Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా ఫొటోకు సమస్కరిస్తే సాక్షాత్తు సాయిబాబాకు నమస్కరించి నట్లే అని బాలాబువకు తెలిపారు.
ఇటువంటివే అనేక నిదర్శనాలు ఉన్నాయి.
అనుభవం పొందటంవేరు, అనుభవం విని తిరిగి వ్రాయటం వేరు కాదు సాయి విషయంలో. ప్రతి విషయము యదార్ధమే.
8.2.1915 సోమ వారం నాడు సాయి బాబా చిత్రపటాన్ని హార్దాకు బాలక్‌రాం, ముక్తారాంలు తెచ్చారు.
సాయి భక్తుడు కృష్ణారావ్ నారాయణరావ్ పరూల్కర్ హార్దా నివాసియే. హార్దాకు వచ్చినది సాయి ఫొటో కాదు సాయియే అని దృఢంగా విశ్వసించిన వాడు.
ఆ విషయాన్ని అందరికీ తెలియ చెప్పాలను కున్నాడు.
8వ తేదీన తన పినసోదరుడైన నారాయణ దాదాకు ఇంకా తన భార్యకు ఉత్తరాలు వ్రాశాడు – వారి అనుభవాలు తెల్పమని. వారిద్దరు వెంటనే స్పందించారు.
మొదటగా నారాయణ దాదా అనుభవం.
ఈయనకు స్వప్నం వచ్చింది.
అది ద్వారకామాయి. సాయిబాబా, నారాయణరావు పరూల్కర్‌లు ఉన్నారక్కడ.
”నేను హార్దా వెళుతున్నాను. నాతో కూడ పద” అన్నారు సాయి నారాయణ రావు పరూల్కరతో.
ఇద్దరూ బయలు దేరారు కోపర్గాంలోని గోదావరి తీరానికి వచ్చారు.
ఇద్దరూ ఒడ్డున ఉన్నారు. గోదావరి నీటి మట్టం ఎక్కువగా ఉన్నది. ”ఇప్పుడు ఎలా నదిని దాటాలి” అన్నారు సాయి.
అంతలోనే పది ఎద్దులు వీపుపై సామానుతో నిలబడ్డాయి.
ముందర నీరంతా తొలగిపోయి దారి ఏర్పడ్డది.
హార్దాలో సాయిబాబా ఫొటోను ప్రతిష్టించిన ప్రదేశం వరకు ఎద్దులతో సహా వెళ్ళి సాయి అదృశ్యమయ్యారు.
రెండవది నారాయణరావు పరూల్కర్ భార్య అనుభవం:
ఆమెకు కూడ స్వప్నం వచ్చింది.
ఆ స్వప్నంలో మాధవరావ్ దేశపాండే (శ్యామా) చేతిలో ఒక పళ్లెంతో కన్పించాడు.
ఆ పళ్లెంలో టెంకాయ, కుంకుమ మొదలైన పూజా ద్రవ్యములు ఉన్నాయి.
మాధవరావ్ దేశపాండే ఆ పళ్లేన్ని ఆమెకు ఇస్తూ ”సాయి బాబా నీ కోసం సారె పంపారు” అన్నాడు.
సాయిబాబా వచ్చాడు, ప్రసాదం వచ్చింది. హార్దా పట్టణ ప్రజలు అదృష్టవంతులు.
సాయియే స్వయంగా వచ్చినట్లు తెల్పిన సంఘటనలను వివరిస్తూ ఫిబ్రవరి 17న ఉత్తరం వ్రాశారు కృష్ణారావ్ పరూల్కర్.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- ఎన్నేళ్ళనేది కాదు…అర్హతే కొలమానం ….. సాయి@366 ఫిబ్రవరి 25….Audio
- ఉన్నది చాలును!…..సాయి@366 మే 17….Audio
- దర్శనం – నిదర్శనం …..సాయి@366 మార్చి 24…..Audio
- కాదు సుమా! కల కాదు సుమా!! …..సాయి@366 జనవరి 10…Audio
- సాయి మహమ్మదీయుడా? ……సాయి @366 ఫిబ్రవరి 6….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments