సాయిబాబానా? రామకృష్ణుడా? …..సాయి@366 జూన్ 11….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబా మహా సమాధి చెందక పూర్వము తనకును, నాందేడ్ మౌలానాకును అభేదమని నాందేడ్ కు చెందిన రతంజీ షాపూర్‌జీ వాడియాకు నిదర్శన పూర్వకముగా తెలిపారు.

సాయిమహా సమాధి చెందారు. అయితే సాయికి ఇతర సత్పురుషులకును అభేదము అట్లే యుండునా? భిన్నముగా ఉండునా? అను ప్రశ్న ఉదయించును.

దీనిని తనకు జరిగిన అనుభవ పూర్వకముగా రేగే జూన్‌ 11, 1936న వెల్లడించాడు. ఈ సంఘటన 1928వ సంవత్సరములో రేగేకు జరిగినది.

రేగే తీర్థ యాత్రలు చేయుచూ దక్షిణేశ్వరమునకు వెళ్ళాడు. అది రామకృష్ణ ధ్యాన భూమి.

ఆయన పరమహంసగా రూపొందిన స్థలము. రేగేకు అక్కడున్న ‘రాంలాలా’ విగ్రహాన్ని చూద్దామని కోరిక మిక్కుటముగా నున్నది.

రాంలాలా లేదా బాల రామచంద్రుడు అనేది ముద్దులొలుకు నొక చిన్న లోహ విగ్రహము. జటాధారి అనువారు రాంలాలాను పసిబిడ్డ వలె సాకుతూ రామ దర్శనాన్ని పొందిన భాగ్యశాలి.

ఆ జటాధారి ఆ ‘రాంలాలా’ ను రామకృష్ణులకు అప్పగించారు. ఇక రామకృష్ణులకు ‘రాంలాలా’ తోటే లోకము, ఉపాసనా దైవమును.

ఒక రోజు ‘రాంలాలా’ ఏదో తినాలని మొండికేశాడు. రామకృష్ణులు పొట్టు తీయని అటుకులను ఇచ్చాడు. ఆ అటుకులు తినిన ‘రాంలాలా’ నాలుక గీరుకు పోయింది.

అది చూచి రామకృష్ణులు పడిన బాధ వర్ణనాతీతం. ”అయో! తల్లి కౌసల్య వెన్న, మీగడలను పెట్టే నీ నోటిలోనికి మోటు పదార్ధాన్ని పెట్టాను గదా! తండ్రీ!” అని రామకృష్ణులు విల విలలాడి పోయాడు.

రాంలాలా ఒక చిన్న లోహ విగ్రహమా? చూచు వారలకదియే. కాని సజీవ చిన్ని రాముడే రామకృష్ణులకు.

అట్టి రాంలాలాను తనివితీరా చూద్దామని రేగే కోరిక. రాంలాలా విగ్రహమును చూపమని గైడును కోరగా ఒక పెద్ద విగ్రహమును చూపి అదే రాంలాలా అని వాదించెను.

రేగే మనస్సు బాధ పడెను. అంతలోకి ఒక పూజారి వచ్చి ”దక్కను ప్రాంతము నుండి వచ్చినది ఎవరు?” అని అడిగి రేగేకు రాంలాలాను చూపెను.

తనకు అంతకు ముందు రాత్రి స్వప్నములో దక్కను ప్రాంతము నుండి వచ్చినతనికి అన్నీ దగ్గర ఉండి చూపమని ఆదేశము వచ్చినదని తెలిపి రేగేకు అన్నీ దగ్గర ఉండి చూపించెను.

స్వప్నములో ఆదేశించినది రామకృష్ణ పరమహంసా? కావచ్చును. సాయిబాబానా? కావచ్చును. ఎవరైనను ఒకటియే గదా!

భక్తుని కోరిక తీర్చుట మహనీయులకు సంతసము గదా!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles