Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సాయి సచ్చరిత్రలో “భక్తి మార్గము లుప్తమై, ప్రజలు ధర్మ రహితులవుతున్నప్పుడు, శ్రీ సమర్థ రామదాసు జన్మించి, శివాజీ ద్వారా రాజ్యాన్ని యవనులనుండి కాపాడారు” అని హేమాడ్ పంత్ వ్రాశారు.
సమర్థ రామదాసు యోగ బృందాన్ని రామదాస పంచాయతనం లేదా రామదాస పంచకము అంటారు.
వారు సమర్థ రామదాసు, జయరామ స్వామి, రంగనాధ స్వామి, ఆనంద మూర్తి ఇంకా కేశవ స్వామి,
కేశవ స్వామి నిజాము దేశమును, భాగ్యనగరమును కర్మ భూమిగా చేసుకున్నాడు. ఈయన యోగి. ఐనా భక్తినే ప్రబోదించేవాడు.
ఒకసారి ఆయన హరికథా కాలక్షేపం చేస్తున్నాడు. ఒక బలమైన పఠాన్ తన బలగంతో వచ్చాడు. కేశవ స్వామి అతనిని స్వాగతించాడు.
హరిదాసు వెనుకనున్న తెరపై ఉన్న రాధాకృష్ణుల పటం చూచాడు పఠాన్.
“ఈ చిత్రంలోని రాధ కృష్ణునకు తాంబూలం తినిపిస్తే నీవు చెప్పే కథ వాస్తవమనుకుంటాను, లేకుంటే అందరివద్ద తలా నూరు రూపాయలు వసూలు చేస్తాను” అన్నాడు పఠాన్.
అందరు భయంతో లేచి నిలబడ్డారు. కేశవ స్వామి కంఠం రుద్ధమైంది. కృష్ణ పరమాత్మను ధ్యానించాడు.
“నీకు మాపై కరుణ ఉంటే సాక్షాత్కరించి, చమత్కారం చూపు” అని ప్రార్ధించాడు. నామ సంకీర్తన ప్రారంభించాడు. అందరు ఆ నామ సంకీర్తనలో గొంతుకలిపారు.
ఒక్కసారి తళుక్కుమని మెరుపు మెరిసింది. రాధ చేతిలోని తాంబూలం కృష్ణుని నోటిలో కనిపించింది.
ఆ అద్భుతాన్ని కనులారా చూచిన పఠాన్ గజగజలాడాడు. క్షమాపణ వేడాడు. కేశవ స్వామి శిష్యుడైనాడు.
మత సామరస్యం తొణికిసలాడింది. మహమ్మదీయు లెందరో కేశవ స్వామి భక్తులయ్యారు.
“శరీరం రోలు, మనసు రోకలి. ఆ రోకలితో జీవ భావాన్ని దంచి, పిండి చేయాలి. అజ్ఞానమనే ఊకను తొలగించి, శుద్ధ బ్రహ్మమనే పిండిని గ్రహించాలి” అనేవారు కేశవ స్వామి.
ఈయన వద్దకే ఇతర పంచాయతనంలోని మహమ్మదీయులు విచ్చేసేవారు. శివాజీ మహా రాజు కూడా కేశవ స్వామిని దర్శించాడు.
యవనుల గడ్డ అయిన భాగ్య నగరంలో హైందవ చిహ్నమైన కాషాయ పతాకాన్ని రెప రెపలాడించిన కీర్తి కేశవయ్య స్వామిది.
ఆయన 1610లో పుష్య (పుష్య మాసం సామాన్యంగా జనవరిలో వస్తుంది) శుద్ధ త్రయోదశినాడు సజీవ సమాధి చెందారు.
సాహసంతో జీవించి భక్తిని పంచిన కేశవ స్వామిని స్మరిద్దాం!
జియాగూడ (హైదరాబాదు)లో ఉన్న ఆయన సమాధిని దర్శిద్దాం! తరిద్దాం!!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- శేష మార్గము … మహనీయులు @2020 – జనవరి 4
- భక్తి జ్ఞాన సంగమం… .మహనీయులు – 2020… అక్టోబరు 8
- అంతా మన మంచికే! …. మహనీయులు – 2020 – జనవరి 31
- గోవింద రాం రాం గోపాల హరి హరి … మహనీయులు – 2020 – జనవరి 13
- శ్రీ స్వామి సమర్థ జై జై స్వామి సమర్థ…. మహనీయులు – 2020… ఏప్రిల్ 1
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments