Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ముంగండ అగ్రహారంలో జన్మించిన ఓరుగంటి లక్ష్మీ నరసింహమూర్తి నృసింహ యోగీంద్రులయ్యారు.
రాంలాలా మహాప్రభువుల అపార కృపకు పాత్రులైనారు. ఒకసారి రాంలాలా ప్రభువులు శిష్యులతో గంగానది ఒడ్డున విహరిస్తున్నారు.
రాంలాలా చేతి కర్ర గంగా నదిలో పడింది. “అరే! చేతి కర్ర గంగా నదిలో పడిపోయింది” అన్నారు సద్గురువు.
శిష్యులు అటు ఇటు పరుగెత్తుతున్నారు. కానీ నర్సింగ్ (నృసింహ యోగీంద్రులు) గంగలో దూకి కర్ర కోసం ఈద నారభించారు. కర్ర అందినట్లే అంది దూరమయ్యేది.
ఇలా ఒక మైలు దూరం గంగలో ఈదాడు ఆ కుర్రవాడు కర్ర కోసం. చివరకు చేతికి అందిన కర్రను గురువుకు సమర్పించాడు.
ప్రభువులు (రాంలాలా) “నాయనా! కర్ర కావాలంటే ఇంకొకటి వస్తుంది. కానీ నీకేమైనా జరిగితే నిన్ను సంపాదించగలనా?” అన్నారు.
“కృష్ణుడికి మురళి ఎటువంటిదో ప్రభువుల చేతి కర్ర అటువంటిది. ఆ కర్రను ప్రాణాలైనా అర్పించి కాపాడవలసిన బాధ్యత మాది” అన్నారు. నర్సింగ్. ఈ సంఘటన గురు భక్తికి సంకేతం.
నర్సింగ్ కు ప్రభువుల కృపతో అనేకానేక యోగ భూమికలు అనాయాసంగా లభించాయి. “పతంజలి యోగ సూత్రాలలో చెప్పబడిన అన్ని భూమికలను పొందాను” అనేవారు నర్సింగ్ సవినయంగా.
గురువు ఆదేశంతో తిరిగి తండ్రితోపాటుగా ఆంధ్రదేశానికి వచ్చి, యోగ, ధ్యాన మార్గానికే అంకితమయ్యారు. వివాహం చేసుకున్నారు.
ఆంధ్రదేశంలో రాంలాలా ప్రభువు యశస్సు వ్యాపింపసాగింది నర్సింగ్ వలన.
నృసింహ యోగీంద్రులకు అనేకులు శిష్యులుగా ఉన్నారు. రాంలాలా ప్రభువులకు ఉన్నట్లు, ఈయనకు కూడా శిష్యులపై గాఢమైన వాత్సల్యం ఉండేది.
కుటుంబ కారణాలవల్ల విషాన్ని త్రాగారు కొండలరావుగారు. ఈయన నృసింహ యోగీంద్రుల శిష్యుడు.
నృసింహ యోగీంద్రులు వెంటనే కొండలరావుచే అనేక యోగక్రియలు చేయించి, ప్రాణాన్ని కాపాడారు. కొండలరావు అంకిత భక్తుడయ్యాడు.
ఎంత అంకిత భక్తుడయ్యాడంటే, రాముల వారికి హనుమంతుడైనట్లు. ప్రతి పనిని కొండలరావే చేసేవారు.
ఒకసారి నృసింహ యోగీంద్రులు స్నానం చేస్తూ తువ్వాలు కోసం కేకవేశారు. నృసింహ యోగీంద్రుల భార్య లక్ష్మీ దేవి తువ్వాలు తెచ్చేలోగా కొండలరావే ఇవ్వబోయాడు.
“వీడు (కొండలరావు) ఏమిటి మధ్యలో ప్రతిదానికి పరుగు పరుగున దూసుకు వస్తాడు. వీడి కాలు విరగా” అనుకుంది.
ఒక్క క్షణం కొండలరావు కాలు స్వాధీనం తప్పి మరు క్షణంలోనే బాగైంది.
అక్కడ స్నానాల గదిలో నృసింహ యోగీంద్రుల కాలు విరిగింది. ఆ కాలి బాధను నృసింహ యోగీంద్రులు స్వీకరించారు అవలీలగా.
నృసింహ యోగీంద్రుల యోగ శాస్త్ర ప్రావీణ్యానికి ఆంధ్రా యూనివర్సిటి ‘కళా ప్రపూర్ణ’ బిరుదుని 1975లో ఇచ్చింది.
నృసింహ యోగీంద్రులు 1978 జూన్ 16న భౌతిక దేహాన్ని విడిచారు.
నేడు జూన్ 16. నృసింహ యోగీంద్రుల వర్థంతి. ఆయనను స్మరింతుము గాక.
గురు కటాక్షమును పొందుదుము గాక!!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- (అ) ద్వితీయుడు…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 16
- సాయిబాబానా? రామకృష్ణుడా? …..సాయి@366 జూన్ 11….Audio
- మనసులోని కోరిక …. మహనీయులు – 2020… మార్చి 21
- మధ్యముడు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 22
- పాద స్పర్శ …. మహనీయులు – 2020… జూన్ 25
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments