కోర్కెలు తీర్చుటలో లేదు నిదానము! కోర్కెలను తీర్చిదిద్దుటయే సాయి విధానము !!…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై!!

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-110-కోర్కెలు తీర్చుటలో లేదు నిదానము 5:19

గురుబంధువులతో నాకు బాబా అందించిన ఒక అనుభవాన్ని పంచుకోంటున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. నా పేరు ప్రకాష్.

నేను నెల్లూరులో వుంటాను. నేను 1999 – 2000 సంవత్సరం నుండి నెల్లూరులోని జేమ్స్ గార్డన్ లో గల సాయిబాబా మందిరానికి వెళ్తున్నాను.

అప్పటి నుండి నాకు బాబా, గురువు గారు ఎన్నో అనుభవాలిచ్చారు. వాటిలో ఇదొకటి.

నేను 2002 సంవత్సరములో శిరిడిలో జరిగిన అనుభవమును గురుంచి వివరిస్తున్నాను.

నేను శిరిడిలో ఎన్నిరోజులు అవాకాశముంటే అన్నిరోజులు ఉండి బాబా గురుదేవుల సేవ చేసుకుంటూ వుండేవాడ్ని.

ఒకరోజు  మధ్యాహ్నం ఈరోజు నేను నెల్లూరు వెళ్ళాలి అని అనుకున్నాను. వ్యాను మాట్లాడుకున్నాము.

సాయంత్రం 4-30 – 5-00 గంటల ప్రాంతంలో బయలుదేరాము.వెళ్ళేటప్పుడు చివరిసారిగా మందిరానికి వెళ్ళి ఒక్కసారి బాబాకు చెప్పి, బాబా దీవెనలు తీసుకోవాలని అనుకున్నాను.

కాని టైము లేదు.వ్యాను డ్రైవర్ అప్పటికే చాలా సేపట్నుంఛి మా కోసం ఎదురుచూస్తునాడు.

నా కేమో బాబాకు చెప్పకుండా వెళ్ళడానికి మనస్కరించలేదు. ఎలాగైన బాబా సమాధి మందిరానికి వెళ్ళాలి అని అనుకున్నాను.

కాని వ్యాను ఆతను తొందర చేసేసరికి ” బాబా! ఇక నీదే భారం ! నాకు మాత్రం బయలుదేరేటప్పుడు నిన్ను చుసుకోవాలనిపిస్తున్నది. నువ్వే నన్ను నీ దగ్గరకు ఎలాగైనా రప్పించుకో అని బాబాతో మొరపెట్టుకున్నాను.

13 మందితో జీపు బయలుదేరింది. సాయిపధం ఆశ్రమం వద్ద నుండి బయలుదేరి ‘పుష్పాంజలి’ హోటల్ దాటిన తరువాత బాబాకు నమస్కారం చేసుకోకుండా వెళ్తునానని విపరీతమైన ఆవేదన కలిగింది.

ఆ రోజుల్లో సమాధి మందిరం లోపలికి వెళ్ళడానికి నాలుగు గేట్లు వుండేవి.

వ్యాను ప్రస్తుతం బాబా అన్నప్రసాద వినియగము చేసే ‘ప్రసాదాలయము’ నకు ఎదురుగ వున్నమెయిన్ రోడ్ లోకి వచ్చింది.

కరెక్టుగా మెయిన్ రోడ్ లోని ద్వారము వద్దకు వ్యాను వచ్చే సరికి ” ఆ వ్యానులోని గురుబంధువు ఉమామహేశ్వరరావు వాళ్ళ తమ్ముడు నాగేంద్ర ఉన్నట్లుండి వ్యాను అపమన్నాడు.

నా సూట్ కేస్ తాళాలు మర్చిపోయాను. దాంట్లో డబ్బులు, టిక్కెట్స్ వున్నాయి అని చెప్పాడు.

వ్యాను డ్రైవర్ లేటవుతుందని కోపగించుకుంటుంటే నాకేమి తెలియదు, నీకు ఇష్టముంటే వుండు లేకపోతె నీ పాటికి నీవు పో” అని అతని లగేజీని వ్యానులోనే వదిలేసి పరుగెత్తుకుంటూ ఆశ్రమం వైపుకు వెళ్ళాడు.

అప్పుడు మా వ్యాను సరిగ్గా మెయిన్ ద్వారము వద్ద రోడ్డుకు కొంచెం ప్రక్కగా ఆగివుంది.

నాకిదే అవకాశం దొరికిందని, బాబా నా మొరవిన్నరనిపింఛి నేను గబగబా సమాధి మందిరానికి వెళ్ళి బాబాను మనసారా చూసుకొని, బాబా ఆశీర్వచనాలు తీసుకొని, ద్వారకామాయి,చావడి, లెండితోట నందదీపం చూసి వ్యాను వద్దకు వచ్చాను.విషయమేమిటంటే, ఈ అబ్బాయి తాళాలు కోసం కొంచెందూరం వెళ్ళగానే వాళ్ళన్నె దారిలో ఆ అబ్బాయికి ఎదురై తాళాలు ఇచ్చాడట వాళ్ళు వచ్చి చాలా సేపయిందట.

వాళ్ళంతా నా కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైతేనేం  ఈ మిషగా నాకు బాబావారి దర్శనం లభించింది అని సంతోషంగా అనుకొన్నాను.వ్యాన్ తిరిగి బయలుదేరింది.

కొంచెం దూరం వెళ్లేసరికి ఒక చెక్ పోస్ట్ వుంది. అక్కడ వెహికల్స్ ను ఆపి చెక్ చేస్తున్నారు.

మామూలుగా వ్యానులో 10 మంది మాత్రమె ఉండాలట. కాని మా వ్యానులో కేపాసిటికీ మించి 13 మంది వున్నారు.

అందులోనూ ఆ వ్యానుకి సంబంధిచిన కాగితాలు కూడా సరిగాలేవని వాళ్ళు పట్టుకుంటే రూ. 25,000/- ఫైన్ వేస్తారని అన్నాడు.

వ్యాను అతను కూడా చాలా టెన్షన్ పడ్డాడు.మాకేమో రైలుకు సమయం అయిపోతున్నది.

మేము బాబాను గురువుగారిని ఎలాగైనా ఈ గండం నుంచి కాపాడండి అని మనసులోనే ప్రార్దించుకొన్నాము.

ఎం కాదు ! నువ్వుపోని అని మేమంతా ధైర్యం చెప్పాము.

అతను చాలా ఫాస్టుగా 120 కి.మీ.వేగంతో మా వ్యాను చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ చెక్ చేసే వాళ్ళు టీ తాగడానికి అటుపైపు తిరిగి వున్నారు.

మమల్ని ఎవరు ఆపలేదు.వ్యాను క్షేమంగా చెక్ ;పోస్ట్ దాటి కరెక్టుగా మమ్మల్ని స్టేషనుకు తీసుకెళ్ళింది.

కరెక్ట్ గా మేము స్టేషన్ లోపలికి వెళుతున్నాము రైలు కూడా అప్పుడే వచ్చింది.

ఇదంతా కేవలం బాబా, గురువుగారి కృపకాక మరేమిటి?

ఇంతటి మహత్తరమైన అనుభవాన్ని బాబా,గురువుగారు నాకు ప్రసాదించినందుకు మరొక్కసారి సాష్టాంగ నమస్కారములు తెలియజేసుకొంటూ.

మీ గురుబంధువు
ప్రకాష్, నెల్లూరు.

సంపాదకీయం: సద్గురులీల (ఆగస్టు  – 2008)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles