాంతి లేక అడవులలో తిరుగుతున్నావు. నాకు భయంలేదు. ఆశలేదు. ఏమీ లేదు. ఆనందంగా హాయిగా ఉన్నాను.

నువ్వు నన్ను చంపినా, శాంతిగా, సుఖంగా, ఆనందంగా, సంతోషంగా ఉండలేవు కదా? సుఖంగా ఉండే మార్గం తెలిసేటంతవరకు, ఇట్లా దుఃఖితుడవై జీవిస్తావు తప్పదు. అందుకే నిన్ను చూసి జాలిపడుతున్నాను అన్నాడు.

“ఈయన ధైర్యవంతుడు, జ్ఞానవంతునిలా ఉన్నాడు. నేను వినమ్రుడై ఉండాలి. నాకు జ్ఞానోదయం కలిగించటానికి వచ్చిన మహాత్ముడు” అని అంగుళీమాలుడు గ్రహించి, బుద్ధుని పాదాలపై పడ్డాడు.

హింసకుడైన అంగుళీమాలుడిని అహింసకునిగా మార్చాడు బుద్ధుడు. అంగుళీమాలుడు భిక్షువై రాగ ద్వేషాలను వదిలేశాడు.

దుర్మార్గుడు మంచివాడైతే లోకం అతనిని నమ్మదు. అతనిచేత హింసింపబడినవారు భిక్ష చేసి తిరిగి వస్తున్న అహింసకుని చచ్చేటట్టు కొట్టారు.

రక్త స్రావంతో బుద్ధుని చేరి “ప్రభూ! నేను మీ త్రికరణాలను నమ్మేను. ఇప్పటి నా గాయాలు నా పాపా పరిహారం కోసం నాకు లభించినవే. నేనిక బ్రతకను” అని బుద్ధుని క్షమా భిక్షకోరి కన్ను మూసాడు.

శ్రీలంక దేశం 30 ఏప్రియల్ 1993న అంగుళీమాల సంస్మరణార్థం తపాలా బిళ్ళను విడుదల చేసింది.

బుద్ధం శరణం గచ్ఛామి

ధ ర్మంశరణం గచ్ఛామి

సంఘం శరణం గచ్ఛామి.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles