Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“నీ ఆలోచనలు, నీ చేష్టలు నా కొరకే వినియోగింపుము. తప్పక పరమార్థమును పొందెదవు” అంటారు సాయిబాబా.
దావూద్ తాయి సూఫీ యోగి. అయన పాటించే నియమాలు అందరినీ ఆశ్చర్యపరచేవి.
రొట్టె ముక్కను తినకుండా, దానిని నీటిలో ముంచుకుని, ఆ నీటినే త్రాగేవాడు.
ఎవరైనా కారణం అడిగితే “రొట్టెను నమిలి తినాలి. ఆ సమయంలో ఖురాన్ లోని కొన్ని సురాలను చదవచ్చు గదా! బ్రతికిన కొద్ది కాలంలో సమయాన్ని వృధా చేయటం ఎందుకు?” అనే వాడు.
సరిగ్గా ఇటువంటి సంఘటనే రామకృష్ణ పరమహంస తెలియ చేశారు.
చక్కటి బట్టలు ధరించడు ఆ సూఫీ యోగి. కనీసం గడ్డం కూడా చక్కగా ఉంచుకోడు.
కారణాన్ని ఎవరైనా అడిగితే “ప్రార్థన ఎగగొట్టి తీరికగా సోకు చేసు కోవాలనా మీ ఉద్దేశం” అని ప్రశ్నించే వాడు.
కాలం విలువ ఆయనకు బాగా తెలుసు. మహా భాగవతంలో పరీక్షితు మహారాజుకు కూడా కాలపు విలువ తెలుసు.
దావూద్ ఒకసారి నీటి కుండ ఎండలో ఉంటే, దానిని తెచ్చి నీడలో పెట్టాడు.
కాని కొద్ది సేపటికి ఎండ మరల ఆ నీటి కుండ వైపు వచ్చింది. ఎండ పడుతున్నా (ఆ కుండపై) దానిని తిరిగి నీడ వైపు పెట్టలేదు.
అందుకు కారణాన్ని ఎవరో అడిగారు. “నేను కుండను ఎండ నుండి నీడలోకి మార్చాను. కానీ ఎండ పెరగటంతో ఇప్పుడది ఎండలో ఉంది. భగవంతుడు అలా చేసినప్పుడు, మరల కుండను నీడలో ఉంచటం, భగవంతుని చేతను మార్చటమే అవుతుంది. అది నావల్ల కాదు” అన్నారాయన.
ఆయన వివాహం చేసుకోలేదు. కారణం అడిగారెవరో. “పెళ్లాడటమంటే స్త్రీని జీవితాంతం అన్ని విషయాలలోను బాధ్యతాయుతంగా కాపాడతానని నిర్ణయం తీసుకోవటమే.
నాకేమో భగవంతుని పట్ల ఉన్న సాధన, ప్రార్థనలు నెరవేర్చటానికే సమయం చాలటం లేదు. ఇక వివాహం చేసుకుని, ఆ భార్య బాధ్యతలు తీసుకుంటానని చెప్పటం అబద్ధమవుతుంది.
అందువల్ల నేను వివాహమాడి ఒక స్త్రీని మోసం చేయలేను” అన్నాడు.
తల్లిదండ్రుల నుండి ఒక భవనం ఆయనకు వచ్చింది. దానిని బాగు చేసేవాడు కాదు ఆయన.
ఒక గది పాడైపోతే వేరో గదిలోనికి మకామును మార్చుకునే వాడు. చివరకు వరండా పై భాగం కూలేందుకు సిద్ధంగా ఉంది. అయినా పట్టించుకోలేదు.
విచిత్రం ఏమిటంటే దావూద్ శరీరం విడచిన మరునాడే వరండా పూర్తిగా కుప్ప కూలింది.
ఆ యోగి జనన మరణ వివరాలు లేవు. కొంతలో కొంతైనా ఆ సూఫీ యోగి వలె జీవితాన్ని మలచుకోవడానికి ప్రయత్నింద్దాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- కొడుకు పుట్టాల! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 14
- రాతి హృదయము …. మహనీయులు – 2020… జూన్ 26
- సువర్ణాక్షరాలు …. మహనీయులు – 2020… ఆగస్టు 11
- నీ కోసమే నే జీవించునది…..సాయి@366 అక్టోబర్ 27….Audio
- పయనమైన ప్రియతముడు…. మహనీయులు – 2020… మే 21
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments