Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒక సారి నాకు చాలా జబ్బు చేసింది. చాలా నీరసించి పోయాను. సయాటికా వచ్చింది. చాలా బాధ పడ్డాను.
నడుము మీద నుండి ఇసుక బస్తా వేసి స్ప్రింగ్ లతో లాగే వారు. చాలా మందులు వాడాను. ఎటువంటి గుణం కనపడలేదు.
అటువంటి సమయంలో మా వారు నాకొక చెక్ (Cheque) ఇచ్చి జాగ్రత్తగా దాచు అని ఇచ్చారు. నేను దాన్ని యధాప్రకారంగా బీరువాలో పెట్టాను.
ఆయన ఏది ఇచ్చినా జాగ్రత్తగా బీరువాలో దాస్తాను. అది నా అలవాటు. ఎన్ని మందులు వాడినా నా జబ్బు నయం అవటం లేదని మా తమ్ముడు నన్ను తీసుకువెళ్లి కాకినాడలో ప్రకృతి వైద్యాలయంలో చేర్పించాడు.
అక్కడ నేను 45 రోజులు ఉన్నాను. అక్కడ ఉన్నన్ని రోజులు నాకు తినడానికి ఏమి పెట్టలేదు, తాగడానికి ఏమి ఇవ్వలేదు. తేనె నీళ్ళల్లో నిమ్మకాయ రసం పిండి ఉదయాన్నే ఇచ్చేవారు.
అప్పుడప్పుడు పాలకూర సన్నగా తరిగి దాన్ని ఉడికించి సూప్ లాగా ఇచ్చేవారు, అంతే ఇంకేమి ఉండేది కాదు.
అక్కడ ఉన్నన్ని నాళ్ళు బాగానే ఉన్నాను. ఎందుకంటే అక్కడ డాక్టర్స్ ఉంటారుగా అందుకని అక్కడ ఉండగా ఏం కాదు. బయటికి రాగానే ఆ నీరసానికి నేను తట్టుకోలేక పోయేదాన్ని కళ్ళు కాళ్ళు తేలిపోయేవి.
నేనేం చేస్తున్నానో నాకు తెలియని అయోమయం, నిలబడలేక పోయేదాన్ని, కూర్చో లేక పోయేదాన్ని. నన్ను తీసుకువచ్చి మా తమ్ముడు హైదరాబాద్ లో మా ఇంట్లో వదిలి వెళ్ళిపోయాడు.
అప్పుడు మా ఇంట్లో మా అత్తగారు కూడా ఉంది. నేను వచ్చిన రెండో రోజే రాజ్యం అప్పుడు నీకిచ్చిన చెక్ తీసుకురా అన్నారు మా వారు.
చెక్కా నాకెప్పుడిచ్చారు అన్నాను నేను. నువ్వు ఉరికెళ్ళేముందు నీకు నేను ఒక చెక్ ఇచ్చాను అది తీసుకురా అన్నారు. నేను బీరువా తీసి చూసాను. నాకేం కనపడలేదు. లేదు అన్నాను.
లేకపోవడం ఏంటి బీరువాలో పెట్టలేదా దాన్ని? అన్నారు. ఆయన ఏ చెక్, ఎప్పుడు ఇచ్చారో ఏం గుర్తులేదు. నాకేం గుర్తు రావడం లేదు, ఎప్పుడిచ్చారు అన్నాను. వెతుకు నేను కాసేపు ఆగి ఫోన్ చేస్తాను అని వెళ్లిపోయారు.
నాకసలు ఓపిక లేదు. వెళ్లి వెతికాను. ఫైల్స్ అన్ని వెతికాను, నాకేం కనపడలేదు. ఈ లోపు ఫోన్ రానే వచ్చింది.
ఐదు బ్రాంచీలలో డబ్బులు జీతాలు ఇవ్వాలి. అది కనపడకపోతే నా ఉద్యోగం పోతుంది. మరోసారి వెతకమన్నారు. నేను మళ్ళీ ఎక్కడ లేని బలం పుంజుకొని మరీ వెతికాను, కనపడలేదు.
ఈ చెక్ కనపడకపోతే నన్ను తప్పనిసరిగా ఇంట్లోంచి గెంటేస్తారు మా వారు అని నేను అనుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఫోన్ వచ్చింది నేను దొరకలేదు అన్నాను ఈ సారి దుర్భాషలు విన్నాను.
నాకు ఉక్రోషం వస్తుంది. ఇంత నీరసంగా ఇంటికి వస్తే ఇలా ఈ చెక్ గురించి గోలేంటి అనుకున్నాను. ఇంక నా వల్ల అవటం లేదు, బాబా ముందు కూర్చొని ఏడుస్తున్నాను.
బాబా ఏమిటీ ఈ పరిస్థితి? నాకేమో చెక్ ఇచ్చారట! నాకు గుర్తు కూడా లేదు! ఎక్కడ పెట్టానో తెలియదు. నాకా వెతికే ఓపిక ఏ మాత్రమూ లేదు.
అది దొరక్కపోతే ఆయన ఉద్యోగం పోతుందట, ఐదు బ్రాంచ్ లలో పని చేసేవారికి జీతాలు ఇవ్వాలట, వాళ్లంతా బాధపడతారు ఇంత జరిగాక నన్ను ఈయన ఇంట్లో ఉండనీయరు, ఏం చేయాలి బాబా? అంటూ ఏడ్చి ఏడ్చి అలాగే ఒరిగిపోయాను.
నా చెవిలో – బీరువాలో గులాబీ రంగు ఫైలులో 6 వ పేజీలో చూడు అని వినపడింది, అంతే ఒక్క ఉదుటున లేచి గభాలున బీరువా తీసి గులాబీ ఫైల్ తీసి చతికలబడి ఒక్కొక్క పేజీ తిరగేసాను.
6 వ పేజీలో ఒక కవరు – ఆ కవరులో చెక్ కనపడ్డాయి. వెంటనే ఈయనకి ఫోన్ చేశాను. నిజంగానే కనపడిందా అన్నారు అపనమ్మకంగా. ఆ కనపడింది అన్నాను.
ఆనందంగా ఆ చెక్ నెంబర్ చెప్పు అన్నారు. అనుమానంగా చెప్పాను. దాని మీద అమౌంట్ అన్నారు అదీ చెప్పాను. ఎవరి పేరు మీద ఆ చెక్ ఉందో కూడా చెప్పాను.
అయితే ఉండు వస్తున్నాను అంటూ 5 నిముషాలలో వచ్చి నా ముఖమయినా చూడకుండా ఆ చెక్ మాత్రమే ముఖ్యం కాబట్టి అదీ తీసుకొని వెళ్లిపోయారు.
ఇంత కష్టపడి నందుకు కనీసం థాంక్స్ కూడా చెప్పలేదే అనేది నా బాధ.
మొత్తానికి అంతమంది జీతాలతో పాటు నా జీవితాన్ని కూడా నిలిపిన సాయినాథుణ్ణి ఏమని పొగడాలి ? ఎంతని పొగడాలి ? కొన్ని రోజులకి నీరసం తగ్గి మాములు మనిషిని అయ్యాను.
The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni
Latest Miracles:
- విభూది మహిమ
- బాబా గుడిలో బాబాకి దండ వేయలేకపోయాననే బాధలో ఉన్న నాకు, తమ్ముడి ఇంటిలో అవకాశము ఇచ్చిన బాబా వారు.
- కోర్కెలు తీర్చుటలో లేదు నిదానము! కోర్కెలను తీర్చిదిద్దుటయే సాయి విధానము !!…Audio
- విభూదితోనే నాభార్య కష్టం దాటుకుంది.ఆ హనుమాన్ సాయిబాబా రూపములో వచ్చారు అని నాకు అనిపిస్తుంది.
- జీవితంలో నా భర్త నడవటం కష్టం అని చెప్పిన డాక్టర్ మాటలను, అసత్యం చేసి, త్వరలోనే మామూలు మనిషిని చేసిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments