Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
యశ్వంతరావు జనార్ధన్ గాల్వంకర్ సాయి తత్వాన్ని గ్రహించిన కొద్దిమందిలో ఒకరు. ఈయన అక్టోబరు 9, 1943న ప్రథాన్ గారి రచనకు తొలిపలుకు వ్రాస్తూ అనేక విషయాలను తెలిపారు.
సాయి బాబా సిద్ధ శక్తులను గూర్చి వ్రాస్తూ, అవి జ్ఞానదేవుని సిద్దులవంటివి అని చాంగ్ దేవ్ చూపిన సిద్దులవంటివి కావు అన్నారు.
సాయినాథుడు గాని, జ్ఞానేశ్వరుడు గాని చూపిన మహిమ తమ శక్తిని గూర్చి తెలుపుటకు కావు. ఇవి ఇతరులలోని అజ్ఞానమును, అహంకారమును తొలగించుటకు మాత్రమే అని గ్రహించవచ్చును.
షిరిడీలో సాయి నీటితో దీపాలను నూనె లేకుండా వెలిగించటము తన గొప్పతనాన్ని చాటుకొనుటకు కాదు, అసత్యము పలుక వలదని, అసత్యము పలుకువారలు దైవమునకు దూరమగుదురని చెప్పుటకు మాత్రమే.
బాబా భక్తుడు రేగే. సాయి యందు నమ్మకముగల వ్యక్తి. ఒకసారి రేగే బాబాకోసం చక్కని నిమ్మకాయ షర్బతు తయారు చేసి సాయికి సమర్పించాడు. సాయి స్వీకరించాడు.
అక్కడే ఉన్న కాకా సాహెబ్ దీక్షిత్‌తో ”అరే కాకా! ఇది ఎంత పుల్లగా ఉందో చూడు” అన్నాడు. కాకా ఆ షర్బతును రుచి చూసి ”అవును పుల్లగా ఉంది” అన్నాడు.
రేగే షర్బతును రుచి చూసి తెల్లబోయాడు. సాయి కోసం ప్రత్యేకంగా పులుపు తగులకుండా చేసిన షర్బతు ఇంత పుల్లగా ఉన్నదేమి? అని ఆశ్చర్యపోయాడు.
సాయి చిరునవ్వు నవ్వి ”నేను హాస్యానికి అలా అన్నాను. ఇప్పుడు మీరిద్దరూ త్రాగి చూడండి” అన్నారు. ఇద్దరూ మరల రుచి చూచారు.తమ కండ్లనే కాదు నాలుకనే నమ్మలేక పోయారు.
షర్బతు తియ్యగా ఉన్నది. ఇది సాయి చేసిన చమత్కారం. షర్బతు తయారు చేయటంలో తన నేర్పరితనానికి పొంగిపోయాడు రేగే.
అది ముందు ముందు అహంకారానికి దారి తీస్తుందని సాయి గ్రహించాడు. అందుకే షర్బతును పుల్లగా, ఇంకా తియ్యగ మార్చి చూపారు.
ఈ విషయాన్ని రేగే గ్రహించాడు. సాయి ఈ మహత్తు ద్వారా రేగేలో అహంకారం రాకుండా చేశారు.
అలాగే కామరూప సిద్ధిని బీ.వి. దేవు విషయంలో దాహనులో చూపాడు. మనోజవ సిద్ధి ద్వారా బాంద్రాలో తర్కడ్ గృహములో తనకు నైవేద్యమును పెట్టలేదని, పూజ విషయములో పరాకు తగదని తర్కడ్ కుటుంబానికి సాయి తెలిపాడు.
లోక కల్యాణార్థము జన్మను స్వీకరించిన జ్ఞానేశ్వరుడు, సాయిబాబా తమ శక్తులను ప్రజల కోసమే ధారపోసినారు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- రాత్రి నిద్రించని సాయి…..సాయి@366 డిసెంబర్ 21….Audio
- ఎన్నేళ్ళనేది కాదు…అర్హతే కొలమానం ….. సాయి@366 ఫిబ్రవరి 25….Audio
- నేనందంగా లేనా? …..సాయి@366 మార్చి 25….Audio
- భూదేవికున్నంత ఓర్పు…..సాయి@366 జూలై 8…Audio
- అపర భగీరధుడు …..సాయి@366 అక్టోబర్ 18….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments