అంతా మన మంచికే! …. మహనీయులు – 2020 – జనవరి 31



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఒకే గురువును సేవించేవారందరు పరస్పరం ప్రేమాభిమానాలతో ఉండాలని సాయిబాబాలాంటి సద్గురువు భావిస్తారు.

కానీ అసూయవలన ద్వేషాది దురభిమానాలు చోటు చేసుకుంటాయి కొందరు భక్తులలో. సరిగ్గా ఇదే జరిగింది స్వామి నారాయణ సాంప్రదాయాల్లో.

మెహలవ్ అనే గ్రామంలో 31  జనవరి 1865న దుంగర్ పటేల్ జన్మించాడు.

పసిబిడ్డడిగా ఉన్నప్పుడే అతడు స్వామి సాంప్రదాయంలో సుప్రసిద్ధుడవుతాడని స్వామి గుణాతీతానంద పలికారు ఆ బిడ్డడిని దీవిస్తూ.

చిన్న వయస్సులోనే మట్టితో ఆలయాలు నిర్మించి హారతులిచ్చేవాడు. భయమేలేదు ఆ బాలకునకు.

సుమారు ఐదేండ్ల ప్రాయంలోనే, రాత్రి సమయంలో, ఒంటరిగా నిర్జన మార్గంలో తండ్రి ఉన్న పొలానికి వెళ్ళాడు.

“భయంలేదా? ఒంటరిగా ఎలా వచ్చావు?” తండ్రి ప్రశ్నించాడు. “స్వామి నారాయణ నామాన్ని స్మరిస్తూ ఉంటె, ఆయనే మనవెంట ఉంటాడన్నావుగా! స్వామి నారాయణ నామ జపం చేసుకుంటూ వచ్చాను. అంతే” అన్నాడు దుంగర్.

ఒక రోజున అందరు పెండ్లికి వెళ్ళారు. భోజనానికి సిద్దమయ్యారందరూ. దుంగర్ ఆనాడు ఏకాదశి అని భుజింపరాదని చెప్పాడు. అందరూ విస్తుబోయారు ఆ మాటలకు.

తండ్రి అనుమతి తీసుకుని, దీక్ష తీసుకున్నాడు. ఈయన మేధా సంపత్తిని చూచి ఆ సాంప్రదాయపు వారు సకల శాస్తాలలో నిష్ణాతునిగా చేశారు. శాస్త్రి మహారాజ్ అయ్యాడు.

ఆ సాంప్రదయంలో ఈయన చక్కటి పేరు తెచ్చుకున్నాడు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కనబడని కవచాలు ఆయనకు.

అయన చెప్పే ప్రవచనాలను భక్తులు రాకుండా, వినకుండా విరోధులు ఎండు మిరపకాయలను తగులబెట్టేవారు, కూర్చోవటానికి వీలులేకుండా నీరు పోసేవారు.

భోజనంలో శాస్త్రికి విషము పెట్టేవారు. విషమున్నదని తెలిసినా చిరునవ్వుతో స్వీకరించేవారాయన. అది మీరాబాయికే చెల్లు. శాస్త్రీజీకే చెల్లు.

చివరకు ఆ ఆశ్రమం నుండి వెడలిపొమ్మని ప్రత్యక్షంగా, పరోక్షంగా చెప్పేవారు, చెప్పించేవారు, ఆయన భయపడలేదు.

తన వారితో ఆశ్రమం నుండి బయటకు వచ్చారు. అంతా మన మంచికే!

పేరు పొందిన బందిపోటు ఈయన శిష్యుడయ్యాడు. తాను నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా బొచాసన్ (Bochasan)లో అక్షర పురుషోత్తమ మందిరం నెలకొల్పారు.

స్వామి నారాయణను సాక్షాత్తు  అక్షరునిగా ఈ తత్త్వం విశ్వసించి ఉపాసిస్తుంది. దానినే BAPS అంటారు. అది విశ్వవ్యాప్తమైంది.

నేడు జనవరి 31, శాస్త్రీజీ జన్మదినం –

ఆయన ప్రతిపాదించి నెలకొల్పిన అక్షర పురుషోత్తములను స్మరిద్దాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles