Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
చంద్రమోహన్ మూడేండ్ల వయసున్నప్పుడు, బాలకృష్ణుని దర్శనం పొందటమే కాకుండా, ఆ బాలకృష్ణునితో ఆటలాడేవాడు.
ఒక్కొక్కసారి తనకు నెమలి పింఛం కావాలనేవాడు. ఆతని తల్లికి ఏమి అర్ధమయ్యేది కాదు.
చంద్రమోహన్ శ్రీరాంలాలా మహాప్రభు శిష్యుడయ్యాడు. ఎన్నో యోగ సాధనలు చేసేవాడు. గురు దక్షిణగా రాంలాలా ప్రభువుకు తనను అర్పించుకున్నాడు.
ఒకసారి అంతర్జాతీయ యోగ సభ (సమాఖ్య)ను నిర్వహిస్తున్నారు. “నేడు కూడా భారత దేశంలో నిజమైన యోగులున్నారా?” అని ప్రశ్నించారు.
చంద్రమోహన్ వెంటనే లేచి, ఆతని చేతిలో పుష్పమును ఉంచాడు. ఆ వ్యక్తి వెంటనే సమాధి స్థితిలోనికి వెళ్ళాడు.
అతనిని బాహ్య ప్రపంచంలోని మరల తేవటానికి ఎంతో ప్రయత్నం చేశారు. 6, 7 గంటలు గడిచాయి. ఇంకా సమాధి నుండి లేవనే లేదు.
ఆ సభవారు గురుదేవ చంద్రమోహన్ అతనిని సమాధి నుండి జాగృతం చేయమని కోరారు. గురుదేవ్ ‘లే’ అన్నారు. అంతే. ఆ విదేశీయుడు లేచాడు.
సాయిబాబా కూడా ఇటువంటి సమాధి స్థితిని కలిగించారు. – బాలా సాహెబ్ భాటేకు.
రామకృష్ణ పరమహంస కూడా మధురనాథ్ బిస్వాస్ విషయంలో చేశారు. గురుదేవ్ చంద్రమోహన్ ఎందరికో యోగసాధనలు నేర్పారు.
ఒకసారి చంద్రమోహన్ జీ శిష్యుడు నారాయణ కోట్ పర్, ఆయన శిష్యుడు ఏదో ఊరు వెళ్లవలసి వచ్చింది.
ఎండాకాలం, మధ్యాహ్న సమయం. వారికి వయసు కాస్త మళ్ళింది. నడవలేక పోతున్నారు. ఎదురుగా చంద్రమోహన్ సాక్షాత్కరించి “భయపడతారేం? వెళ్ళండి” అని అదృశ్యులయ్యారు.
వెంటనే ఆకాశంపై మేఘం వీరి నెత్తిపైకి వచ్చింది గొడుగులాగ. చుట్టూ చల్లని గాలి వీచింది. ఇటువంటి సంఘటన జిల్లేళ్ళమూడి అమ్మ జీవిత చరిత్రలో కూడా కానవస్తుంది.
ఈయన మానవులకే కాదు జంతువులకు ఆశీర్వాదం ఇచ్చేవారు. ‘వరసలో రండి’ అన్నాడా గురుదేవ్ కోతులను. అవి వరసలో వచ్చి, ఆయన చేతుల ద్వారా ప్రసాదాన్ని అందుకుపోయాయి.
ఈయన భౌతిక దేహాన్ని 25 జూన్ 1990న విడిచారు.
హరిద్వార్ లోని గంగానది ఒడ్డున ఈయన భౌతిక దేహానికి అంత్యక్రియలు చేయసంకల్పించారు ఆయన శిష్యులు.
గంగా నదికి 8 అడుగుల దూరంలో, 2 అడుగుల ఎత్తుగల వేదిక నిర్మించి, గురుదేవ్ చంద్రమోహన్ భౌతికకాయాన్ని ఉంచారు.
ఆ భౌతికకాయానికి స్నానం చేయించారు. గంగా నది జలాలు తీరం వెంబడి వచ్చి గురుదేవుల పాదాలను తాకి వెళ్ళిపోయాయి.
ఒకసారి కాదు, రెండుసార్లు ఆ గంగా జలాలు ఆయన పాదాలను స్పృశించాయి దహన సమయంలో ఆయన (గురుదేవులు) చేతిని పైకి ఎత్తి ఆశీర్వదించారు అందరిని.
నేడు జూన్ 25. చంద్రమోహన్ మహాసమాధి రోజు.
ఆ యోగ పురుషుని ఆశీస్సులు లభించుగాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- తస్మై గురవే నమః …. మహనీయులు – 2020… సెప్టెంబరు 26
- “నీ దయ గంగా గౌతమి రామయ్య”… …. మహనీయులు – 2020… జూన్ 6
- రెండు గుర్రాలపై స్వారీ …. మహనీయులు – 2020… జూన్ 4
- నిన్ను నిన్నుగా ప్రేమించుటకు ….. మహనీయులు – 2020…ఫిబ్రవరి 25
- పాద దర్శనం – పాప హరణం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments