Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“ఏ గ్రంధం చదవమంటారు?” అని సాయిబాబాను కాకా సాహెబ్ దీక్షిత్ ప్రశ్నిస్తాడు. “ఏకనాథుని బృందావనం” అంటారు సాయి.
ఎందరినో ప్రశ్నిస్తాడు ఆ పేరును గూర్చి. ఆ పేరే వినలేదంటారు అందరూ. చివరకు తెలిసింది అది ఏకనాథుని భాగవతమని.
శ్రావస్తికి చెందిన ఒక వర్తకుడు బుద్ధభగవానుని వద్దకు వస్తాడు. అతడు రాగానే “సుదాత్తా” అని పిలిచాడు బుద్ధుడు.
అసలు అది అనాథపిండకుని చిన్ననాటి పేరు. ఆ పేరు ఎవరికీ తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. బుద్ధుడు అసామాన్యుడని గ్రహించాడు ఆ అనాధపిండకుడు.
అతడు సాధు సజ్జనులకు, సన్యాసులకు, అనాథలకు నిరతాన్న దానం చేసేవాడు. చక్రవర్తులు కూడా అసూయపడేంత ధనికుడు.
అనాథపిండకునికి బుద్దునిపై భక్తి, ప్రేమలు చిగురించాయి. బుద్ధుని ఆ సంవత్సరం చాతుర్మాస్యం (వానాకాలం నాలుగు నెలలు) శ్రావస్తిలో గడపవలసినదిగా కోరాడు. బుద్ధుడు అంగీకరించాడు. అందుకుగాను ఎంతో ధనం వెచ్చించి జేతవనాన్ని నిర్మించాడు.
అతడు బుద్ధుడు తన పరివారంతో ఉండే రాజగృహం నుండి శ్రావస్తి వరకు 130 మైళ్ళు దారి పొడవునా విశ్రాంతి శాలలు కట్టించాడు.
జేతుడనే రాజకుమారుని వద్దనుండి స్థలాన్ని కొన్నాడు. అందుకే అది జేతవనమైంది. అక్కడ భోజన వసతి సదుపాయాలతో అందమైన ఒక విహారం నిర్మించాడు.
బుద్ధుడు అనేక చాతుర్మాస్యాలు గడిపాడు అక్కడ. అనాథపిండకుని కుమారుడు కాలనాథుడు.
కాలనాథుడు పోకిరీ పిల్లలకు నాయకుడు. యువరాజుతో స్నేహం. రోజూ ఖర్చు నిమిత్తం వంద వరహాలు తీసుకునేవాడు తండ్రి నుంచి.
“నువ్వు బౌద్ధ విహారానికి వెళ్ళివస్తే వంద వరహాలిస్తాను” అన్నాడు తండ్రి, అలాగే వెళ్ళి వచ్చి వంద వరహాలు తీసుకునేవాడు కుమారుడు.
“నువ్వు బౌద్ధ విహారానికి వెళ్ళిన గుర్తుగా బుద్ధుని ప్రవచనం – రోజూ కొకటి అప్పచెప్పి అర్ధం వివరిస్తే వందవరహాలు కాదు వేయి వరహాలిస్తాను” అన్నాడు తండ్రి.
ఓ రోజూ కాలనాథుడు బుద్దిని బోధను శ్రద్దగా విని, దానిని మననం చేసుకుంటూ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు.
ఆ మరునాడు కాలనాథుడు భిక్షువులతో కలిసి వస్తున్నాడు. ఆ రోజూ వారు అనాథకుని ఇంటికి వెళ్ళారు. ఆ గుంపులో ఉన్న కుమారుని చూచి సంతసించి వేయి వరహాలివ్వబోయాడు.
“తండ్రీ! నాకేమీ వద్దు. నీ ఆస్తి వద్దు. ఏ తండ్రీ ఏ కొడుక్కి చేయని గొప్ప మేలే మీరు నాకు చేశారు. అదే పదివేలు!” అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా కుమారుడు తండ్రితో. తండ్రీ ఆనంద భరితుడైనాడు.
ఈ సంఘటన తేదీ మొదలగు వివరములు అలభ్యములు.
ఆ ఇద్దరు ఆనందకారకుడైన బుద్ధునకు నమస్కరించారు!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఒక అడుగు ముందుకు వెయ్యి …. మహనీయులు – 2020… జూన్ 23
- దర్శనమే సాధన! …. మహనీయులు – 2020… ఆగస్టు 19
- చద్ది కూడు.. …. మహనీయులు – 2020… అక్టోబరు 3
- కృషి…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 8
- మహా భిక్షు …. మహనీయులు – 2020… మే 24
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments