Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
ఆయన పుట్టినది గురువారం. తనువును వీడినది గురువారము 25 ఫిబ్రవరి 1971.
సాయిబాబాతో కేవలం 8 లేక 9 ఏండ్ల నుండి మాత్రమే అనుభవాలు మొదలయ్యాయి.
ఆయన జీవించినది 83 ఏండ్లు. అయినా ఆయన సాయికి అంకిత భక్తుడు అయ్యాడు.
షిరిడీలోని వ్యక్తులకు సాయిబాబా ఎన్నో, ఎన్నెన్నో సంవత్సరముల నుండి తెలిసినా ప్రయోజనం శూన్యం.
8, 9 ఏండ్లలోనే సాయిని ఆకట్టుకున్న వ్యక్తులను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చును.
అట్టి వారిలో ఒకడు మేఘశ్యామ భగవంత్‌రావ్ రేగే. శ్రీ బి.వి. నరసింహస్వామి గారి ”డివోటీస్ ఎక్స్‌పీరియన్సెస్” లో ఈయనదే అగ్రస్థానం.
రేగే గారి జీవితంలో సాయి ప్రవేశించినది మొదలు, సాయితో సంబంధం ఉన్న ప్రతి సంఘటన ఆదర్శమైన ఘట్టమే అవుతుంది.
ఈయన సుతి మెత్తని జీవిత సంఘటన ద్వారా, సాయి మహత్తును, భక్త సంరక్షణను, బోధనా పద్ధతిని, ఇంకా అనేక అంశాలను గ్రహించ వీలవుతుంది. ఆచరించదగ్గ విషయాలు అవి,
కేవలం చదవటం మాత్రమే, వినటం మాత్రమే చేయ వీలులేనివి.
సాయితో సాన్నిహిత్యం ఏర్పరచుకోదగిన విషయాలన్నీ ఆయన జీవితం చాటి చెబుతుంది.
సాయి మహత్తు మహాసమాధితో పూర్తి కాలేదని, మహా సమాధి అనంతరం ఇంకా చురుకుగా ఆయన పరిమితులు లేని అనంతత్వం మానుష రూపంలో లీలా మాత్రంగా ఇమిడి పోయి, కనుల ముందు కదలాడుతున్నట్లు అనిపించేది.
అయితే రేగే వలె సాయితో సాన్నిహిత్యం పొందుదాం. ”నాకు అవసరమైనప్పుడల్లా, సాయిబాబా దర్శన మిచ్చి తగిన ధైర్యాన్నిస్తుంటారు ” అన్నాడు రేగే.
ఆయన ఇచ్చే ఏకైక సందేశం – ఆయన అనుభవంలోనిదే – అది ఏమిటంటే….
”సాయిబాబాను గాఢంగా, హృదయపూర్వకంగా ప్రేమించండి. అందుకు షిరిడీ వెళ్లాల్సిన పని లేదు. కానీ, షిరిడీ దర్శనం నిస్సందేహంగా సహాయపడుతుంది
సర్వేంద్రియాలను కేంద్రీకరించి ప్రేమతో వారిని ధ్యానిస్తే చాలు. ఎవరి అర్హతలకు తగ్గట్టుగా వారు సాయిబాబా నుండి తప్పక సహాయాన్ని పొందుతారు”.
తన 8 లేక 9 ఏండ్ల అనుభవంతో రేగే పలికిన మాటలు అవి.
నేు ఫిబ్రవరి 25. నేటి నుండి రేగే పలుకులను అనుభవంలోనికి తెచ్చుకుందాం! సాయి సాన్నిహిత్యాన్ని పొందుదాం!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- రాత్రి నిద్రించని సాయి…..సాయి@366 డిసెంబర్ 21….Audio
- సిద్దావతారుడు…..సాయి@366 అక్టోబర్ 9….Audio
- నేనందంగా లేనా? …..సాయి@366 మార్చి 25….Audio
- సాయిబాబానా? రామకృష్ణుడా? …..సాయి@366 జూన్ 11….Audio
- హనుమంతుని ముందరా?…..సాయి@366 సెప్టెంబర్ 26….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments