పండగే పండగ ….. సాయి @366 ఫిబ్రవరి 8….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబాను దర్శించటమే అదృష్టం. అటువంటి సాయిబాబా ఎవరింటికైనా వెళ్ళటం జరిగితే వారి ఆనందం పట్టలేనిది.

సాయిబాబా మీ ఇంటికి వస్తాను అని వ్రాయిస్తాడు బి.వి. దేవ్‌కు. దేవ్‌ ఎంతో పొంగిపోయాడు.

తీరాచూస్తే ఆయన నిజరూపంలో రాలేదు. అలాగే ఉంటాయి సాయి పలుకులు.

మరోసారి సాయిబాబా ఇలాగే హేమాడ్‌ పంత్‌కు స్వప్నంలో చెప్పాడు ”మీ ఇంటికి భోజనానికి వస్తా”నని. సాయి తత్వాన్ని తెలిసిన హేమాడ్‌పంత్‌ అర్థం చేసుకున్నాడు.

సాయినాథుడు నిజ రూపంలో రాడని, ఏదో రూపంలో వస్తాడని. అలాగే సాయినాథుడు ‘ఫొటో’ రూపంలో వచ్చాడు.

ఆనాటి సాయి రాకకు గుర్తింపుగా నేటికిని హేమాడ్‌ పంత్‌ గృహంలో పండుగ జరుపుతారు.

కాకా సాహెబ్‌ దీక్షిత్‌ ముంబాయిలో ఉంటాడు.

ఇంకా బాలక్‌రాం, ముక్తారాంలు షిరిడీలోనే ఉంటున్నారు.

సదాశివ డూంఢురాజ్‌ హార్దాలో ఉండే బాబా భక్తుడు.

కాకా సాహెబ్‌ దీక్షిత్‌ హార్దాలో ఉండే సదాశివకు బాలక్‌రాం, ముక్తారాంలు ఫిబ్రవరి 8,1915న సాయి చిత్రపటాన్ని తెచ్చి ఇస్తారని ఉత్తరం వ్రాశాడు.

ఫిబ్రవరి 8న ఆ ఉత్తరం చేరింది. ఆ రోజు సోమవారమే కాకుండ దాసనవమి కూడ.

ఆ సాయంకాలం సదాశివ రైల్వే స్టేషన్‌కు వెళ్ళాడు.

రైలులో బాలక్‌రాం, ముక్తారాంలు సాయి చిత్రపాన్ని పెట్టుకుని కూర్చోవటం చూసాడు.

వెంటనే పెట్టెలోకి వెళ్ళి భక్తి, శ్రద్ధలతో బాబా చరణాలపై శిరస్సు నుంచి నమస్కరించాడు.

సాయి నిజరూపంలో వచ్చినా చేసేది అంతే గదా!

ఆ తరువాతనే బాలక్‌రాం, ముక్తారాంలకు నమస్కరించాడు.

ఆ సాయి చిత్రాన్ని తీసుకుని ప్లాట్ ఫాం పైకి రాగానే ఆ చిత్రాన్ని చూడటానికి చాలా రద్దీ అయింది.

తరువాత ఆ ఫొటోను సదాశివ గృహానికి టాంగాలో తెచ్చారు.

ఆ రోజు దాసనవమి. అందువలన ఆ రోజు విశేషంగా సాయి రాకతో పండుగ వాతావరణం ఆ ఇంట్లో  అనటం కంటే ఆ గ్రామంలో ఏర్పడింది.

ఒక పెద్ద ఆసనంపై శాలువాను పరచి దానిపై సాయినాథుని ఆశీనుడిని చేశారు.

సాయిబాబా చరణ పాదుకలకు అభిషేకం చేశారు.

సాయి పూజ, ఆరతులు, మంత్ర పుష్పములతో జయ జయ నినాదములతో ఆ ఊరు ఊరంతా మారుమోగింది.

అందరూ బాబా ప్రసాదాలను స్వీకరించి సంతుష్టులయ్యారు.

సాయి తన ఆశీస్సులను ఫొటో రూపంలోంచే అందరికి అందించారు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr:Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles