Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా కల్పతరువు, కామధేనువు. కోరిన వరముల నిచ్చెడి వేల్పు. కాని ఒకొక్కసారి కోరికలను తీర్చనే తీర్చడు.
సాయిబాబా అంకిత భక్తుడు కాకా సాహెబ్ దీక్షిత్ షిరిడీలో ఉన్నాడు. అప్పుడు ఎండలు మండిపోతున్నాయి.
ఒక బాలుడు వడదెబ్బ తగిలి మృతి చెందాడు.
ఆ బాలుని బాబా బ్రతికించాడు.
మరి కొంత కాలానికి ఒక పిల్లవాడు సర్పదష్టుడైనాడు.
ఆ బిడ్డని బ్రతికించమని అతని తల్లి పరిపరి విధముల సాయిని ప్రార్ధించింది.
సాయి అంగీకరించలేదు. కొంచెం ఊది ఇవ్వానికి కూడ సాయి సమ్మతించలేదు.
చివరకు ఆ బాలుడు మరణించాడు. ఆ తల్లి హతాశురాలయినది.
ఇదంతయూ చూచుచున్న కాకా సాహెబ్ దీక్షిత్ ”బాబా! ఆ తల్లి విలాపము హృదయ విదారకముగా నున్నది.
నన్ను చూచియైునను, నా కొరకైనను ఆ మృతుడైన బిడ్డను బ్రతికింపుము” అనగా కూడ సాయి అంగీకరించలేదు.
అందుకు కారణం చెప్పాడు ”భావ్! ఏమి జరిగినదో అది అతని మంచి కొరకే.
అతడిని నీవు చూచు తనువున చేయలేని గొప్ప పనులు నూతన తనువున చేయగలడు.
ఇప్పుడు అతడు నూతన తనువు నందున్నాడు. నే నిపుడు తనువునకు లాగిన ఎడల ఆ తనువు మృతి నొందును.
ఈ తనువు జీవించును. నీ కొరకా పని చేయను. కాని పర్యవసాన మాలోచించుము. దాని బాధ్యతను నీవు వహింప సిద్ధ పడుదువా?”
ఎన్.బి. మొహాలే అనే వ్యక్తి తన పుత్రికకు చీలిన పెదవి కలదని, దానిని డక్టర్లు బాగు చేయలేక పోయినారని ఆమెను సాయి వద్దకు 1913లో తీసుకు వచ్చాడు.
సాయి అతనిని చూచి ”నీవు ఎందుకు వచ్చావో నాకు తెలుసు.
నేను ఈ బిడ్డను చక్క పరచగలను.
కాని ఆమె రాబోవు మాఘ శుద్ధ చతుర్దశినాడు తనువు చాలించును.
నీవు ఆ రోజున ఇంట్లో ఉండకుండా పనికి వెళితే నీవు తిరిగి వచ్చి ఆమెను సజీవంగా చూడలేవు” అన్నాడు.
సాయి మాటలను అతడు విశ్వసించలేదు. 1914 మాఘ శుద్ధ చతుర్దశి ఫిబ్రవరి 9 వచ్చింది. మొహాలే ఆఫీసుకు వెళ్ళి తిరిగి వచ్చే సరికి బిడ్డ మృతురాలైంది.
సాయివద్దకు వెళ్ళి నప్పుడు ఆయన సూచించిన దానిని అనుసరించ వలెను.
సాయి ఏ కోరిక తీర్చకున్నను, ఆయన చెప్పినట్లు చేయుటే మంచిది – ఎందుకంటే సాయికి ముందు చూపున్నది,
కల్పవృక్షము, కామధేనువులు కోర్కెలు తీరుస్తాయి.
కాని సాయి కల్పవృక్షము, కామధేనువు ఎల్లప్పుడు మనకు శ్రేయస్సు చేకూర్చుతాడు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- వివేక వైరాగ్యాలు ….సాయి@366 డిసెంబర్ 9….Audio
- నిదర్శనం కోసం దర్శనం…. సాయి@366 ఫిబ్రవరి 15….Audio
- తప్పు ! ….. సాయి@366 ఫిబ్రవరి 22….Audio
- కోర్కెలు తీర్చుటలో లేదు నిదానము! కోర్కెలను తీర్చిదిద్దుటయే సాయి విధానము !!…Audio
- షిరిడీలో నివాసం …..సాయి@366 జనవరి 23….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments