తస్మై గురవే నమః …. మహనీయులు – 2020… సెప్టెంబరు 26



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా 72 గంటల సమాధిలోనికి వెళ్లాడు. అది అంతుచిక్కని రహస్యం.

కాశీలో నివసించిన యోగిరాజ శ్రీ శ్యామా, చరణలాహిరి బాబాజీగారి శిష్యులు.

క్రియా యోగాన్ని ఆయన వ్యాప్తి చేశారు. లాహిరి మహాశయుల గృహం దగ్గరగానే చంద్రమోహనుడనే యువకుడుండేవాడు.

డాక్టరీ ప్యాసై వచ్చి లాహిరి మహాశయులను దీవించ మన్నాడు. ఆధునిక వైద్య శాస్త్రంలో ఇష్టాగోష్టి జరుగుతోంది.

 వైద్య శాస్త్ర ప్రకారం చనిపోయిన వాడికి గుర్తు లేమిటని అడిగితే చంద్రమోహన్ చెప్పాడు.

“చంద్రమోహన్, నన్ను పరీక్ష చేసి, నేను బ్రతికున్నవాణ్ణో, చనిపోయిన వాణ్ణోచెప్పు” అన్నారు.

చంద్రమోహన్ క్షుణ్ణంగా పరిశీలించాడు. లాహిరి మహాశయుల శరీరంలో ప్రాణమున్న జాడే లేదు.

ఉన్నట్టుండి చిరునవ్వు నవ్వుతూ “అయితే నేను చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ రాసి ఇవ్వు” అన్నారు లాహిరి.

చంద్రమోహన్ సంకటంలో పడ్డాడు. చటుక్కున్న ఒక ఆలోచన వచ్చింది. “డెత్ సర్టిఫికెట్ అయితే రాసిస్తాను, కానీ మీరు మాట్లాడుతున్నారు కదా! చనిపోయిన వారైతే మాట్లాడలేరు” అన్నాడు చంద్రమోహన్.

యోగిరాజులు విరగబడి నవ్వారు. “నువ్వన్నది నిజమే, కానీ మీ ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పైన, తెలుసుకోవలసింది చాలా ఉంది. మీ విజ్ఞాన శాస్త్రానికి అందదు.

కానీ యోగులైనవారు సహజంగా ఆ జ్ఞానాన్ని అన్వేషించగలరు” అన్నారు లాహిరి మహాశయులు.

ఈ సంఘటన చంద్రమోహన్ జీవితంలో ఎన్నడూ మరువలేనిది. ఆతడు వైద్యుడే కాదు, ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఉన్నాడు.

యోగిరాజులను కలకత్తా నివాసి ఒక బిడ్డను బ్రతికేటట్టు చేయమని ప్రార్ధించింది. పుట్టిన వారు మరణించే వారు.

“అభయా! నువ్వొకటి పాటించాలి. ఆడపిల్లను కంటావు. బ్రతుకుతుంది. కాని ఒక్క సంగతి. రాత్రి మొదటి జాములో పిల్ల పుడుతుంది.

పిల్ల పుట్టక ముందు నుంచి, ప్రొద్దుపొడిచేదాకా  పురిటి గదిలో దీపం వెలుగుతుండాలి. దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. ఇది ముఖ్య విషయం” అన్నారు ఆమెతో.

ఆడపిల్ల పుట్టింది. దీపం వెలుగుతోంది రాత్రి చివరి జాములో అభయ, మంత్రసాని కనులు మూతపడ్డాయి.

పెద్దగా చప్పుడు చేస్తూ పురిటి గదిలో తలుపులు తెరుచుకున్నాయి. వెంటనే అభయకు మెలకువ వచ్చింది.

లాహిరి మహాశయులు కొడిగట్టిన దీపం వేలెత్తి చూపిస్తూ, అభయా దీపం ఆరిపోకుండా చూడు, వెంటనే చమురు పొయ్యి” అన్నారు.

అభయ తత్తరపాటుతో లేచి నూనె పోసింది. కృతజ్ఞతగా గురువులను చూసింది. లాహిరి మహాశయులు అదృశ్యులయ్యారు.

ఎక్కడి కాశీ, ఎక్కడ కలకత్తా? తల్లిని మించిన ప్రేమను చూపేది గురువులే!

లాహిరి మహాశయులు సెప్టెంబర్ 26, 1895న మహాసమాధి చెందారు.

నేడు సెప్టెంబర్ 26. లాహిరి మహాశయుల వర్థంతి.

లాహరి మహాశయుల గురు ప్రేమను మనమూ పొందుదాము.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles