రాత్రి నిద్రించని సాయి…..సాయి@366 డిసెంబర్ 21….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


అవి 1914 క్రిస్మస్ సెలవు దినాలు. ఆ సెలవల్లో సాయిని దర్శిద్దా మనుకున్నారు రేగే, పురుషోత్తమ అవస్తెలు. వారిద్దరూ న్యాయాధికారులుగా పని చేస్తున్నారు.

వారు బయలుదేరుదాము అనుకున్నప్పుడు పై అధికారుల నుండి అవస్తేకు విచారణలు పూర్తి అయిన దావా కేసులన్నిటికి తీర్పులు పూర్తి చేయాలనీ అంతవరకు ఊరు విడచి వెళ్ళరాదని ఉత్తర్వులు వచ్చాయి.

అవస్తేకు 2 ,3  రోజులలో తీర్పులన్నియు పూర్తి చేయుట అసాధ్యము. ఆ సాయి భక్తులిద్దరూ నిరుత్సాహపడ్డారు. ఇదేమిటి ఇలా జరిగిందని.

అతంటి అసాధ్యమైన పనిని కూడా అవస్తే పూర్తి చేయగలిగాడు సెలవులు ప్రారంభం కాకముందే, సాయి కృప వలన. వారిద్దరూ అనుకున్న ప్రకారం షిరిడీకి బయలుదేరారు.

వారిద్దరూ ఇండోర్ నుండి బయలు దేరారు. మార్గమధ్యలో  ‘మోవ్’ అనే స్టేషను వచ్చింది. అది సైనికుల స్టేషన్.

సైనికాధికారి ఆ రైలులో ఉన్న ప్రయాణీకులందరూ దిగవలసినదని ఉత్తర్వులు జారీ చేశాడు. ఆ సైనికాధికారి మాటను ఎవరు కాదనగలరు?

అందరూ దిగుతున్నారు. ఇక్కడ దిగినచో మరల ఎప్పుడు రైలు దొరకును? రేగే, పురుషోత్తమ అవస్తెలు ‘ఇదేమిటి బాబా’ అనుకుని వారు కూడా అందరి ప్రయాణికులు వలె పెట్టేదిగబోతున్నారు.

అదే సమయానికి సైనికాధికారి అక్కడకు వచ్చి “మీరు దిగనవసరము లేదు. పెట్టెలో కూర్చోండి “ అని చెప్పాడు.

రేగే, అవస్తెలు సంతోషంగా పెట్టెలోకి ఎక్కి షిరిడీ యాత్ర చేశారు. రేగే ఆ రాత్రంతా సాయి భజన చేసాడు. అది కృతజ్ఞతకు చిహ్నం.

వారు సాయిబాబా వద్దకు వచ్చి నమస్కరించారు. సాయిబాబా “నా బిడ్డలను వారు రైలు నుండి దింపదలచారు. వారిని (నా బిడ్డలను) నా దగ్గరకు రానీయమని సైనికాధికారితో చెప్పితిని.

ఈతడు(రేగే) నన్ను రాత్రంతయు నిద్రపోనీయ లేదు. నా శయ్య చుట్టూ తిరుగుతూ ‘బాబా, బాబా’ అను కేకలే” అన్నాడు సాయి.

సాయి షిరిడీ నుండి కదలలేదు. సైనికాధికారి మనసు మార్చాడు.

సాయి భక్తులు ఎవరైనా, ఎక్కడైనా కష్టాలలో ఉంటె వారు ప్రార్ధించక పోయినా సాయి వారి కష్టాలను కడతేరుస్తాడు. ఇక తన చెంతకు చేరే భక్తుల విషయం వేరే చెప్పాలా!

ఎవరు ఎక్కడ నుంచైనా సాయి నామం పలికితే అది సాయి చెవికి చేరుతుంది.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles