నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (5వ. భాగం)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై

 ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

వమనం చేసిన నీటితో ప్రమిదలు దగ్గరికి నడిచారు బాబా. వొత్తులు వేశారందులో. నూనెగా చెంబులోని నీటిని పోశారు. దీపాన్ని వెలిగించ జూశారు.
‘‘నీటితో దీపాలు ఏం వెలుగుతాయి?’’ అనుకున్నారు వ్యాపారులు. శ్యామాకి కూడా అదే అనుమానం. గాలికి దీపం ఆరిపోకూడదని, ఓ చేతిని అడ్డుపెట్టి, మరో చేత్తో దీపాన్ని వెలిగించారు బాబా. నీటి దీపం నూనె దీపం కంటే దేదీప్యమానంగా వెలగసాగింది.
దీపాలు ఒకొక్కటీ వెలిగిస్తూ వచ్చారు బాబా.
దీపావళి రూపుదిద్దుకుంది.శ్యామా ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. వ్యాపారులకు కూడా ఇది కలా? నిజమా? అనిపించింది. భయంతో లెంపలు వేసుకున్నారు. చాటు నుంచి తప్పుకుని, భక్తిగా బాబా ముందుకు వచ్చి నిల్చున్నారు.

‘‘సాయిబాబాకీ జై! సాయిబాబాకీ జై’’ అంటూ జేజేలు పలికారు.

అంతా క్షమించమన్నట్టుగా బాబా కాళ్ళ మీద పడ్డారు.

‘‘నూనె ఇవ్వడం, ఇవ్వకపోవడం మీ ఇష్టం. కాని ఉండి కూడా నూనె లేదని అబద్ధం ఆడడం తప్పు, పాపం కూడా! దీపం దైవంతో సమానం. రోజూ మీ నూనెతో దైవం ప్రకాశించేవాడు. మీ పాపాలన్నీ పోగొట్టేవాడు. ఇవాళ తనని తానే వెలిగించుకున్నాడు. చూడండి, ఎంత శోభాయమానంగా వెలిగిపోతున్నాడో! ఒకరి కారణంగా ఒకరు గొప్పవారు కాలేరు. ఎవరికి వారే గొప్పవారు. గొప్పతనం పెంచితే పెరిగేది కాదు, తుంచితే తరిగేది కాదు. అర్థం చేసుకోండి.’’ అన్నారు బాబా.

‘‘అర్థమయింది బాబా! అర్థమయింది.’’ అన్నారంతా. బాబాకి సాష్టాంగ ప్రణామాలు ఆచరించారు. వారిని దీవించాడు బాబా.
‘‘అల్లా మాలిక్‌’’ అంటూ ఆకాశం కేసి చూశారు.
ఆకాశంలో చంద్రుడూ, నక్షత్రాలూ బాబా పెట్టిన దీపాల ముందు వెలవెలబోతున్నట్టుగా కనిపించాయి.
‘‘ఈ రోజు నుంచి ఈ పవిత్ర స్థలాన్ని ‘ద్వారకామాయి’ అని పిలుద్దాం.’’ అన్నారు బాబా.
‘‘అలాగే బాబా’’ అన్నారంతా.

‘‘ధర్మార్థ కామ మోక్షాల్ని ప్రసాదించే పుణ్యక్షేత్రం ఈ స్థలం.’’ అన్నారు బాబా.

వెలుగులతో నిండిన ద్వారకామాయిని పరవశించిపోతూ చూశారంతా.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles